ఆర్థిక ఉగ్రవాది.. దేశంలోనే ముఖ్యమంత్రులుగా పనిచేసిన వారిలో అత్యంత సంపన్నుడి గా పేరుగాంచిన వ్యక్తి.. పదేళ్లుగా వివిధ కేసుల్లో బెయిల్‌పై తిరుగుతున్న ఏ1 జగన్‌రెడ్డి నేడు న్యాయవ్యవస్థపైనా విషపూరిత కుట్రకు తెరలేపాడు. ఆర్థిక నేరాలకు పాల్పడి లక్షల కోట్లు దండుకుని 16 నెలలు జైల్లో చిప్పకూడు తినేలా చేసిన న్యాయవ్యవస్థ పరువు, ప్రతిష్టలను మంటగలిపేందుకు ఎదురుదాడికి దిగాడు. ప్రజల్లో న్యాయవ్యవస్థపై నమ్మకం సన్నగిల్లేలా గోబెల్స్ ప్రచారానికి తెరలేపాడు. తాను ఒక్కడే ఉత్తముడనని.. న్యాయవ్యవస్థతో సహా మిగిలిన వారంతా దుర్మార్గులేననేలా ప్రజలను నమ్మించేలా విష ప్రచారానికి పూనుకున్నారు. తాను చేసిన తప్పులను ఎదుటివారికి ఆపాదించడంలో దిట్ట అయిన ఆయనకు తన తప్పులను ఎత్తిచూపే వారిపై ఎదురుదాడి, వ్యక్తిత్వ హననం చేయించడం వెన్నతో పెట్టిన విద్య. తనకున్న నేర చరిత్ర తన ప్రత్యర్థికి కూడా ఉండాలని కోరుకునే సైకో మనస్తత్వం ఆయనది. అందుకే తన ప్రత్యర్థికి లేనిపోని నేరాలను, అవినీతిని అంటగట్టే ప్రయత్నాలు నిత్యం చేస్తూనే ఉంటాడు. ప్రతిపక్షంలో ఉన్నా, అధికారంలో ఉన్నా తన తీరు లో ఎలాంటి మార్పు ఉండదని నేటికీ నిరూపిస్తూనే ఉన్నాడు.
తెలుగు రాష్ట్రాల్లో చంద్రబాబు పేరు తెలియని వ్యక్తులు ఉండరు. ముఖ్యమంత్రిగా సుదీర్ఘ అనుభవం ఉన్న వ్యక్తి చంద్రబాబు. 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా చేసిన ఆయన మరో సారి అధికారం చేపట్టి ఏపీకి విశేష సేవలందిస్తున్న నిస్వార్థ సేవకుడు, ప్రజానాయకుడు. ఆయన హయాంలో ప్రతి అభివృద్ధి కార్యక్రమంలోనూ అవినీతి జరిగిందని నిరాధార ఆరోప ణలు చేస్తూ అవినీతిని ఆపాదించే కుట్రలో భాగంగా అసంబద్ధ కారణాలతో కోర్టుల్లో కేసు లు వేయించడం జగన్‌రెడ్డికి అలవాటుగా మారింది. తన తండ్రి, తాను, తన కుటుంబం, అనుచరగణం ఇప్పటివరకు చంద్రబాబుపై 28 సందర్భాల్లో విచారణలు జరిపించారు. కానీ ఏ ఒక్క దానిలో కూడా దోషి అని తెలిపే ఆధారాలను చూపించలేక పోయారు. ఈ విధంగా తన ప్రత్యర్థిపై లేనిపోని ఆరోపణలతో దోచుకున్న డబ్బును ఎరవేసి వ్యవస్థలను మేనేజ్ చేసి నేరస్తులుగా చిత్రీకరించే ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. ఇలాంటి ప్రయత్నాలపై తాజాగా తెలంగాణ హైకోర్టు చెప్పుదెబ్బ కొట్టేలా తీర్పునిచ్చింది. చంద్రబాబుపై జగన్మోహన్‌రెడ్డి అండ్ కో నేరస్తుడు అని నిరూపించేలా పలుమార్లు చేసిన విఫలయత్నాలు అనేకం.
కోర్టులను మేనేజ్ చేస్తున్నాడని చంద్రబాబుపై బురద
మనీలాండరింగ్, సీబీఐ, ఈడీ కేసుల్లో 16 నెలలు జైలు శిక్ష అనుభవించిన జగన్‌రెడ్డి బెయిల్‌పై బయటకువచ్చాడు. అప్పటినుంచి కేసులు ముందుకు కదలకుండా అడ్డుకుం టున్నది వాస్తవం కాదా? సీబీఐ కోర్టుకు విచారణకు హాజరుకాకుండా వ్యవస్థలను మేనేజ్ చేస్తున్నది నిజం కాదా? కోడికత్తి కేసులో కోర్టుకు విచారణకు హాజరుకాకుండా ఓ అమా యకుడిని ఐదేళ్ల పాటు జైలులో మగ్గబెట్టి వ్యవస్థలను మేనేజ్ చేయలేదా? దోచుకున్న డబ్బుతో వ్యవస్థలను మేనేజ్ చేస్తున్న జగన్‌రెడ్డి…తన అవ లక్షణాలను చంద్రబాబుకు అంట గట్టే ప్రయత్నాలు చేయడం కుట్రపూరితం అని తేలిపోయింది.
చంద్రబాబు అక్రమ అరెస్టు…వ్యవస్థలను మేనేజ్ చేయడం కాదా?
2016- 2018 మధ్య చంద్రబాబు ప్రభుత్వం రాష్ట్రంలో యువతకు నైపుణ్యాభివృద్ధి శిక్షణ (స్కిల్ డెవలప్‌మెంట్) ఇస్తామంటూ రూ.3,300 కోట్లకు సీమెన్స్ సంస్థ- డిజైన్‌టెక్ సంస్థలు ఒప్పందం చేసుకున్నాయి. చంద్రబాబుపై బురదజల్లే ప్రయత్నంలో భాగంగా స్కిల్ డెవలప్‌మెంట్‌లో అవినీతి జరిగిందని 2019లో అధికారంలోకి వచ్చిన జగన్‌రెడ్డి ప్రభుత్వం అక్రమ కేసు పెట్టి అరెస్టు చేసి 53 రోజులు జైలులో పెట్టారు. అప్పుడు బెయిల్ రాకుండా వ్యవస్థలను మేనేజ్ చేసింది మీరు కాదా?
జగన్‌రెడ్డి కేసుల వల్ల ఓ జడ్జి ప్రాణం బలి కాలేదా?
దేశంలోనే ముఖ్యమంత్రుల్లో అత్యంత సంపన్న ముఖ్యమంత్రిగా జగన్మోహన్‌రెడ్డి మొదటి స్థానంలో నిలిచారని ఏడీఆర్(అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్స్మ్) 2023 ఏప్రిల్ 13న నివేదిక ఇచ్చిన మాట వాస్తవం కాదా? అధికారులను, కోర్టులను మేనేజ్ చేస్తూ గత ఐదేళ్లు టీడీపీ నాయకులపై అక్రమ కేసులు బనాయించిన మాట వాస్తవం కాదా? నీ అక్రమ సంపాదనలో భాగంగా నాంపల్లి సీబీఐ కోర్టు జడ్జి ఆత్మహత్య చేసుకున్న మాట వాస్తవం కాదా?
ఆరేళ్లుగా వివేకా హత్య కేసును అడ్డుకుంటున్నది ఎవరు?
2019 మార్చి 15న వివేకానందరెడ్డి హత్య జరిగింది. అప్పటి ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి సీబీఐ విచారణ జరిపించాలని గవర్నర్‌ను కలిసి విన్నవించారు. అదే జగన్‌రెడ్డి అధికారంలోకి తర్వాత విచారణ ముందుకు సాగకుండా అడ్డుపడిన విషయం వాస్తవం కాదా? చెల్లెలు, వివేకా కుమార్తె సునీత స్వయానా వ్యవస్థలను మేనేజ్ చేస్తున్నారని అన్న మాట వాస్తవంగా కాదా? వివేకా హత్య కేసులో ప్రధాన నిందితుడు సోదరుడు అవినాష్‌రెడ్డి ని సీబీఐ పోలీసులు అరెస్టు చేసేందుకు వస్తే అధికార దుర్వినియోగంతో అరెస్టు కాకుండా సీబీఐని అడ్డుకుంది మీరు కాదా? ఇది వ్యవస్థలను మేనేజ్ చేయడం కాదా? ఐదేళ్ల అరాచక పాలనలో వైసీపీ నేతలు, కార్యకర్తలు చేసిన తప్పులను కప్పిపుచ్చి కాపాడుకుంటూ రావడం వ్యవస్థలను మేనేజ్ చేయడం కాక ఇంకేమవుతుంది?
చంద్రబాబుపై 28 కుట్రపూరిత విచారణలు
ముఖ్యమంత్రి చంద్రబాబుపై వైఎస్ కుటుంబం కుట్రపూరితంగా విచారణలు చేయించి ముద్దాయిగా నిలబెట్టేందుకు విఫలయత్నాలు చేసింది. 2004 నుంచి 2016 వరకు చంద్ర బాబు చేసిన పలు అభివృద్ధి కార్యక్రమాల్లో అవినీతి జరిగిందని తప్పుడు ఆరోపణలతో వై.ఎస్.రాజశేఖర్‌రెడ్డి, వై.ఎస్.విజయమ్మ, వై.ఎస్.జగన్మోహన్‌రెడ్డి, విజయసాయిరెడ్డి, వైసీపీ సానుభూతిపరులు టి.శ్రీరంగరావు, ఏబీకే ప్రసాద్, పాల్వాయి గోవర్ధన్‌రెడ్డి తదితరులు కేసులు వేసి 28 విచారణలు చేయించారు. కానీ ఏ ఒక్క దానిలోనూ చంద్రబాబు తప్పు చేశారని ఒక్క సాక్ష్యాన్ని కూడా సమర్పించలేకపోయారు. హైదరాబాద్‌లో క్రీడాభివృద్ధి కోసం 2003లో చంద్రబాబు 850 ఎకరాల స్థలాన్ని ఐఎంజీకి ఇచ్చారని..అందులో అవినీతి జరి గిందని విజయసాయిరెడ్డి 2012లో హైకోర్టులో పిల్ దాఖలు చేశాడు. దీనిపైనా తాజాగా తెలంగాణ హైకోర్టు వైఎస్ కుటుంబం, జగన్‌రెడ్డి అండ్ కోకు చెంపపెట్టు లాంటి తీర్పు నిచ్చింది. చంద్రబాబు అవినీతికి పాల్పడ్డారని ఒక్క ఆధారం కూడా ఇవ్వలేకపోయిందని కోర్టు పేర్కొంది. ఇలా గతంలో చంద్రబాబుపై వైఎస్ కుటుంబం కక్షపూరితంగా, వ్యవస్థల ను తప్పుదోవ పట్టించేలా అనేక నేరారోపణలు చేసి ముద్దాయిగా నిలబెట్టే ప్రయత్నం చేసి బొక్కబోర్లా పడిరది.
చంద్రబాబుపై విచారణల తీరిది
విచారణ విచారణల సంఖ్య
సభా సంఘాల విచారణలు 15
మంత్రివర్గ సంఘాల విచారణలు 3
న్యాయ విచారణలు 4
సీబీ సీఐడీ విచారణలు 1
ఉన్నతాధికారుల విచారణలు 5
మొత్తం 28
నిప్పుకు చెద పట్టదు అన్నది ఎంత నిజమో..చంద్రబాబుకు అవినీతి ఆపాదిం చాలనుకోవడం జరగదన్నది అంతే వాస్తవం. అవినీతి కేసుల్లో తన గురించి ప్రజలు మాట్లాడుకోకూడదు..తనను ఓ ఆర్థిక నేరగాడిలా చూడకూడదు అని అనిపించుకునేందుకు వ్యవస్థలను, నిజాయితీగల వ్యక్తులు, జడ్జిలు, సామాన్య ప్రజలు, ప్రతిపక్ష కార్యకర్తలు, నాయకులను బలితీసుకుంటూ ఈ రాష్ట్రానికి ఓ రావణాసురుడిలా తయారయ్యాడనేది అక్షర సత్యం. పదేళ్లుగా బెయిల్‌పై తిరుగుతున్న ఆయన కేసుల విచారణ వేగవంతమైతే శ్రీకృష్ణ జన్మస్థానానికి వెళ్లకతప్పదు. ఐదేళ్ల అరాచక పాలనలో ఎందరో అమాయకులను పొట్టన పెట్టుకున్న జగన్ రెడ్డికి వాళ్ల ఉసురు శాపమై వెంటాడక తప్పదు. తనను జైలుకు పంపిన వ్యవస్థల పరువు, ప్రతిష్టలను మంటగలుపుతున్న జగన్ రెడ్డి అండ్ కో అవే వ్యవస్థ ల చేతిలో శిక్షకు గురికాకా తప్పదు. జగన్‌రెడ్డి ఫేక్ ప్రచారం, గోబెల్స్ ప్రచారం మభ్య పెట్టడానికేనని రాష్ట్ర ప్రజలు అర్థం చేసుకునే రోజులు ఎంతో దూరంలో లేవు.
ఎలీషా మంగినపల్లి
రాజకీయ అనలిస్ట్