తన హయాంలో విద్యావ్యవస్థ నాశనానికి కంకణం కట్టుకున్న జగన్‌రెడ్డి..దారి తప్పిన విద్యావ్యవస్థను గాడిలో పెడుతున్న కూటమి ప్రభుత్వంపై విషం చిమ్మడంలో ఆశ్చర్యం లేదు. మంచి జరుగుతుంటే ఓర్వలేని నైజం ఆయనది. మనిషికి నిలువెల్లా విషమే అని అంటుంటారు. అది ఇటువంటి వారిని చూసే పుట్టుకొచ్చి ఉంటుంది. తన మూర్ఖపు నిర్ణ యాలతో సీబీఎస్‌ఈ తెచ్చి బైజూస్, ఐబీ కంటెంట్‌లతో విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటమా డిన ఆయన..సమస్యలపై పోరుబాట పట్టిన ఉపాధ్యాయులపైనా ఉక్కుపాదం మోపారు. మరుగుడొడ్లను శుభ్రం చేయించడం వంటి బాధ్యతలను అప్పగించి మానసికంగా హింసిం చారు. నేడు దెయ్యాలు వేదాలు వళ్లించినట్టు ఉపాధ్యాయులను తక్కువగా చూడటం మాను కోవాలంటూ కూటమి ప్రభుత్వాన్ని విమర్శిస్తూ ఉపాధ్యాయులపై ప్రేమ ఒలకబోయటం ఆయన కపట నాటకానికి నిదర్శనం.
సన్నద్ధత లేకుండానే సీబీఎస్‌ఈ
రాష్ట్రంలో సీబీఎస్‌ఈ అనుబంధ ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న పదో తరగతి విద్యార్థులకు ఈ ఏడాది రాష్ట్ర బోర్డు పరీక్షలు రాసేందుకు వెసులుబాటు కల్పిస్తూ విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ మంచి మనసుతో తీసుకున్న నిర్ణయాన్ని కూడా వక్రీకరించి నిత్యం తన రోత పత్రిక సాక్షిలో ప్రచారం చేయించడం సిగ్గుచేటు. గత వైకాపా ప్రభుత్వం ఉపాధ్యాయులకు ఎలాంటి శిక్షణ ఇవ్వకుండా వెయ్యి పాఠశాలలకు సీబీఎస్‌ఈ అనుబంధ గుర్తింపు తీసుకుంది. రాష్ట్ర బోర్డు పరీక్షలకు, సీబీఎస్‌ఈలకు వ్యత్యాసం ఉంటుంది. సీబీఎస్ ఈ పరీక్షలకు విద్యార్థులను సన్నద్ధం చేసేందుకు ఉపాధ్యాయులకు శిక్షణ ఇవ్వడంతో పాటు పరీక్షల విధానంలోనూ మార్పులు చేయాల్సి ఉంటుంది. కానీ అవేమీ పట్టించుకోకుండా సీబీఎస్‌ఈ విధానం తీసుకొచ్చారు.
విద్యార్థుల్లో సామర్థ్యాలు నిల్..దిద్దుబాటు చర్యలు
సీబీఎస్‌ఈ అనుబంధ ప్రభుత్వ బడుల్లో విద్యార్థుల సామర్థ్యాలను తెలుసుకునేందుకు ఇటీవల విద్యాశాఖ అంతర్గత పరీక్షలు నిర్వహించగా 64 శాతం మంది తప్పారు, 326 పాఠశాలల్లో ఒక్కరూ ఉత్తీర్ణులు కాలేదు, 556 బడుల్లో 25 శాతం లోపే ఉత్తీర్ణత నమో దైంది, 66 బడుల్లో 26 శాతం నుంచి – 50 శాతం మంది మాత్రమే ఉత్తీర్ణులయ్యారు, మొత్తం 77,478 మంది విద్యార్థులు పరీక్ష రాయగా 49,410 మంది తప్పారు. ఈ ఫలితా లు చూసిన విద్యాశాఖ మంత్రి లోకేష్ దిద్దుబాటు చర్యలకు పూనుకున్నారు. విద్యార్థులు సీబీఎస్‌ఈ విధానంలో పరీక్షలు రాసి ఉత్తీర్ణులయ్యే పరిస్థితి లేదని గ్రహించి ఈ ఏడాదికి సీబీఎస్‌ఈ విద్యార్థులను రాష్ట్ర బోర్డు పరీక్షలకు అనుమతించాలని నిర్ణయం తీసుకున్నారు.
సీబీఎస్‌ఈ పరీక్షా విధానంలో పదో తరగతి విద్యార్థులు ఫెయిలైతే వారిపై ఆ ప్రభావం ఎక్కువగా ఉంటుందని భావించారు. మానసికంగా ఎన్నో సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంద ని సీబీఎస్‌ఈ బడుల్లో చదివే 77,478 మంది పదో తరగతి విద్యార్థులకు ఈ విద్యా సంవత్సరంలో రాష్ట్ర బోర్డు పరీక్షలు రాసేలా ఊరట కలిగిస్తూ నిర్ణయం తీసుకుంది. దీనిని వక్రీకరిస్తూ పేద పిల్లలు బాగుపడటం ఇష్టం లేదా? అంగ్లం మాట్లాడటం ఇష్టం లేదా? మా హయాంలో విద్యావ్యవస్థ వెలిగిపోయిందంటూ బొంకు కబుర్లు చెప్పటం వారి మూర్ఖత్వా నికి, అవివేకానికి నిదర్శనం.
ప్రపంచ బ్యాంకు రుణం కోసం అసంబద్ధ నిర్ణయాలు
ప్రభుత్వ పాఠశాలలను ఉద్ధరించాం..విద్యార్థులకు బంగారు భవిష్యత్తు కల్పించామని ఊదరగొట్టిన జగన్‌రెడ్డి అండ్ కో రూ.1862 కోట్ల రూపాయల ప్రపంచ బ్యాంకు రుణం కోసం అదే బడులకు తూట్లు పొడిచింది నిజం. ప్రపంచ బ్యాంకు రుణం కోసం ప్రభుత్వ బడులను మూసివేసి టీచర్ పోస్టులను రద్దు చేయించడాన్ని విద్యారంగ నిపుణులే తప్పుపట్టా రు. అటు విద్యార్థులు, ఇటు ఉపాధ్యాయుల భవిష్యత్తును రోడ్డు మీదకు జగన్మోహన్ రెడ్డి అస్తవ్యస్త పాలనను ఎలా మరిచిపోతారు? సబ్జెక్టు టీచర్లతో బోధనంటూ 3, 4, 5 తరగతు లను ప్రాథమిక పాఠశాలలను ఉన్నత పాఠశాలల్లో కలిపేసి ఒక మూర్ఖపు నిర్ణయంతో సెకండరీ గ్రేడ్ టీచర్లను సర్దుబాటు చేసి టీచర్ల మీద ఒత్తిడి పెంచడాన్ని ఉపాధ్యాయ లోకం మరచిపోలేదు. ఇప్పుడు అదే ఉపాధ్యాయులపై కపట ప్రేమ నటిస్తుంటే ఎలా నమ్మగలరు.
వైసీపీ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా 4,234 ప్రాథమిక పాఠశాలలను ఉన్నత, ప్రాథమికోన్నత పాఠశాలల్లో విలీనం చేసింది. 7 వేల ఆర్ట్, క్రాఫ్ట్, డ్రాయింగ్, ఇతర పోస్టులు రద్దు చేసింది. తరగతుల విలీనం కారణంగా విద్యార్థుల సంఖ్య తగ్గిపోయి 587 ప్రభుత్వ బడులు మూతప డ్డాయి. 1365 ఎయిడెడ్ బడులు కాలగర్భంలో కలిసిపోయాయి. 2021-22 సంవత్సరం లో 44,29,569 ఉన్న విద్యార్థుల సంఖ్య 2022 -23 నాటికీ 39,95,992కు పడిపో యింది. 2023-24 నాటికీ 35,69,506 పడిపోయినట్టు విద్యాశాఖ గణాంకాలు చెబు తున్నాయి. రాష్ట్రంలో ఎంతో చరిత్ర కలిగిన ఎయిడెడ్ విద్యా వ్యవస్థను సైతం వైసీపీ నాశ నం చేసింది. విద్యాసంస్థలను ఆస్తులతో సహా అప్పగిస్తే ప్రభుత్వమే నిర్వహిస్తుందని లేదంటే ఎయిడెడ్ సిబ్బందిని ప్రభుత్వానికి అప్పగించి ప్రైవేటుగా నిర్వహించుకోవాలని ఆదేశాలు జారీ చేసి వాటిని మూసేయించేలా కక్షసాధింపులకు దిగటం దుర్మార్గం.
హేతుబద్ధత లేని నిర్ణయాలు..విద్యాహక్కు చట్టానికి తూట్లు
చివరికి విద్యా హక్కు చట్టాన్ని మార్చేసి 3, 4, 5 తరగతులు మూడు కిలోమీటర్ల దూరంలోని ఉన్నత పాఠశాలల్లో విలీనం చేసేలా నిర్ణయం తీసుకోవడం గర్హనీయం. దాంతో 1, 2 తరగతుల్లో విద్యార్థుల సంఖ్య తగ్గిపోయి చాలా పాఠశాలలు మూతపడ్డాయి. రాష్ట్రం లో ఏకోపాధ్యాయ పాఠశాలలు లేకుండా చేస్తామని.. ప్రతి బడికీ ఇద్దరు ఉపాధ్యాయులను నియమిస్తామని డబ్బా మాటలు చెప్పి నమ్మించారు. కానీ వాస్తవానికి వాళ్ల విధానాల వల్ల 2020 అక్టోబరు నాటికి ఏకోపాధ్యాయ పాఠశాలలు 7,774 ఉండగా 2023 నాటికి 9,602కు పెరిగాయి. అదీ కాకుండా హేతుబద్ధీకరణ ఉత్తర్వుల ప్రకారం 20 మంది విద్యార్థులకు ఒక టీచర్‌ను నియమించాల్సి ఉన్నా ఎస్జీటీల కొరత పేరుతో 30-40 మందికి ఒక్కరినే నియమించారు. ఒకే గదిలోనే రెండు తరగతుల వారిని కూర్చోబెట్టడం వల్ల ఎవరి కి ఏ పాఠం చెబుతున్నారో అటు టీచర్లకు తెలిసేది కాదు. ఏమి వింటున్నారో విద్యార్థులకు అర్ధం అయ్యేది కాదు. అది కాకుండా టీచర్లను బోధనేతర పనులు మరుగుదొడ్ల ఫొటోలు, విద్యార్థుల ఆన్‌లైన్ హాజరు, పరీక్షల సమయంలో మండల కేంద్రం నుంచి ప్రశ్నపత్రాలు తెచ్చుకోవడం, మధ్యాహ్న భోజనం ఫొటోలు, విద్యాకానుక లెక్కలు వంటి బాధ్యతలు అప్ప గించి తీవ్రమైన ఒత్తిడి పెంచారు.
బైజూస్..ఐబీ…స్థిరత్వం లేని నిర్ణయాలు
నాలుగేళ్లలో రెండుసార్లు కొత్త సిలబస్ తెచ్చారు. సీబీఎస్‌ఈ తీసుకొచ్చి రెండేళ్లు తిరగకముందే మళ్లీ బైజూస్, తరువాత ఐబీ… ఇలా కాసుల కోసం విద్యార్థుల జీవితాలతో ఆడుకున్నారు. ఒక్క డీఎస్సీ వేసి టీచర్ పోస్టులు భర్తీ చేయకుండా సిలబస్ మార్చితే ఏం ఉపయోగం? పోనీ టీచర్లకు శిక్షణ ఇచ్చారా అంటే అది కూడా లేదు. 2019లో వైసీపీ ఇంగ్లీష్ మీడియాన్ని అందుబాటులోకి తీసుకొచ్చి స్టేట్ సిలబస్‌కు ప్రాధాన్యం తగ్గించేసింది. 2020-21లో సీబీఎస్‌ఈ అంటూ కొత్త రాగం అందుకుంది. 2021-22 నుంచి బైజూస్ కంటెంట్ అంటూ 8వ తరగతి విద్యార్థులకు, వారికి బోధించే టీచర్లకు కలిపి మొత్తం 5.18 లక్షల వరకూ ట్యాబ్‌లు పంపిణీ చేశారు. బైజూస్ కంటెంట్ బోధించేందుకు తగ్గట్టుగా ఉపాధ్యాయులకు శిక్షణ లేకుండా ఉపయోగం ఏమిటి అని మేధావులు వాపోయారు. అందులోనూ అక్రమాలు జరిగాయని ఆరోపణలు వెల్లువెత్తాయి.
ఉపాధ్యాయులపై కపట ప్రేమ
దెయ్యాలు వేదాలు వళ్లించినట్టు ప్రభుత్వ ఉపాధ్యాయులను తక్కువగా చూసే మనస్త త్వం మానుకోవాలి అని కూటమి ప్రభుత్వాన్ని విమర్శిస్తూ ఉపాధ్యాయులపై కపట ప్రేమ నటిస్తున్న జగన్‌రెడ్డి నాడు పీఆర్సీ సాధన కోసం ఉద్యమించిన ఉపాధ్యాయులపై లాఠీచార్జ్ చేయించిన ఘటన గుర్తులేదా? వారితో మరుగుదొడ్లను శుభ్రం చేయించి ఎన్నో రకాల పనులను అప్పగించి వారిని మానసిక ఒత్తిడికి గురిచేసి రాక్షసానందం పొందటం ఉపాధ్యా యులు మరిచిపోలేరు. అసలు నాటి ప్రభుత్వంలో సకాలంలో ఏ ఒక్క నెల అయినా ఒకటో తేదీన వారు జీతాలు అందుకున్న దాఖలాలు లేవు. సమస్యలపై ఆందోళనలకు దిగితే ఉక్కు పాదంతో అణచివేయించిన విషయాన్ని మరువరు. విద్యావ్యవస్థ నాశనానికి కంకణం కటు కున్న ఆయన ఇప్పుడు కూటమి ప్రభుత్వం మంచి చేస్తుంటే తట్టుకోలేక విషప్రచారం చేస్తూ నీచ రాజకీయాలు చేస్తే నమ్మేస్థితిలో లేరు.
కొనపల స్వరూప, అనలిస్ట్