- ఏపీపై దృష్టిపెట్టిన పారిశ్రామికవేత్తలు
- 2014`19 కాలంలో ఎఫ్‌డీఐల వరద
- 2019`24లో వైసీపీ విధ్వంస పాలన
- క్విడ్ ప్రో కో డీల్స్‌తో బెదిరింపులు..
- పెట్టుబడులకు ముఖం చాటేసిన ఇన్వెస్టర్లు
- కూటమి సర్కారు రాకతో మారుతున్న పరిస్థితి
- ఆరంభమే అదరగొట్టిన ఎన్డీయే సర్కారు
- బీపీసీఎల్, విన్‌ఫాస్ట్‌తో కొత్త ఉత్సాహం
- ఎఫ్‌డీఐలపై మళ్లీ చిగురిస్తోన్న ఆశలు..
అమరావతి (చైతన్య రథం): ఒక దేశానికైనా.. రాష్ట్రానికైనా `విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు (ఎఫ్‌డీఐ) అత్యంత కీలకం. వ్యాపార నిర్వహణకు అనువైన వాతావరణంతోపాటు పెట్టుబడులకు రక్షణ లభించి.. లాభాల పంట పండుతుందని పెట్టుబడిదారులు భావిస్తే ఆయా దేశాల్లోకి, రాష్ట్రాల్లోకి `ఎఫ్‌డీఐల వరదకు అవకాశముంటుంది. రాష్ట్రంలో విధ్వంస పాలనకు తెరపడి, ఎన్డీయే సర్కారు గద్దె నెక్కడంతో.. 2014`19నాటి రోజులను మళ్లీ చూస్తామన్న నమ్మకాలు ప్రజల్లో బలపడుతున్నాయి. ‘సంపదను సృష్టించి సంక్షేమాన్ని అమలు చేస్తానని’ ప్రకటించిన ముఖ్యమంత్రి చంద్రబాబు `భారీఎత్తున విదేశీ పెట్టుబడుల సాధన దిశగానే అడుగులేస్తున్నారు. అనుక్షణం రాష్ట్రాభివృద్ధి గురించి ఆలోచించే సీఎం చంద్రబాబు.. నిజానికి ఆరంభమే అదరగొట్టారు. గద్దెనెక్కిన నెల రోజుల కాలంలోనే రూ.75వేలకోట్లపై హెచ్‌పీసీఎల్ రిఫైనరీ ఏర్పాటుకు బీజం వేశారు. రాష్ట్ర ప్రభుత్వంతో సానుకూల చర్చలు జరిపిన హెచ్‌పీసీఎల్ `అక్టోబర్‌కు ఫీజిబిలిటీ రిపోర్టుతో కలుస్తామంటూ సంతోషంగా ప్రకటించివెళ్లడం శుభతరుణం.
రాష్ట్రంలో రిఫైనరీ ఏర్పాటైతే 25వేలమందికి ఉపాధి లభిస్తుందన్నది అంచనా. మరోపక్క రూ.4వేల కోట్లతో ఏపీలో విస్తరణ కేంద్రాన్ని ఏర్పాటు చేయడానికి విన్‌ఫాస్ట్ ఆసక్తిచూపడటం మరో గొప్ప విషయం. వియత్నాంకు చెందిన ఎలక్ట్రిక్ స్కూటర్ల కంపెనీ రాష్ట్రంలో విస్తరణ కేంద్రాన్ని నెలకొల్పితే `ఉపాధి మార్గాలు మెరుగవ్వడం ఖాయం. ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు బెల్జియం, జపాన్ కంపెనీలు సైతం కొత్త ప్రభుత్వాన్ని కలిసి చర్చలు జరపడం బలమైన అడుగులుగానే చెప్పాలి.
రాష్ట్ర విభజన సమయంలో `ఆర్థిక కష్టాల సుడినుంచి రాష్ట్రాన్ని ఒడ్డుకు చేర్చేందుకు తొలి ముఖ్యమంత్రి చంద్రబాబు రూపొందించిన ప్రణాళికల్లో విదేశీ పెట్టుబడుల ఆకర్షణ ఒకటి. ఎఫ్‌డిఐల వరదను రాష్ట్రానికి మళ్లిస్తే.. ఆర్థికంగానూ, సామాజికంగా `రాష్ట్ర ప్రగతి నల్లేరుపై నడకవుతుందన్న చంద్రబాబు అంచనాలు అప్పట్లో అద్భుత ఫలితాలే ఇచ్చాయి. 2014`19 టీడీపీ హయాంలో రూ.65,327 కోట్ల ఎఫ్‌డీఐలు సాధించిన చంద్రబాబు `14.7 శాతం వాటాతో ఏపీని దేశంలోనే రెండోస్థానంలో నిలిపారు. కియా, ఇసుజు, హీరో మోటార్స్, అశోక్ లేలాండ్‌లు రాష్ట్రంలో అడుగుపెట్టింది ఆకాలంలోనే. విభజనతో నష్టపోయిన ఏపీ `ప్రగతి బాట పట్టాలంటే పారిశ్రామికీకరణతోనే సాధ్యమని భావించిన తెలుగుదేశం ప్రభుత్వం 2014లో ఆ దిశగా ప్రణాళికలు రూపొందించింది. 2014 నుంచి 2019 మధ్యలో సీఎం చంద్రబాబు నాయుడు సారధ్యంలో దావోస్, దక్షిణకొరియా వంటి దేశాలలో పర్యటించి రాష్ట్రంలో పరిశ్రమలు నెలకొల్పేందుకు దేశ విదేశ పారిశ్రామిక సంస్థలతో ఒప్పందాలు కుదుర్చుకున్నారు.
2014-19 కాలంలో ముఖ్యమంత్రి చంద్రబాబు వలన ఆసియా దేశాల్లో నవ్యాంధ్రప్రదేశ్‌కు ఎనలేని గుర్తింపు వచ్చింది. ‘మైక్రోసాఫ్ట్’ అధినేత బిల్‌గేట్స్, ‘కాన్సులేట్ జనరల్ ఆఫ్ ది రిపబ్లిక్ కొరియా’ కాన్సుల్ జనరల్ క్యుంగ్సూ కిమ్‌లాంటి ఎందరో ప్రముఖులు, స్వదేశి విదేశీ దిగ్గజ పారిశ్రామికవేత్తలు చంద్రబాబు కృషిని వేనోళ్ల కీర్తించారు. 2019లో అధికారాన్ని చేజిక్కించుకున్న అసమర్థ వైసీపీ `తన చేతగానితనంతో ఎఫ్‌డీఐల గవాక్షాన్ని మూసేసింది. క్విడ్ ప్రో కో పద్ధతికి కక్కుర్తిపడిన జగన్ సర్కారు `కొత్త కంపెనీలను ఆకర్షించడం మాటు అటుంచి.. వద్దామనుకున్న కంపెనీలు పారిపోయేలా చేశారు. ‘మీరొస్తే మాకెంతిస్తారు’లాంటి అవినీతి బేరసారాలకు దిగడంతో `ఇన్వెస్టర్లు ఏపీకి ముఖం చాటేశారు. 2019`24 జగన్ జమానాలో వచ్చిన ఎఫ్‌డీఐలు మొత్తం రూ.6,808.20 కోట్లకు పరిమితం కావడం దారుణం. పెట్టుబడులను ఆకర్షించడంలో ఏపీ 14వ ర్యాంకుకు పడిపోవడమే జగన్ సర్కారు వైఫల్యానికి నిదర్శనం.
2014-19లో రూ.65,327 కోట్లు విదేశీ పెట్టుబడుల (14.7 శాతం వాటా)తో దేశంలోనే రెండోస్థానంలో నిలిచిన ఏపీ.. 2019-24 మార్చి వరకు వైసీపీ ఏలుబడిలో కేవలం రూ.6,808.2 కోట్ల ఎఫ్‌డీఐలు సాధించి 14వ శాతానికి పడిపోయిందన్నది డీపీఐఐటి తాజా గణాంకాలు చెప్తోన్న మాట.
విధ్వంస పాలనతో రాష్ట్రాన్ని పతనానికి చేర్చిన వైసీపీ `ఐదేళ్లలో 7వేల కోట్ల విదేశీ పెట్టుబడులు సాధించామని గొప్పలు చెప్పుకోవడం సిగ్గుచేటు. జగన్ అసమర్థ విధానాల కారణంగా `విదేశీ పెట్టుబడుల సాధనలో ఏపీ 2వ ర్యాంకునుంచి 14వ స్థానానికి పడిపోయింది. ఐదేళ్ల చంద్రబాబు పాలనలో సాధించిన రూ.65,327 కోట్ల పెట్టుబడులకు, ఐదేళ్ల జగన్ జమానాలో సాధించిన రూ.6,808.2 కోట్ల పెట్టుబడులకు ఏమైనా పోలిక ఉందా? ఇదిచాలు, వైసీపీ రాష్ట్రాన్ని ఎంతటి అదోగతికి తోసేసిందో చెప్పడానికి. ప్రచారార్భాటానికి వైసీపీ ఏమాత్రం వెనుకాడదనడానికి ఇదే నిదర్శనం. చంద్రబాబు కృషితో రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చిన కియా అనుబంధ సంస్థలు, ఫార్చూన్ 500, ఫ్రాంక్లిన్ టెంపుల్టన్, సింగపూర్ స్టార్టప్ వంటి ఎన్నో దిగ్గజ కంపెనీలు `జగన్ అననుకూల పాలనా విధానాలు చూరి పారిపోయారన్నది చరిత్రనుంచి చెరిపేయలేని సత్యం. ఒకవైపు కక్షసాధింపు చర్యలు, మరోవైపు జె-టాక్స్‌తో రాష్ట్రానికి కొత్తగా పారిశ్రామికవేత్తలు పెట్టుబడులు పెట్టేందుకు భయపడిపోయారన్నది కాదనలేని సత్యం!
విభజిత రాష్ట్రంలోనూ ఐటీకి అత్యంత ప్రాధాన్యమిచ్చి.. హైదరాబాద్‌కు ధీటుగా అంతర్జాతీయ కంపెనీలతో ఒప్పందం కుదుర్చుకుని పెద్దఎత్తున పెట్టుబడుల ఆకర్షణకు ప్రణాలికలు రూపొందించారు చంద్రబాబు. కియా, ఇసుజు, హీరో మోటార్స్. ఫాక్స్ కాన్, సెల్‌కాన్ మొబైల్ కంపెనీలు.. కృష్ణా జిల్లాలో అశోక్ లేలాండ్ బస్సుల పరిశ్రమ, చిత్తూరు జిల్లాలో శ్రీ సిటీ ఇలా ఎన్నో పరిశ్రమలను నవ్యాంధ్రకు తరలివచ్చేలా ఆకర్షించింది తెలుగుదేశం ప్రభుత్వం. హెచ్‌సీఎల్, ఫ్రాంక్లిన్ టెంపుల్‌టన్, ఏఎన్‌ఎస్‌ఆర్ వంటి ప్రఖ్యాత కంపెనీలు సైతం రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చాయి. తత్ఫలితంగా తమిళనాడు, గుజరాత్ రాష్ట్రాలకు ధీటుగా ఏపీని పెట్టుబడులకు గమ్యస్థానంగా నిలిపింది తెలుగుదేశం పార్టీ. జాతీయస్థాయికి మించి పారిశ్రామిక ప్రగతినీ (2014-19లో జాతీయస్థాయి 7.1శాతంవుంటే ఏపీలో 9.52శాతం) సాధించింది. తెలుగుదేశం హయాంలో అన్నిరంగాల్లో స్వదేశీ, విదేశీ పెట్టుబడులతో కలిపి మొత్తం రూ.11,17,907 కోట్ల పెట్టుబడులతో 40,969 పరిశ్రమలు ఏర్పాటై 13,88,733 ఉద్యోగాలు లభించాయి.
కానీ సమాచార హక్కు చట్టం ద్వారా వచ్చిన సమాచారం ప్రకారం ఐదేళ్ల వైసీపీ హయాంలో రూ.3,38,054 కోట్ల పెట్టుబడులతో 99 ఎంవోయూలపై సంతకం చేసింది. ఉపాధి అవకాశాలు 2,29,259 అంటూ ఒప్పందాలు కుదుర్చుకోగా అందులో రూ.5,710 కోట్ల పెట్టుబడితో 18 కంపెనీలు మాత్రమే గ్రౌండిరగ్ అయ్యి 9,158మంది మూత్రమే ఉపాధి పొందారు. వైసీపీ చేతగానితనాన్ని, అవినీతిని అర్థం చేసుకున్న ప్రజలు `జగన్‌రెడ్డి ప్రభుత్వానికి చరమగీతం పాడారు. చంద్రబాబు నేతృత్వంలోని ఎన్డీయే కూటమి గద్దెనెక్కడంతో `రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు దిగ్గజ కంపెనీలు క్యూ కడుతున్నాయి. సంపద సృష్టి దిశగా ఏపీ బలమైన అడుగులేస్తుందని చెప్పడానికి ఇంతకంటే నిదర్శనమేం కావాలి?
2014-19 మధ్య రాష్ట్రానికి వచ్చిన ఎఫ్‌డీఐలు
సంవత్సరం ఎఫ్‌డిఐలు
(రూ.కోట్లలో)
2014-15 8,326
2015-16 10,315
2016-17 14,767
2017-18 8,037 (6వస్థానం)
2018-19 23,882 (4వస్థానం)
మొత్తం 65,327
(14.7శాతం వాటాతో దేశంలోనే రెండోస్థానం)
2019-24 మధ్య రాష్ట్రానికి వచ్చిన ఎఫ్‌డీఐలు
సంవత్సరం ఎఫ్‌డీఐలు
(రూ.కోట్లలో)
2019-20 1,475.99 (12వ స్థానం)
2020-21 638.72 (13వ స్థానం)
2021-22 1,681.61 (10వ స్థానం)
2022-23 2,252.13
2023-24మార్చికి 760.74
మొత్తం 6,808.20
(14వ ర్యాంకుకు చేరిన వైనం)