- జగన్మోహన్రెడ్డి పాలనలో మహిళలకు రక్షణ కరువైంది
- పోలీసుల నిర్లక్ష్యం వల్లే నిందితులు పరారయ్యారు
- అత్యాచారానికి గురైన బాలికకు రూ.కోటి పరిహారం ఇవ్వాలి
మంగళగిరి: విశాఖపట్నంలో దళిత మైనర్ బాలిక గ్యాంగ్ రేప్ ఘటనపై ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి నోరుమెదకపోవడం దారుణమని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి వర్ల రామయ్య తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఈ మేరకు రామయ్య ఒక ప్రకటన విడుదల చేస్తూ… విశాఖపట్నంలో మైనర్ బాలికపై జరిగి అఘాయిత్యంపై ముఖ్యమంత్రి జగన్ సిగ్గుతో తలదించుకోవాలన్నారు. రోజుల తరబడి మైనర్ బాలికపై అత్యాచారానికి పాల్ప డుతుంటే పోలీసు యంత్రాంగం ఏం చేస్తోందని నిలదీ శారు.అత్యంత అమానవీయమైన ఈఘటనపై ప్రభుత్వం తక్షణమే స్పందించి కామాంధులపై కఠిన చర్యలు తీసు కోవాలని డిమాండ్ చేశారు. సభ్యసమాజం తలదించు కునే ఈ దారుణ ఘటనపై ముఖ్యమంత్రి ఎలాంటి ప్రక టన చేయకపోవడంపై ఆయన దిగ్భ్రాంతివ్యక్తం చేశారు. పోలీసుల నిర్లక్ష్యం వల్లే విశాఖ ఘటనలో ఇద్దరు ప్రధాన నిందితులు వేరే రాష్ట్రానికి పారిపోయారన్నారు.
ఎన్సీఆర్బీ నివేదిక ప్రకారం రాష్ట్రంలో మహిళలపై 1,48,578 నేరాలు జరిగాయని ఈ సందర్భంగా గుర్తు చేశారు. జగన్ పాలనలో మహిళలపై నేరాలు 43శాతం పెరిగాయని, దేశం మొత్తమ్మీద మహిళలపై నేరాల్లో రాష్ట్రం 3వ స్థానంలో ఉందని చెప్పారు. ఈ సందర్భంగా వర్ల రామయ్య వైసీపీ ప్రభుత్వానికి సూటిప్రశ్నలు సంధించారు.
1. విశాఖ ఘటనలో ఇద్దరు ప్రధాన నిందితులను ఇప్పటికీ ఎందుకు అదుపులోకి తీసుకోలేదు?
2. రాష్ట్రంలో మహిళలకు ఎందుకు రక్షణ లేదు? మన సోదరీమణులకు రక్షణ కల్పించడంలో ప్రభుత్వం ఎందుకు విఫలమైంది?
రాష్ట్రంలో మహిళల భద్రతకు టీడీపీ కట్టుబడి ఉంద ని వర్ల రామయ్య స్పష్టం చేశారు. నిందితులపై చట్టప రంగా కఠిన చర్యలు తీసుకోవాలి.బాధితురాలిపై రోజుల తరబడి సామూహిక అత్యాచారం జరుగుతున్నా… పోలీ సుల నుంచి ఎలాంటి చర్యలు లేకపోవడం శాంతిభద్ర తల వైఫల్యానికి నిదర్శనం. ఆంధ్రప్రదేశ్‌లో శాంతిభద్రత ల పరిస్థితి దారుణంగా ఉంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో క్షీణించిన మహిళల భద్రతపై సీఎం జగన్ రెడ్డి లేదా ఆయన అనుచరుల వద్ద సమాధానాలు ఉన్నాయా అని వర్ల రామయ్య ప్రశ్నించారు.
రాష్ట్రంలో జగన్మోహన్రెడ్డి పాలనలో దళితులు, దళిత మహిళలకు రక్షణలేకుండా పోయిందని ఆందోళన వ్యక్తం చేశారు.దళితులపై దాడులు, అత్యాచారాల్లో దేశం మొత్తమ్మీద ఏపీ ప్రథమస్థానంలో ఉందని తెలిపారు. జగన్ ప్రభుత్వం రక్షణ కల్పించలేని పరిస్థితుల్లో దళితు లు రాష్ట్రంలో ఉండాలా, పొరుగు రాష్ట్రాలకు వలస వెళ్లాలో చెప్పాలని ఆగ్రహం వ్యక్తంచేశారు. విశాఖపట్నం లో సామూహిక అత్యచారానికి గురైన దళిత బాలికకు రూ. కోటి ఎక్స్ గ్రేషియా ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ కేసులో ప్రధాన నిందితుడ్ని వెంటనే అరెస్ట్‌చేసి, జ్యుడీషియల్ కస్టడీకి పంపాలని డిమాండ్ చేశారు. విశాఖ ఘటనపై ప్రత్యేక న్యాయస్థానాన్ని ఏర్పాటు చేసి, నిందితుల విచారణను వేగవంతంగా జరపాలని వర్ల రామయ్య డిమాండ్ చేశారు.