ఒక హంతకుడు సభ నిర్వహించడం దేశ చరిత్రలో రంపచోడవరంలోనే జరిగిందని టీడీపీ నేత, మాజీ మంత్రి జవహర్ అన్నారు. అనంతబాబు దళిత సమాజానికి సవాల్ విసిరారని ఆగ్రహించారు. వైసీపీ ప్రభుత్వంలో దళితులపై జరిగిన దాడులను అన్ని పక్షాలు కలిసి ఎదుర్కొందామని పిలుపునిచ్చారు. జగన్ తల్లి బైబిల్ పట్టుకుంటే వీరు నిజంగానే క్రైస్తవులు అని నమ్మాం కానీ, వీరు క్రైస్తవులు కాదు.. అలాగని హిందువూ కాదని అన్నారు. వెంకటేశ్వర స్వామికి ఇప్పటి వరకు ఒక్కసారి కూడా సీఎం దంపతులు కలిసి పట్టు వస్త్రాలు సమర్పించలేదని అన్నారు. వైసీపీ పాలనలో దళితులకు జరిగిన అన్యాయంపై తీవ్రంగా పోరాడాల్సి ఉందని పిలుపునిచ్చారు. సుబ్రహ్మణ్యం తల్లిదండ్రుల పరిస్థితి దయనీయంగా మారిందని, వారికి టీడీపీ అండగా ఉంటుందన్నారు.