తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును జగన్‌రెడ్డి ప్రభుత్వం అక్రమంగా రాజమహేంద్రవరం కేంద్ర కారాగారంలో నిర్బంధించి నేటికి 38 రోజులు. 45 సంవత్సరాలుగా తెలుగు జాతి ఉన్నతికి పలు హోదా ల్లో మచ్చలేకుండా శ్రమించిన నిత్య కృషీవలుడు చంద్రబాబు తెలుగు జాతికి, అవిభక్త ఆంధ్రప్రదేశ్‌కు, నవ్యాంధ్రలకు అంతర్జాతీయంగా ఖ్యాతి తెచ్చారు. అటువంటి మహోన్నతుడు.. జగన్‌రెడ్డి కుట్రలో భాగంగా ఇన్నాళ్లుగా తానెంతగానో ప్రేమించే ప్రజలకు దూరంగా జైల్లో కాలం గడపాల్సి వచ్చింది.
జగనాసుర పాలన వాస్తవ నేపథ్యంలో నవ్యాంధ్ర ప్రజలకు పట్టిన గ్రహణాన్ని విడిపించే ప్రయత్నంలో భాగంగా రాష్ట్ర మంతా కలియ తిరుగుతూ ప్రజల్లో ఆయన తీసు కొచ్చిన చైతన్యాన్ని చూసి బెంబేలెత్తిన జగన్ రెడ్డి పలు అక్రమ కేసులు పెట్టి వీలైనంత ఎక్కువ కాలం చంద్రబాబును జైల్లోనే ఉంచాలనే కుట్రకు తెరతీశారు. స్కిల్ డెవలప్ మెంట్ కేసు, ఇన్నర్ రింగ్ రోడ్డు కేసు, ఫైబర్ గ్రిడ్ కేసు, అంగళ్లు కేసు ఈ కోవలోనివే.
ప్రధానాంశమేంటి?
స్థూలంగా.. 17ఏ ఎలాంటి సందర్భాల్లో వర్తిస్తుంది అన్న అంశంపై చంద్రబాబు, సీఐడీ తరపు సీనియర్ న్యాయవాదులు వాదనలు వినిపిస్తున్నారు.
ప్రజోపయోగం కోసం ప్రభుత్వాధికారులు నిర్భీతితో తీసుకున్న నిర్ణయాలను తరువాత వచ్చిన ప్రభుత్వాలు రాజకీయ కక్షతో వాటిని తిరగదోడి సంబంధిత వ్యక్తు లను వేధించకుండా నిరోధించే సదాశయంతో అవినీతి నిరోధక చట్టంలో 17ఏ పొందుపరిచారు. అయితే.. 17ఏ నవంబర్ 2018లో అమలులోకి వచ్చి నందున, అంతకుముందు తీసుకున్న నిర్ణయాలకు ఇది వర్తిస్తుం దా అన్నది ప్రస్తుతం సుప్రీంకోర్టు పరిశీలనలో ఉంది.
అవినీతి నిరోధక సవరణ చట్టం లక్ష్యాల మేరకు 2018కి ముందు తీసుకున్న నిర్ణయాలకు సంబంధించి విచారణకు కూడా 17ఏ వర్తిస్తుందని చంద్రబాబు తరపు న్యాయవాదులు గట్టిగా వాదించారు. సీఐడీ ఈ వాదనను వ్యతిరేకించింది.
ఇరుపక్షాల సుదీర్ఘ వాదనల అనంతరం.. స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో విచారణ ఎప్పుడు ప్రారంభ మైంది అన్న అంశం ఆధారంగా చంద్రబాబుకు 17 ఏ వర్తింపుపై నిర్ణయం తీసుకునే దిశలో వాద ప్రతివాద నలు జరుగుతూ మంగళవారం కొనసాగనున్నాయి.
2017లోనే స్కిల్ డెవలప్‌మెంట్ ప్రాజెక్టు అమలు లో జీఎస్టీ చెల్లింపు ఎగవేత,ప్రభుత్వ ధనం దారి మళ్లిం పుపై జీఎస్టీ డైరెక్టర్ జనరల్ అప్పటి రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాశారని, కనుక 17 ఏ అమలులోకి రాకముందే ఈ కేసులో విచారణ ప్రారంభమైనట్లుగా భావించాల్సి వుంటుందని.. కనుక చంద్రబాబుకు 17ఏ వర్తించదని సీఐడీ వాదన. అయితే.. ఆ లేఖ పన్నుల ఎగవేతకు సంబంధిచిందని, దానితో చంద్రబాబుకుగానీ, ఆయన ప్రభుత్వానికిగాని ఎలాంటి సంబంధం లేదని చంద్ర బాబు తరపున న్యాయవాదులు వాదించారు. దీంతో పాటు.. సీబీఐ నమోదు చేసిన రిమాండ్ రిపోర్టులో.. స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో 2021లో ప్రారంభమైన విచారణ ఆధారంగా ఎఫ్‌ఐఆర్ నమోదు అయిందని.. అందులో కనీసం చంద్రబాబు ప్రస్తావన కూడా లేదని.. దీని ప్రకారం కూడా ఆయనకు 17 ఏ వర్తిస్తుందని ఆయన తరపు న్యాయవాదులు గట్టిగా ప్రతివాదనలు చేశారు. చంద్రబాబు న్యాయవాదులు తెలిపిన వివరాల ప్రకారం ఆయనకు 17ఏ వర్తిస్తుందన్నట్లుగా కనబడు తోందని ఒక దశలో ద్విసభ్య ధర్మాసనంలోని ఒక న్యాయమూర్తి వ్యాఖ్యానించటం గమనార్హం.
గత శుక్రవారంనాడు సీఐడీ తరపున సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గీ చేసిన కొన్ని వ్యాఖ్యలు, వాదనలు న్యాయనిపుణులను కొంత విస్మయానికి గురి చేశాయి. ఆయన చేసిన వ్యాఖ్యల్లో కొంత అసంబద్ధత స్పష్టంగా కనిపించిందని, తద్వారా తమవాదనల్లో కొంత బలహీనతను వారే ప్రదర్శించుకున్నారని నిపుణులంటున్నారు.
న్యాయానికి సంకెళ్లు వీడేది ఎప్పుడు?
సుప్రీం కోర్టులో గత శుక్రవారం జరిగిన విచారణ ల సందర్భంగా ఇరుపక్షాలు తమ వాదనలను మంగళ వారం ముగించాలని ఒక అంగీకారానికి వచ్చారు. సీఐడీ తరపు న్యాయవాది రోహత్గీ మంగళవారం మరి కొంత సమయం తమ వాదన వినిపిస్తానని చెప్పగా.. తదనంతరం తాముక్లుప్తంగా ప్రతిస్పందిస్తామని చంద్ర బాబు తరపు న్యాయవాది హరీష్ సాల్వే స్పష్టం చేశారు. ఈ మేరకు వాద ప్రతివాదనలు మంగళవారం ముగి యనుండగా ద్విసభ్య ధర్మాసనం తీర్పు ఎప్పుడిస్తుంది అన్న అంశం పై ఉత్కంఠ నెలకొంది.
ధర్మాసనం ముందు ఉన్న మార్గాలు ఇలా ఉండ వచ్చునని న్యాయ నిపుణులు అంటున్నారు.
- చంద్రబాబుకు 17 ఏ కింద రక్షణ లభిస్తుంది కనుక ఈ సెక్షన్ ప్రకారం స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో ఆయనపై నేరారోపణ చేసేముందు సీఐడీ గవర్నర్ అనుమతి తీసుకోనందున ఈ కేసును కొట్టివేయటం.
- చంద్రబాబుకు 17 ఏ వర్తించదు. కనుక కేసును కొనసాగించటం.
- వాదనల పూర్తి అనంతరం ధర్మాసనం తమ తీర్పు ను రిజర్వ్ చేయటం
- ద్విసభ్య ధర్మాసనం ఏకాభిప్రాయానికి రాలేకపోవ టం. ఇలా జరిగితే ఈ అంశాన్ని విస్తృత ధర్మా సనానికి పంపవలసి వస్తుంది.
ఇప్పటివరకు సుప్రీం కోర్టులో జరిగిన ఇరుపక్షాల వాదనలను నిశితంగా గమనించిన న్యాయ నిపుణులు తీర్పు చంద్రబాబుకు అనుకూలంగా రావటానికే అవకా శాలు ఎక్కువగా ఉన్నాయన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇది చాలా ప్రాధాన్యత కలిగిన కేసని.. చంద్రబాబుకు వ్యతిరేకంగా తీర్పు వస్తే రాజకీయాల్లో కక్షపూరిత ధోరణులు పెచ్చుమీరి కలుషితమౌతాయని.. తద్వారా అవినీతి నిరోధక సవరణ చట్టం సెక్షన్ 17 ఏ ఉద్దేశం నిర్వీర్యం అవుతుందని వారంటున్నారు.
ఒకవేళ ధర్మాసనం తీర్పు చంద్రబాబుకు ప్రతికూ లంగా వస్తే చంద్రబాబు స్కిల్ డెవలప్‌మెంట్ కేసుతో పాటు ఇతర కేసుల్లో బెయిల్ తీసుకుని బయటకు రావాల్సివుంటుంది. స్కిల్ కేసులో బెయిల్ కోసం ఇప్ప టికే హైకోర్టులో పిటిషన్ వేశారు. ఫైబర్ గ్రిడ్ కేసులో ముందస్తు బెయిలుపై సుప్రీంకోర్టులో మంగళవారం విచారణ జరగనుంది. అంగళ్లు కేసులో చంద్రబాబుకు ఇప్పటికే హైకోర్టు బెయిలు మంజూరు చేసింది.
సుప్రీం కోర్టులో 17ఏ వర్తింపు అంశంపై చంద్ర బాబుకు అనుకూలంగా తీర్పు వస్తే సీఐడీ ఇప్పటిదాక నమోదు చేసిన కేసులన్నీ ఎగిరిపోతాయి. చంద్రగ్రహ ణం వీడేదెప్పుడన్న ఉత్కంఠ దేశ విదేశాల్లో తీవ్ర స్థాయి లో నెలకొనివుంది.
స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో సుప్రీంకోర్టులో నేడు విచారణ
ఈ కేసులో ఇప్పటికే మూడు రోజుల పాటు సుప్రీంకోర్టులో జరిగిన ఇరుపక్ష వాదనలు మంగళవారం కొనసాగనున్నాయి. అవినీతి నిరోధక సవరణ చట్టం, 2018 లోని సెక్షన్ 17 ఏ ప్రకారం ఈ చట్ట ఉల్లంఘనకు పాల్పడి తమపై అక్రమ కేసును రాష్ట్ర సీఐడీ పెట్టిందని.. దీని ద్వారా ఈ చట్టంలోని ఉన్నత ఆశయాలు, లక్ష్యాలకు విరుద్ధంగా జగన్‌రెడ్డి ప్రభుత్వం వ్యవహ రించిందని.. ఈ చట్టం మేరకు తమకు లభించే రక్షణ కల్పించాలని చంద్రబాబు వేసిన పిటిషన్‌ను మొదట రాష్ట్ర హైకోర్టు తిరస్కరించగా ఆయన స్పెషల్ లీవ్ పిటిషన్ ద్వారా సుప్రీంకోర్టును ఆశ్రయించారు.
సుప్రీంకోర్టుకు దసరా సెలవులు
దసరా సందర్భంగా సుప్రీంకోర్టుకు ఈ నెల 21 నుంచి 28 దాక సెలవు దినాలు. శని, ఆదివారాల సందర్భంగా అంతకు ముందు, తరువాత కూడా న్యాయస్థానానికి సెలవులే. స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో మంగళవారం జరిగే వాద ప్రతివాదాల తరువాత ధర్మా సనం తీర్పు రిజర్వ్ చేసినా.. 17ఏ విషయం తీవ్రత దృష్ట్యా ఈ శుక్రవారంలోపే సుప్రీం కోర్టు తీర్పు రావ చ్చని న్యాయ నిపుణుల అభిప్రాయం.