చైతన్యరధం ఈ-పేపర్
అభిప్రాయం
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
టీడీపీ లో చేరండి
విరాళం
Telugu Desam
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
TDP - తెలుగు దేశం పార్టీ
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
No Result
View All Result
Telugu Desam
Home ముఖ్య వార్తలు

ప్రజాస్వామ్య పునాదులపై దాడి!

జగన్‌ దురాగతాలను అసెంబ్లీ సాక్షిగా ఎండగట్టిన చంద్రబాబు

by చైతన్యరధం
Jul 26, 2024 at 6:08am
in ముఖ్య వార్తలు
హు కిల్డ్‌ బాబాయ్‌? త్వరలోనే జవాబు చెప్తా
Share on FacebookShare on TwitterShare on Whatsapp
  • రాజకీయాలకు జగన్‌ అనర్హుడు
  • పోలీసులను అడ్డుపెట్టుకుని అరాచకం
  • ఐదేళ్లు అత్యంత దుర్మార్గపాలన
  • నాపై 17 కేసులు, టీడీపీ నేతలు, కార్యకర్తలపై కేసులకు లెక్కే లేదు
  • అక్రమ కేసులు పెట్టిన అధికారులపై చర్యలు తప్పవు
  • మా హయాంలో శాంతి,భద్రతలకు అత్యంత ప్రాధాన్యత
  • డిప్యూటీ సీఎం పవన్‌ సూచన మేరకు వచ్చే సెషన్‌లో లా అండ్‌ ఆర్డర్‌పై ప్రత్యేక చర్చ
  • వైసీపీ పాలనలో అదుపు తప్పిన శాంతిభద్రతలపై శ్వేతపత్రం విడుదల

అమరావతి(చైతన్యరథం): తన రాజకీయ చరిత్రలో జగన్‌ లాంటి వ్యక్తిని ఎక్కడా చూడలేదని సీఎం చంద్రబాబు అన్నారు. జగన్‌ లాంటి వ్యక్తులు రాజకీయాల్లో ఉండేందుకు అనర్హులు అని స్పష్టం చేశారు. గత ఐదేళ్ళు ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసేలా వైసీపీ వ్యవహరించిందని జగన్‌ రెడ్డి పాలనను ముఖ్యమంత్రి చంద్రబాబు ఎండగట్టారు. ప్రజాస్వామ్య పునాదులపై దాడి చేసి, వికృత చేష్టలకు పాల్పడ్డారన్నారు. అత్యంత దుర్మార్గంగా వ్యవహరించారని.. తన రాజకీయ జీవితంలో ఇలాంటి పాలన చూడలేదని ధ్వజమెత్తారు. వైఎస్సార్సీపీ పాలనలో అదుపు తప్పిన శాంతిభద్రతలపై సీఎం చంద్రబాబు అసెంబ్లీలో శ్వేతపత్రం విడుదల చేశారు. ఇదే విషయమై హోం మంత్రి అనిత మండలిలో శ్వేతపత్రం విడుదల చేశారు. శ్వేతపత్రం విడుదల సందర్భంగా గురువారం అసెంబ్లీలో చంద్రబాబు మాట్లాడారు. ప్రభుత్వ పెద్దల కక్ష సాధింపు చర్యల్లో పోలీసులను కూడా భాగస్వామ్యం చేశారని..వారితో కుమ్మకై నిబంధనలకు విరుద్ధంగా కొంతమంది పోలీసులు వ్యవహరించారన్నారు. నిబంధనలకు విరుద్ధంగా పని చేయలేమని చెప్పిన అధికారులకు పోస్టింగ్‌లు ఇవ్వకుండా వేధించారని.. పోలీసు వ్యవస్థను పూర్తిగా భ్రష్టు పట్టించారని తెలిపారు.
రాష్ట్రంలో శాంతిభద్రతలు లేవంటూ వైఎస్సార్సీపీ నేతలు ఢల్లీిలో నిరసన తెలుపుతున్నారని చంద్రబాబు తప్పుబట్టారు. లా అండ్‌ ఆర్డర్‌ సక్రమంగా నిర్వర్తించడం ఎన్డీఏ ప్రభుత్వ బాధ్యత.. తప్పుడు రాజకీయాలు చేస్తే సహించం అని చంద్రబాబు హెచ్చరించారు. గతంలో కొన్ని గ్రామాలకే ఫ్యాక్షనిజం పరిమితమైందన్న చంద్రబాబు.. గత టీడీపీ ప్రభుత్వాల హయాంలో వాటిపై శ్రద్ధపెట్టి శాంతిభద్రతలు అదుపు చేశామని తెలిపారు. హైదరాబాద్‌లో మత ఘర్షణలను ఉక్కుపాదంతో అణచివేశామని, మతసామరస్యానికి విఘాతం లేకుండా చేయడంతో అంతర్జాతీయ పెట్టుబడులకు కేంద్రంగా మారిందని తెలిపారు. నాగరిక ప్రపంచంలో వామపక్ష తీవ్రవాదం మంచిది కాదని, గ్రేహౌండ్స్‌, ఇంటెలిజెన్స్‌ బ్రాంచ్‌లు ఏర్పాటు చేశామన్నారు. ఉమ్మడి ఏపీలో చాలావరకు వామపక్ష తీవ్రవాదాన్ని నియంత్రించామని చెప్పారు. సీమలో ఫ్యాక్షనిజం లేకుండా చేయాలనే దృఢసంకల్పంతో వెళ్లామని, రాయలసీమలో ఫ్యాక్షనిజం లేకుండా పోవడానికి టీడీపీ కారణమని పేర్కొన్నారు.
రౌడీలపై ఉక్కుపాదం మోపాం
తమ పాలనలో రౌడీలపై ఉక్కుపాదం మోపామని, పీడీ చట్టం ప్రయోగించామని సీఎం తెలిపారు. దాదాపు 14,770 సీసీ కెమెరాలు ఏర్పాటు చేశాని, పోలీసులు బాధ్యతగా పనిచేయాలనే ఉద్దేశంతో బాడీ వోర్న్‌ కెమెరాలు పెట్టామని, చోరీల నియంత్రణకు లాక్డ్‌ హౌస్‌ మానిటరింగ్‌ సిస్టమ్‌ ఏర్పాటు చేశామని వెల్లడిరచారు. పెద్దపెద్ద సమావేశాల పర్యవేక్షణకు మొబైల్‌ కమాండ్‌ కంట్రోల్‌ కేంద్రాలు పెట్టామన్న సీఎం నేరాలు, దొంగతనాలు జరగకుండా ముందుగానే పట్టుకునే వ్యవస్థ తెచ్చామన్నారు. ఆటోమేటెడ్‌ ఫింగర్‌ ప్రింట్‌ ఐడెంటిఫికేషన్‌ సిస్టమ్‌ తీసుకువచ్చామని, శాంతిభద్రతల నిర్వహణతో పెట్టుబడిదారుల్లో నమ్మకం వచ్చిందని చంద్రబాబు తెలిపారు.
ఫ్యాక్షన్‌ నియోజకవర్గాలుగా మార్చారు
ఐదేళ్లలో పలు ఫ్యాక్షన్‌ నియోజకవర్గాలను తయారు చేశారని చంద్రబాబు మండిపడ్డారు. వైఎస్సార్సీపీ పాలనలో పోలీసు వ్యవస్థ పూర్తిగా విధ్వంసమైందన్నారు. పోలీసుల అండతో ప్రజాస్వామ్య పునాదులపై దాడులు చేశారని, గత పాలనలో ఎంతో మంది మానసికంగా, శారీరకంగా మనోవేదన పడ్డారని సీఎం చంద్రబాబు అన్నారు. మండలిలో 3 రాజధానుల బిల్లు విషయంలో దుర్మార్గంగా ప్రవర్తించారని, ఛైర్మన్‌ను పనిచేయకుండా చేసి గొడవపడ్డారని అన్నారు. గత పాలనలో ప్రజాస్వామ్యం అపహాస్యమైందన్న చంద్రబాబు ప్రభుత్వ కక్షసాధింపు చర్యలకు పోలీసులు ఆయుధంగా మారారన్నారు. పోలీసులు అధికార పార్టీ నేతలతో కుమ్మక్కై నిబంధనలు ఉల్లంఘించారని చెప్పారు. వైఎస్సార్సీపీ నేతలతో విభేదిస్తే పోస్టింగ్‌ లేకుండా వీఆర్‌లో ఉంచేవారని, ఐదేళ్లపాటు వీఆర్‌లో ఉన్న అధికారులు కూడా ఉన్నారని వెల్లడిరచారు.
ఏకంగా 17 కేసులు పెట్టారు
బాబ్లీ కేసు తప్ప తనపై గతంలో ఎప్పుడూ కేసులు లేవని, వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చాక ఏకంగా 17 కేసులు పెట్టారని చంద్రబాబు తెలిపారు. తనతో పాటు పవన్‌ కల్యాణ్‌పై ఏడు కేసులు పెట్టారన్న సీఎం.. ప్రతిపక్ష నేతలను అణచివేసేందుకు యత్నించారన్నారు. జేసీ ప్రభాకర్‌ రెడ్డిపై అతి ఎక్కువగా 60కి పైగా కేసులు పెట్టారని, పల్లా శ్రీనివాసరావు ఇంటిని కూల్చివేసి వేధించటంతో ఇప్పుడు ఆయనకు రాష్ట్రంలోనే అత్యధిక మెజార్టీ వచ్చిందని గుర్తు చేశారు. పులివెందులలో పోటీ చేసిన రవీంద్రనాథరెడ్డిపై కేసుపెట్టి జైలులో పెట్టారని, సంగం డెయిరీలో అక్రమాలు జరిగాయంటూ ధూళిపాళ్ల నరేంద్రను జైలులో ఉంచారని, ప్రభుత్వాధికారులపై దాడి చేశారని కూన రవికుమార్‌పై, కేసులు పెట్టి వేధింపులకు గురిచేశారన్నారు. టీడీపీ మహిళా నేతలపై సామాజిక మాధ్యమాల్లో అసభ్యకర పోస్టులు పెట్టారని వివరించారు. ఫర్నీచర్‌ దుర్వినియోగం చేశారని కోడెల శివప్రసాదరావుపై 18 కేసులు పెట్టారని, ఆ అవమానంతో కోడెల ఆత్మహత్యకు పాల్పడ్డారని సీఎం ఆవేదన వ్యక్తం చేశారు. ఆ కేసులు పెట్టించిన అప్పటి సీఎం జగన్‌ ఇంట్లో ఇప్పుడు కూడా ప్రభుత్వ ఫర్నీచర్‌ ఉంది అని గుర్తు చేశారు. టీడీపీ నేతలు వంగలపూడి అనిత, అయ్యన్న పాత్రుడిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ, అత్యాచార యత్నం కేసులు పెట్టారని, అచ్చెన్న ఆపరేషన్‌ చేయించుకుని కదలలేని పరిస్థితుల్లో ఉన్నా, ఆరోగ్యం సరిగా లేకపోయినా 600 కి.మీ వాహనంలో తిప్పారని తెలిపారు. సంబంధం లేకపోయినా ప్రశ్నాపత్రం లీకైందని నారాయణపై కేసుపెట్టారన్నారు. రఘురామ కృష్ణరాజును లాకప్‌లో చిత్రహింసలు పెట్టి ఆ వీడియో చూసి నాటి సీఎం పైశాచిక ఆనందం పొందారని దుయ్యబట్టారు. ఐదేళ్లు సొంత నియోజకవర్గానికి ఎంపీ రఘురామ వెళ్లకుండా చేశారన్న సీఎం.. రఘురామకు సొంత నియోజకవర్గంలో కూడా భద్రత లేని పరిస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు.
జై జగన్‌ అనలేదని..
మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంతో పాటు జనసేన కార్యాలయాలపై దాడులు జరిగాయని సీఎం తెలిపారు. జై జగన్‌ అనలేదని మాచర్లలో తోట చంద్రయ్యను దారుణంగా చంపారని, డ్రైవర్‌ను చంపి వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ డోర్‌ డెలివరీ చేశారని తెలిపారు. ఐదేళ్ల వైఎస్సార్సీపీ హయాంలో 300 మంది బీసీలను హత్య చేశారని వివరించారు. టీడీపీ కార్యకర్తలపై 2560 కేసులు నమోదు చేశారని చంద్రబాబు చెప్పారు. ప్రతిపక్ష పార్టీల కార్యకలాపాలను నియంత్రించడానికి జీవో 1 తీసుకొచ్చారని, వైఎస్సార్సీపీ హయాంలో జనసేన నేతలు, కార్యకర్తలపై 206 కేసులు, జగన్‌ సీఎంగా ఉన్నప్పుడు సొంత చెల్లెలైన షర్మిలపై కూడా 2 కేసులు పెట్టారని తెలిపారు. ఇరిగేషన్‌ ప్రాజెక్టులను సందర్శించేందుకు అంగళ్లు ప్రాంతానికి వెళ్లిన తనపై కేసులు పెట్టారని చంద్రబాబు గుర్తు చేశారు.
ప్రశ్నిస్తే కేసులు, దాడులే..
కొవిడ్‌ వేళ మాస్క్‌ అడిగిన డాక్టర్‌ సుధాకర్‌పై, సీపీఎస్‌కు వ్యతిరేకంగా ఆందోళన చేసిన టీచర్లపై, మీడియా ప్రతినిధులపై కేసులు పెట్టారని సీఎం తెలిపారు. టీచర్లపై పెట్టిన అక్రమ కేసులపై సమీక్షిస్తానని స్పష్టం చేశారు. బాధలు చెప్పుకోవడానికి జగన్‌ ఇంటికి వెళ్తే ఆరుద్ర అనే అభాగ్యురాలిని చిత్రహింసలు పెట్టారుని, గతంలో జగన్‌ ఇంటి సమీపంలోనే ఓ మహిళపై సామూహిక అత్యాచారం జరిగినా స్పందించలేదన్నారు. దొంగతనం నెపం వేసి అబ్దుల్‌ సలాం మరణానికి కారణమయ్యారని, జగన్‌ హయాంలో దేవాలయాలపై దాడులు, అంతర్వేది రథాన్ని తగలబెట్టారని వెల్లడిరచారు.
ఇలాంటి వ్యక్తిని ఎక్కడా చూడలేదు
వివేకా హత్య కేసులో మొదట గుండెపోటు అని, తర్వాత హత్య అన్నారని, అవినాష్‌రెడ్డిని అరెస్టు చేసేందుకు సీబీఐ వెళ్తే అడ్డుకున్నారని చంద్రబాబు గుర్తుచేశారు. దేశంలో అత్యంత సీనియర్‌ నాయకుడిని అని చెప్తూ.. తన రాజకీయ చరిత్రలో జగన్‌ లాంటి వ్యక్తిని ఎక్కడా చూడలేదని చంద్రబాబు అన్నారు. టాటా, రిలయన్స్‌ సంస్థల అధినేతలకంటే ఎక్కువ సంపాదించాలనేదే జగన్‌ కోరిక. జగన్‌ లాంటి వ్యక్తులు రాజకీయాల్లో ఉండేందుకు అనర్హులు అని చంద్రబాబు స్పష్టం చేశారు. కాగా, లా అండ్‌ ఆర్డర్‌పై మరింత లోతుగా చర్చించాలని, అసెంబ్లీలో మరో సెషన్‌ నిర్వహించాలని డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ కోరగా సీఎం మద్దతుగా స్పందించారు. లా అండ్‌ ఆర్డర్‌ను పటిష్టం చేయాల్సిన అవసరం ఉందని, వచ్చే సెషన్‌లో లా అండ్‌ ఆర్డర్‌పై ప్రత్యేక చర్చ పెడదామన్నారు. శాంతిభద్రతల విషయంలో ఏపీని దేశంలోనే అగ్రస్థానంలో నిలబెడతామని, రాజకీయ ప్రేరేపిత కేసులపై సమీక్షిస్తామని తెలిపారు. అక్రమ కేసులు పెట్టిన అధికారులను శిక్షించేందుకు సిద్ధం అని స్పష్టం చేశారు. అధికారులు చట్టాన్ని గౌరవించినప్పుడే శాంతిభద్రతలు అదుపులో ఉంటాయన్న చంద్రబాబు ఎన్డీఏ సభ్యులు ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టే పరిస్థితిని తీసుకురావద్దని కోరారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగించే వ్యక్తి ఏ స్థాయిలో ఉన్నా శిక్షిస్తామని చెప్పారు. తనకు ప్రాణసమానమైన కార్యకర్తలను పోగొట్టుకున్నానని చెప్తూనే కక్ష సాధింపులు తీర్చుకునేందుకు మనకు ప్రజలు అధికారం ఇవ్వలేదన్నారు. అక్రమ కేసులపై కమిషన్‌ వేసేందుకు ఆలోచిస్తున్నానని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు.

సంబంధితవార్తలు

రాష్ట్రవ్యాప్తంగా ఏర్పాటుచేసిన గణేష్ మండపాలకు ఉచిత విద్యుత్ అందించడంతో పాటు సింగిల్ విండో ద్వారా అనుమతులకు చొరవ చూపిన విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ కు ఆంధ్రపదేశ్ గణేష్ ఉత్సవ సమితి కృతజ్ఞతలు తెలిపింది.

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షతన రాష్ట్ర సచివాలయంలో రెండో రోజు జిల్లా కలెక్టర్ల 8వ సమావేశం జరుగుతోంది.

చైతన్యరధం ఈ పేపర్ 11-09-2026

Previous Post

ఆర్థికశాఖపై సీఎం చంద్రబాబు స్పెషల్‌ ఫోకస్‌

Next Post

సీఎం చంద్రబాబును కలిసి సీపీఎం నేతలు

మరిన్ని వార్తలు

రివ్యూలు కాదు… రిజల్ట్స్ కావాలి
ఆంధ్రప్రదేశ్

సీసీఎన్ఏలో స్ట్రక్చర్డ్ ల్యాండ్ బ్యాంక్ పోర్టల్

చైతన్యరధం
@ September 11, 2026
రివ్యూలు కాదు… రిజల్ట్స్ కావాలి
ఆంధ్రప్రదేశ్

రివ్యూలు కాదు… రిజల్ట్స్ కావాలి

చైతన్యరధం
@ September 11, 2026
స్థానిక సంస్థల ఎన్నికల్లో క్లీన్ స్వీప్ చేయాలి
ఆంధ్రప్రదేశ్

స్థానిక సంస్థల ఎన్నికల్లో క్లీన్ స్వీప్ చేయాలి

చైతన్యరధం
@ September 9, 2026
ఐటీ వెలుగుల నుంచి..జలసిరుల వరకు!
ఆంధ్రప్రదేశ్

ఐటీ వెలుగుల నుంచి..జలసిరుల వరకు!

చైతన్యరధం
@ September 8, 2026
కనెక్ట్.. జెన్ జెడ్!
ఆంధ్రప్రదేశ్

కనెక్ట్.. జెన్ జెడ్!

చైతన్యరధం
@ September 5, 2026
ఇది శ్రేణుల విజయం!
ఆంధ్రప్రదేశ్

ఇది శ్రేణుల విజయం!

చైతన్యరధం
@ September 5, 2026
అమరావతి వికాసం… రైతు సంక్షేమం
ఆంధ్రప్రదేశ్

అమరావతి వికాసం… రైతు సంక్షేమం

చైతన్యరధం
@ September 4, 2026
పడవ ఎక్కి… మత్స్యకారులతో ముచ్చటించి… 
ఆంధ్రప్రదేశ్

పడవ ఎక్కి… మత్స్యకారులతో ముచ్చటించి… 

చైతన్యరధం
@ September 2, 2026
Load More

ముఖ్య వార్తలు

రివ్యూలు కాదు… రిజల్ట్స్ కావాలి

సీసీఎన్ఏలో స్ట్రక్చర్డ్ ల్యాండ్ బ్యాంక్ పోర్టల్

చైతన్యరధం
@ September 11, 2026
రివ్యూలు కాదు… రిజల్ట్స్ కావాలి

రివ్యూలు కాదు… రిజల్ట్స్ కావాలి

చైతన్యరధం
@ September 11, 2026
స్థానిక సంస్థల ఎన్నికల్లో క్లీన్ స్వీప్ చేయాలి

స్థానిక సంస్థల ఎన్నికల్లో క్లీన్ స్వీప్ చేయాలి

చైతన్యరధం
@ September 9, 2026
ఐటీ వెలుగుల నుంచి..జలసిరుల వరకు!

ఐటీ వెలుగుల నుంచి..జలసిరుల వరకు!

చైతన్యరధం
@ September 8, 2026
మరిన్ని

అత్యధికంగా వీక్షించినవి

ఆదర్శ నియోజకవర్గంగా మంగళగిరి!

ఆదర్శ నియోజకవర్గంగా మంగళగిరి!

చైతన్యరధం
@ August 9, 2026 6:20 AM
దళితులపై జగన్‌ది కపట ప్రేమ!

దళితులపై జగన్‌ది కపట ప్రేమ!

చైతన్యరధం
@ July 9, 2026 6:00 AM
చంద్రబాబు విజన్‌తో విద్యుత్ ధగధగలు 

చంద్రబాబు విజన్‌తో విద్యుత్ ధగధగలు 

చైతన్యరధం
@ April 29, 2026 7:10 AM
అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

చైతన్యరధం
@ March 8, 2026 6:30 AM
మరిన్ని

తాజా సంఘటనలు

రివ్యూలు కాదు… రిజల్ట్స్ కావాలి

సీసీఎన్ఏలో స్ట్రక్చర్డ్ ల్యాండ్ బ్యాంక్ పోర్టల్

చైతన్యరధం
@ September 11, 2026
రివ్యూలు కాదు… రిజల్ట్స్ కావాలి

రివ్యూలు కాదు… రిజల్ట్స్ కావాలి

చైతన్యరధం
@ September 11, 2026
ప్రభుత్వ పథకాలు ప్రతి ఇంటికి చేరాలి

ప్రభుత్వ పథకాలు ప్రతి ఇంటికి చేరాలి

చైతన్యరధం
@ September 10, 2026
కరవు సీమకు కృష్ణమ్మ

48 ఏళ్ల రాజకీయాల్లో ఏనాడూ విలువలు వదల్లేదు

చైతన్యరధం
@ September 10, 2026
మరిన్ని
TDP-Logo-mini
మన పార్టీ
  • మన సిద్ధాంతం
  • జై హింద్ - జై తెలుగుదేశం
  • మన చరిత్ర
  • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
  • కార్య నిర్వాహక వర్గం
మన నాయకత్వం
  • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
  • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
  • NTR శత జయంతి ఉత్సవాలు
మన విజయాలు
  • భారత దేశం
  • ఆంధ్ర ప్రదేశ్
  • తెలంగాణ
  • 44 సంవత్సరాల విజయాలు
డౌన్లోడ్స్
  • మ్యానిఫెస్టో
  • మహానాడు 2022 తీర్మానాలు
  • నాయకుడితో నా చిత్రం
  • లోగోలు
  • నాయకుల చిత్రాలు
ప్రచార సమాచారం
  • బ్యానర్స్ / బుక్ లెట్స్
  • పోస్టర్స్ / కరపత్రాలు
  • ప్రచార గీతాలు
  • ఎన్నికల సమాచారం / సూచనలు
మీడియా వనరులు
  • పత్రికా ప్రకటనలు
  • ప్రసంగాలు
  • కార్యక్రమాలు
  • ముఖాముఖి & కథనాలు
  • ఫోటో గ్యాలరీ
  • వీడియో గ్యాలరీ

© 2026 తెలుగుదేశం పార్టీ. Privacy Policy | Terms Conditions.

Telegram Whatsapp Facebook Twitter Instagram Youtube
Sanbrains
No Result
View All Result
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారతదేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • TDP పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • విరాళం
  • అభిప్రాయం
  • చైతన్యరధం ఈ-పేపర్
  • జిల్లా వెబ్‌సైట్‌లు
    • Ananthapuramu
    • Anakapalli
    • Bapatla
    • Chittoor
    • EastGodavari
    • Eluru
    • Guntur
    • Kadapa
    • Kakinada
    • Krishna
    • Kurnool
    • Manyam
    • Nandyala
    • Nellore
    • Palnadu
    • Prakasam
    • Srikakulam
    • Tirupati
    • Visakhapatnam
    • Vizianagaram
    • WestGodavari
  • సూపర్ 6

© 2022 Telugu Desam Party. Designed by Tecbrains.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Create New Account!

Fill the forms below to register

*By registering into our website, you agree to the Terms & Conditions and Privacy Policy.
All fields are required. Log In

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist