చైతన్యరధం ఈ-పేపర్
అభిప్రాయం
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
టీడీపీ లో చేరండి
విరాళం
Telugu Desam
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
TDP - తెలుగు దేశం పార్టీ
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
No Result
View All Result
Telugu Desam
Home ఆంధ్రప్రదేశ్

జగన్‌ రెడ్డి ఇసుక దోపిడీపై వాస్తవాలు తొక్కిపెడుతున్నారు! గనులశాఖ డైరెక్టర్‌ వెంకటరెడ్డి చెప్పేవన్నీ పచ్చి అబద్ధాలే: పట్టాభి

రాష్ట్రంలో ఇసుకతవ్వకాలు జేపీ వెంచర్స్‌ సాగిస్తుంటే జీఎస్టీ రిటర్నులు ఎందుకు ఫైల్‌ చేయడం లేదని ఆయన ప్రశ్నించారు

by చైతన్యరధం
Nov 15, 2023 at 4:01pm
in ఆంధ్రప్రదేశ్, చైతన్యరధం, తాజా సంఘటనలు, ముఖ్య వార్తలు
జగన్‌ రెడ్డి ఇసుక దోపిడీపై వాస్తవాలు తొక్కిపెడుతున్నారు! గనులశాఖ డైరెక్టర్‌ వెంకటరెడ్డి చెప్పేవన్నీ పచ్చి అబద్ధాలే: పట్టాభి
Share on FacebookShare on TwitterShare on Whatsapp
  • విషప్రచారం మాని, మేము అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పాలి
  • జేపీ వెంచర్స్‌ సంస్థ కాలపరిమితి నిజంగా ప్రభుత్వం పొడిగిస్తే, డాక్యుమెంట్లు ఎందుకు బయటపెట్టడం లేదు?
  • అయినా ఆ సంస్థ పేరుతో వే బిల్లులు ఎలా ఇస్తున్నారు?
  • రాష్ట్రంలో ఇసుక తవ్వకాలు జగన్‌ రెడ్డి, ఇసుకమాఫియా చేతుల్లోనే
  • విచ్చలవిడిగా సాగుతున్న జగన్‌ రెడ్డి అండ్‌ కో ఇసుక దోపిడీ సీఐడీకి కనిపించడం లేదా?

అమరావతి: ఇసుకాసురుడు జగన్‌ రెడ్డి ఇసుకమాఫియా సాగిస్తున్న దోపిడీపై… క్షేత్రస్థాయిలో రాష్ట్రంలో జరుగుతున్న ఇసుక అక్రమ తవ్వకాలపై టీడీపీ పోరాటం చేస్తోంటే, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, గనులశాఖ డైరెక్టర్‌ వెంకటరెడ్డి ఇప్పటికీ వాస్తవాలు దాచి, జయప్రకాశ్‌ పవర్‌ (జేపీ) వెంచర్స్‌ సంస్థే ఇసుక తవ్వకాలు జరుపుతోందని చెబుతూ, దోపిడీని కప్పిపుచ్చే ప్రయత్నం చేస్తున్నారని టీడీపీ జాతీయ అధికారప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్‌ విమర్శించారు. ప్రధాన ప్రసార మాధ్యమాలన్నీ కూడా పాలకుల ఇసుకదోపిడీని ఎప్పటికప్పుడు ఆధారాలతో ప్రజల ముందు ఉంచుతున్నాయని, మరోపక్క ముఖ్యమంత్రి కొత్త ఇసుక పాలసీ పేరుతో టెండర్ల నిబంధనలు అన్నీ మార్చేసి తమ్ముడు అనిల్‌ రెడ్డికి, తన బినామీలకు ఏపీలోని ఇసుక రీచ్‌ లు గంపగుత్తగా అప్పగించడానికి తెరవెనుక ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు. మంగళగిరిలోని పార్టీ జాతీయ కార్యాలయంలో మంగళవారం పవర్‌ పాయింట్‌ ప్రజంటేషన్‌ ద్వారా  మీడియాపై… టీడీపీపై డైరెక్టర్‌ ఆఫ్‌ మైన్స్‌ అండ్‌ జియాలజీ వెంకటరెడ్డి చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని విలేకరుల సాక్షిగా ఆధారాలతో పట్టాభి ఖండిరచారు.

పైకి జయప్రకాశ్‌ పవర్‌ వెంచర్స్‌ పేరు చెబుతూ, యథేచ్ఛగా జిల్లాలవారీగా జగన్‌ రెడ్డి కనుసన్నల్లో పనిచేస్తున్న వైసీపీ ఇసుక మాఫియా డాన్ల ద్వారానే  ప్రభుత్వం ఇసుక తవ్వకాలు సాగిస్తోంది. వాస్తవాలు బయటపెడుతున్న ప్రతిపక్షాలు.. మీడియాపై మంత్రులు.. వెంకటరెడ్డి లాంటి అధికారులు తమ అక్కసు వెళ్లగక్కుతున్నారు. వెంకటరెడ్డి అయితే ఒకడుగు ముందుకేసి, మీడియాపై మండిపడుతూ, ముఖ్యమంత్రిపై అకారణంగా తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని ఎగిరిపడ్డాడు. ఆయన వాదనే నిజమైతే మేము అడిగే ప్రశ్నలకు ఏం సమాధానం చెబుతాడు? నిజంగా జయప్రకాశ్‌ పవర్‌ వెంచర్స్‌ వారి లీజు కాలపరిమితిని జగన్‌ ప్రభుత్వం పొడిగించి ఉంటే, దానికి సంబంధించిన డాక్యుమెంట్స్‌ (అగ్రిమెంట్‌ కాపీలు, ఇతర వివరాలు) ఎందుకు బయటపెట్టడం లేదో సమాధానం చెప్పకుండా వెంకటరెడ్డి, మరికొందరు అధికారులు జగన్‌ మెప్పుకోసం మీడియాపై, టీడీపీపై నోరుపారేసుకుంటున్నారు. టెండర్‌ గడువు ముగిశాక మరలా కాలపరిమితి పెంచడానికి వీల్లేదు. పోనీ పెంచినట్టయితే.. దానికి సంబంధించిన సమాచారం ప్రజల ముందు ఉంచడానికి ప్రభుత్వం ఎందుకు భయపడుతోంది? ఇవన్నీ గమనించాకే టీడీపీకి… ప్రజలకు అనుమానాలు ఎక్కువయ్యాయి. గతంలో ప్రభుత్వం జయప్రకాశ్‌ పవర్‌ వెంచర్స్‌ సంస్థకు ఇచ్చిన ఇసుక తవ్వకాల టెండర్‌ గడువు 2023, మే నెలతో ముగిసినా, ఆ సంస్థే ఇప్పటికీ రాష్ట్రవ్యాప్తంగా ఇసుక తవ్వకాలు సాగిస్తోంది.. వారికి మరికొంత కాలం ప్రభుత్వం సమయం ఇచ్చిందని చెబుతున్న డైరెక్టర్‌ ఆఫ్‌ మైన్స్‌ అండ్‌ జియాలజీ వెంకటరెడ్డి, ప్రభుత్వ వాదనల్లో నిజం లేదని పట్టాభి స్పష్టం చేశారు.

సంబంధితవార్తలు

వైసీపీ సైకోలకు ఐపీసీ సెక్షన్ల పవర్‌ చూపిస్తాం

దోపిడీయే జగన్‌ ఇసుక పాలసీ

జగన్‌ సర్కార్‌కు ఎదురుదెబ్బ

 

జేపీ వెంచర్స్‌ తవ్వకాలు జరిపితే జీఏస్టీ ఎందుకు చెల్లించటం లేదు..

ఇసుక తవ్వకాలకు సంబంధించి జగన్‌ రెడ్డి సర్కార్‌ వాదనే నిజమైతే… ఇప్పటికీ జయప్రకాశ్‌ పవర్‌ వెంచర్స్‌ సంస్థే ఇసుక తవ్వకాలు సాగిస్తున్నట్టయితే, ఆ సంస్థ జీఎస్టీ రిటర్న్స్‌ ఫైల్‌ చేయాలి. ఆ రిటర్న్స్‌ ను టీడీపీ పరిశీలిస్తే.. వాస్తవాలు బయటకు వచ్చాయి. జయప్రకాశ్‌ పవర్‌ వెంచర్స్‌ సంస్థ పేరుతో ఉన్న జీఎస్టీ నంబర్‌ 37AAAజజీ6297ఖ1్గ0.  ఆ నంబర్‌ పై జయప్రకాశ్‌ పవర్‌ వెంచర్స్‌ వారు, 2023-24 ఏప్రిల్‌ వరకు జీఎస్టీ రిటర్న్స్‌ ఫైల్‌ చేశారు. తరువాత మే, జూన్‌, జూలై, ఆగస్ట్‌, సెప్టెంబర్‌, అక్టోబర్‌ వరకు జీఎస్టీ రిటర్న్స్‌ ఫైల్‌ చేయలేదు. వెంకటరెడ్డి చెప్పేదే నిజమైతే, జయప్రకాశ్‌ పవర్‌ వెంచర్స్‌ వారికే జగన్‌ సర్కార్‌ ఇసుక తవ్వకాల కాలపరిమితి పొడిగిస్తే, రాష్ట్రంలోని అన్ని రీచ్‌ లలో ఇసుక తవ్వకాలు ఆ సంస్థే జరుపుతున్నట్టయితే ప్రతి నెలా జీఎస్టీ రిటర్న్స్‌ ఎందుకు ఫైల్‌ చేయడంలేదో వెంకటరెడ్డి చెప్పాలి. రిటర్న్స్‌ ఫైల్‌ చేయలేదంటే.. రాష్ట్రంలో ఇసుక తవ్వకాలు జయ ప్రకాశ్‌ పవర్‌ వెంచర్స్‌ జరపడంలేదని అర్థం. నిజంగా ఆ సంస్థే తవ్వకాలు జరిపితే.. కచ్చితంగా జీఎస్టీ చెల్లింపులు చేయాలి. చేయకుంటే అదో పెద్ద నేరం. ఒక నెల రిటర్న్స్‌ ఫైల్‌ చేయలేదంటే ఏవో సమస్యలు అనుకోవచ్చు. కానీ 6 నెలలు చేయలేదంటే.. దాని అర్థం ముమ్మాటికీ జయప్రకాశ్‌ పవర్‌ వెంచర్స్‌ సంస్థ రాష్ట్రంలో ఇసుక తవ్వకాలు జరపడంలేదనే. ఆ సంస్థ ఎప్పుడో రాష్ట్రంలో తమ దుకాణం కట్టేసి తట్టాబుట్టా సర్దుకొని వెళ్లిపోయింది అనడానికి ఇదే నిదర్శనం. వెంకటరెడ్డి, జగన్‌ రెడ్డి సర్కార్‌.. ఆయన మంత్రులు చెబుతున్నదంతా పచ్చి అబద్ధం అనడానికి ఇదే పెద్ద నిదర్శనం.

జయప్రకాశ్‌ పవర్‌ వెంచర్స్‌ పేరుతో జగన్‌ ప్రభుత్వమే రాష్ట్రంలో ఇసుకతవ్వకాలు జరుపుతోంది. జీఎస్టీ చెల్లింపులు చేయని జయప్రకాశ్‌ పవర్‌ వెంచర్స్‌ సంస్థ పేరుతో వే బిల్లులు ఎలా ఇస్తున్నారో కూడా ప్రభుత్వం సమాధానం చెప్పాలి. జయప్రకాశ్‌ పవర్‌ వెంచర్స్‌ కు.. గత 6 నెలలుగా రాష్ట్రంలో జరుగుతున్న ఇసుక తవ్వకాలకు ఎలాంటి సంబంధంలేదు. జగన్‌ రెడ్డి తన దోపిడీ కోసం ఇప్పటికీ జయప్రకాశ్‌ పవర్‌ వెంచర్స్‌ ను వాడుకుంటూ, ఆ సంస్థ ముసుగులో తప్పుడు వే బిల్లులు ఇస్తూ, తన ఇసుక మాఫియా సాయంతో విచ్చలవిడిగా రాష్ట్రంలో ఇసుక తవ్వకాలు.. అమ్మ కాలు సాగిస్తున్నాడు. ఒక రాష్ట్ర ప్రభుత్వమే ఈ విధంగా దొంగ వే బిల్లులతో ఇసుక వ్యాపారం చేయడం దేశంలో మరెక్కడా చూసి ఉండరు. ఇంతకంటే పెద్ద స్కామ్‌ మరోటి లేదు. ఈ విధంగా అడ్డగోలుగా జరిపే దోపిడీ ఏదీ సీఐడీ విభాగానికి కనిపించదని పట్టాభి విమర్శించారు.

 

కేసు నమోదు చేసి విచారించే ధైర్యం సీఐడీ చీఫ్‌ సంజయ్‌కు ఉందా?

టీడీపీ ప్రభుత్వంలో ఉచితంగా ప్రజలకు ఇసుక ఇవ్వడం మాత్రం పెద్దనేరం. మేం  ప్రజల ముందు ఉంచిన ఆధారాలతో జగన్‌ సర్కార్‌ ఇసుక దోపిడీపై సీఐడీకి ఫిర్యాదు చేస్తాం.  మేమిచ్చిన ఆధారాల ఆధారంగా ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసి, వెంకటరెడ్డి.. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి.. ముఖ్యమంత్రి జగన్‌ రెడ్డిలను విచారించే ధైర్యం సీఐడీ చీఫ్‌ సంజయ్‌ ఉందా?  రాష్ట్రంలో జరుగుతున్న ఇసుక కుంభకోణంలో ఏ-1 జగన్‌ రెడ్డి అయితే.. ఏ-2  మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఏ-3 డైరెక్టర్‌ ఆఫ్‌ మైన్స్‌ అండ్‌ జియాలజీ వెంకటరెడ్డి. వీళ్లందరిపై కేసులు పెట్టి, వారిని విచారించే ధైర్యం సీఐడీకి ఉందా? పేదలపై భారం పడకూడదని.. ప్రజలు ఇబ్బంది పడకూడదని గత ప్రభత్వంలో చంద్రబాబునాయుడు ఇసుకను ఉచితంగా అందిస్తే,  అది నేరమంటున్న సీఐడీకి..కళ్లముందు విచ్చలవిడిగా సాగుతున్న జగన్‌ రెడ్డి అండ్‌ కో ఇసుక దోపిడీ కనిపించడం లేదా? ఇంతపెద్ద కుంభకోణం కళ్లముందు కనిపిస్తుంటే, కొద్దిరోజుల క్రితం వెంకటరెడ్డి మీడియా ముందుకొచ్చి నిస్సిగ్గుగా జయప్రకాశ్‌ పవర్‌ వెంచర్స్‌ పేరే చెప్పాడు. ఇసుక దోపిడీద్వారా ప్రతిసంవత్సరం తాడేపల్లి ప్యాలెస్‌ కు రూ.10 వేలకోట్లు చేరుతున్నాయి. ఆ లెక్కన గడచిన 6 నెలల కాలంలో దాదాపు రూ.5 వేల కోట్లు చేరాయి. జయప్రకాశ్‌ పవర్‌ వెంచర్స్‌ పేరుచెబుతూ.. జిల్లాల వారీగా చేస్తున్న ఇసుకదోపిడీ..మద్యం దోపిడీ.. ఇతర దోపిడీల ద్వారా వచ్చే సొమ్ముతో  ఓట్లు కొని, వచ్చే ఎన్నికల్లో గెలవాలన్నదే జగన్‌ రెడ్డి దుష్ట పన్నాగమని పట్టాభి విమర్శించారు.

 

కేంద్ర సంస్థలైన విజిలెన్స్‌, సీబీఐ, ఈడీ దర్యాప్తు జరిపితేనే..

చంద్రబాబు ప్రజలకు ఉచితంగా ఇసుకను అందిస్తే.. అది తప్పని చెబుతూ, ఆయనపై అక్రమంగా కేసు పెట్టిన సీఐడీ వైఖరిని ప్రజలంతా నిలదీయాలి. రాష్ట్రంలో జరుగుతున్న ఇసుక దోపిడీపై ఇప్పటికే టీడీపీ కేంద్ర దర్యాప్తు సంస్థలకు ఫిర్యాదు చేసింది.  ఈ వ్యవహారంలో ఈడీ (ఎన్‌ ఫోర్స్‌ మెంట్‌ డైరెక్టరేట్‌) కూడా దృష్టిపెట్టాలి.  కచ్చితంగా కేంద్ర విజిలెన్స్‌.. సీబీఐ..ఈడీ వంటి సంస్థలు దర్యాప్తు చేస్తేనే జగన్‌ రెడ్డి నాలుగున్నరేళ్లుగా సాగించిన ఇసుక దోపిడీ గుట్టుమట్లు ప్రపంచానికి తెలుస్తాయి. ఆయా విభాగాలన్నింటికీ కూడా మా వద్ద ఉన్న ఆధారాలు అందించి విచారణ జరపాలని లేఖలు రాస్తాం. సీఐడీ తమ ఫిర్యాదుపై స్పందించి, నేడు రాష్ట్రం లో జరుగుతున్న ఇసుక కుంభకోణంపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయకపోతే, న్యాయస్థానాలను ఆశ్రయించైనా సరే జగన్‌ రెడ్డి ఇసుకదోపిడీ అంతు తేలుస్తామని పట్టాభిరామ్‌ స్పష్టం చేశారు.

Tags: అక్రమ ఇసుకఇసుక అవినీతిఇసుక దోపిడీకొమ్మారెడ్డి పట్టాభిరామ్‌
Previous Post

వియ్‌ హేట్‌ జగన్‌ అని.. దళితులు నినదిస్తున్నారు: వర్ల

Next Post

వైసీపీ భూస్థాపితం అయ్యే ముందు బూటకపు శంకుస్థాపనలా? – దేవినేని ఉమామహేశ్వరరావు మీడియా సమావేశం.

మరిన్ని వార్తలు

చైతన్యరధం ఈ పేపర్ 23-10-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 23-10-2026

కార్యకర్త
@ October 23, 2026
చైతన్యరధం ఈ పేపర్ 22-10-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 22-10-2026

కార్యకర్త
@ October 23, 2026
నిత్యవసరాల ధరలను కట్టడి చేయాలి
ఆంధ్రప్రదేశ్

నిత్యవసరాల ధరలను కట్టడి చేయాలి

చైతన్యరధం
@ October 22, 2026
గొడ్డలి పార్టీకి దెబ్బకొట్టాలి ‘స్థానికం’లో కూటమే గెలవాలి
ఆంధ్రప్రదేశ్

కోర్టు తీర్పులను వక్రీకరించి గొడ్డలిపార్టీ కుట్రలు

చైతన్యరధం
@ October 22, 2026
చైతన్యరధం ఈ పేపర్ 20-10-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 20-10-2026

కార్యకర్త
@ October 20, 2026
అల్ట్రాటెక్ ఆధ్వర్యంలో రూ.2,650 కోట్లతో పెట్నికోట సిమెంట్ వర్క్స్ ప్రాజెక్ట్
ఆంధ్రప్రదేశ్

అల్ట్రాటెక్ ఆధ్వర్యంలో రూ.2,650 కోట్లతో పెట్నికోట సిమెంట్ వర్క్స్ ప్రాజెక్ట్

చైతన్యరధం
@ October 20, 2026
ప్రజాస్వామ్యబద్ధంగా స్థానిక ఎన్నికలు
ఆంధ్రప్రదేశ్

ప్రజాస్వామ్యబద్ధంగా స్థానిక ఎన్నికలు

చైతన్యరధం
@ October 20, 2026
స్థానిక ఎన్నికల్లోనూ.. కూటమికి జై కొట్టండి
ఆంధ్రప్రదేశ్

హింస.. నా డిక్షనరీలోనే లేదు

చైతన్యరధం
@ October 20, 2026
Load More

ముఖ్య వార్తలు

గొడ్డలి పార్టీకి దెబ్బకొట్టాలి ‘స్థానికం’లో కూటమే గెలవాలి

కోర్టు తీర్పులను వక్రీకరించి గొడ్డలిపార్టీ కుట్రలు

చైతన్యరధం
@ October 22, 2026
స్థానిక ఎన్నికల్లోనూ.. కూటమికి జై కొట్టండి

హింస.. నా డిక్షనరీలోనే లేదు

చైతన్యరధం
@ October 20, 2026
స్థానిక ఎన్నికల్లోనూ.. కూటమికి జై కొట్టండి

స్థానిక ఎన్నికల్లోనూ.. కూటమికి జై కొట్టండి

చైతన్యరధం
@ October 20, 2026
దుర్గమ్మకు చీర, సారె సమర్పణ

దుర్గమ్మకు చీర, సారె సమర్పణ

చైతన్యరధం
@ October 17, 2026
మరిన్ని

అత్యధికంగా వీక్షించినవి

ఆదర్శ నియోజకవర్గంగా మంగళగిరి!

ఆదర్శ నియోజకవర్గంగా మంగళగిరి!

చైతన్యరధం
@ August 9, 2026 6:20 AM
దళితులపై జగన్‌ది కపట ప్రేమ!

దళితులపై జగన్‌ది కపట ప్రేమ!

చైతన్యరధం
@ July 9, 2026 6:00 AM
చంద్రబాబు విజన్‌తో విద్యుత్ ధగధగలు 

చంద్రబాబు విజన్‌తో విద్యుత్ ధగధగలు 

చైతన్యరధం
@ April 29, 2026 7:10 AM
అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

చైతన్యరధం
@ March 8, 2026 6:30 AM
మరిన్ని

తాజా సంఘటనలు

నిత్యవసరాల ధరలను కట్టడి చేయాలి

నిత్యవసరాల ధరలను కట్టడి చేయాలి

చైతన్యరధం
@ October 22, 2026
గొడ్డలి పార్టీకి దెబ్బకొట్టాలి ‘స్థానికం’లో కూటమే గెలవాలి

కోర్టు తీర్పులను వక్రీకరించి గొడ్డలిపార్టీ కుట్రలు

చైతన్యరధం
@ October 22, 2026
అల్ట్రాటెక్ ఆధ్వర్యంలో రూ.2,650 కోట్లతో పెట్నికోట సిమెంట్ వర్క్స్ ప్రాజెక్ట్

అల్ట్రాటెక్ ఆధ్వర్యంలో రూ.2,650 కోట్లతో పెట్నికోట సిమెంట్ వర్క్స్ ప్రాజెక్ట్

చైతన్యరధం
@ October 20, 2026
ప్రజాస్వామ్యబద్ధంగా స్థానిక ఎన్నికలు

ప్రజాస్వామ్యబద్ధంగా స్థానిక ఎన్నికలు

చైతన్యరధం
@ October 20, 2026
మరిన్ని
TDP-Logo-mini
మన పార్టీ
  • మన సిద్ధాంతం
  • జై హింద్ - జై తెలుగుదేశం
  • మన చరిత్ర
  • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
  • కార్య నిర్వాహక వర్గం
మన నాయకత్వం
  • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
  • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
  • NTR శత జయంతి ఉత్సవాలు
మన విజయాలు
  • భారత దేశం
  • ఆంధ్ర ప్రదేశ్
  • తెలంగాణ
  • 44 సంవత్సరాల విజయాలు
డౌన్లోడ్స్
  • మ్యానిఫెస్టో
  • మహానాడు 2022 తీర్మానాలు
  • నాయకుడితో నా చిత్రం
  • లోగోలు
  • నాయకుల చిత్రాలు
ప్రచార సమాచారం
  • బ్యానర్స్ / బుక్ లెట్స్
  • పోస్టర్స్ / కరపత్రాలు
  • ప్రచార గీతాలు
  • ఎన్నికల సమాచారం / సూచనలు
మీడియా వనరులు
  • పత్రికా ప్రకటనలు
  • ప్రసంగాలు
  • కార్యక్రమాలు
  • ముఖాముఖి & కథనాలు
  • ఫోటో గ్యాలరీ
  • వీడియో గ్యాలరీ

© 2026 తెలుగుదేశం పార్టీ. Privacy Policy | Terms Conditions.

Telegram Whatsapp Facebook Twitter Instagram Youtube
Sanbrains

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist

No Result
View All Result
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారతదేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • TDP పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • విరాళం
  • అభిప్రాయం
  • చైతన్యరధం ఈ-పేపర్
  • జిల్లా వెబ్‌సైట్‌లు
    • Ananthapuramu
    • Anakapalli
    • Bapatla
    • Chittoor
    • EastGodavari
    • Eluru
    • Guntur
    • Kadapa
    • Kakinada
    • Krishna
    • Kurnool
    • Manyam
    • Nandyala
    • Nellore
    • Palnadu
    • Prakasam
    • Srikakulam
    • Tirupati
    • Visakhapatnam
    • Vizianagaram
    • WestGodavari
  • సూపర్ 6

© 2026 Telugu Desam Party.