అమరావతి : బిసిలపై వరుస దాడులు, హత్యలను నిరసిస్తూ టీడీపీ ఆధ్వర్యంలో సోమవారం ‘ఛలో నర్శిపట్నం’ నిర్వహించనున్నట్లు టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు కింజారపు.అచ్చెన్నాయుడు తెలిపారు. ఈ మేరకు ఆయన ఆదివారం ఓ ప్రకటన విడుదల చేసింది. వైసీపీ అరాచకాలను ప్రశ్నించినందుకు టీడీపీ రాష్ట్ర నాయకులు, మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రడు ఇంటిని జగన్ రెడ్డి తన అధికారులను అడ్డుపెట్టకుని, పోలీసు బలగాలతో అర్థరాత్రి కూలదోశారు. దీనికి అధికారులు ఓ పిట్టకథ చెప్పుకొచ్చారు. గతంలో కూడా బీసీ నాయకులు పల్లా శ్రీనివాస్, సబ్బం.హరి, ఇలా అనేక మంది బీసీ నాయకులు, కార్యకర్తల ఆస్తులపై జగన్ రెడ్డి దాడులకు పాల్పడ్డాడు. ఇటీవల జల్లయ్య అనే బీసీ టీడీపీ కార్యకర్తను వైసీపీ కార్యకర్తలు అతిదారుణంగా చంపితే ముఖ్యమంత్రి హోదాలో ఉన్న జగన్ రెడ్డి ఒక్కమాట కూడా మాట్లాడకపోవడం అత్యంత దారుణం. బీసీల పట్ల తనకున్న చిత్తశుద్దిని జగన్ రెడ్డి నిరూపించుకున్నాడు. బీసీలంటే జగన్ రెడ్డికి కడుపుమంట. జగన్ రెడ్డి పాలనలో బీసీలపై దాడులు రోజు రోజుకూ పెరిగిపోతున్నాయి. వైసీపీ అధికారంలోకి వచ్చాక ఇప్పటి వరకు 26మంది బీసీలను పొట్టనబెట్టుకుంది. హత్యకు గురైన వ్యక్తుల కుటుంబ సభ్యులను పరామర్శించడం కూడా వైసీపీకి ఇష్టం లేదు. ముఖ్యమంత్రి ఇప్పటి వరకు హత్యకు గురైన ఏ కుటుంబ సభ్యులనూ పరామర్శించిన దాఖలాలు లేవు. పరామర్శించడానికి వెళుతున్న ప్రతిపక్ష నేతలను ఎక్కడికక్కడ హౌస్ అరెస్ట్ లు, నిర్బంధాలు, అరెస్టులకు పాల్పడుతున్నారు. ప్రశ్నిస్తే అడ్డగోలుగా కేసులు పెడుతున్నారు. బీసీలు అంటే బ్యాక్ వర్డ్ క్యాస్ట్ కాదు బ్యాక్ బోన్ క్యాస్ట్ అంటూ మాయమాటలు చెబుతూనే, వారి ప్రాణాలను జగన్ రెడ్డి గాల్లో కలిపేస్తున్నాడు. ప్రశ్నించినవారిపై దాడులు చేయడం, వారి ఆస్తులపైనా అడ్డగోలుగా దాడులకు తెగబడుతూ రాష్ట్రాన్ని రావణ కాష్టంలా జగన్ రెడ్డి మార్చారు. దీన్ని టీడీపీ ఏ మాత్రం సహించే ప్రసక్తే లేదు. బీసీల పట్ల జగన్ రెడ్డి చూపిస్తున్న కపటప్రేమను నిలదీయడానికి నర్శిపట్నానికి బీసీలంతా పెద్దఎత్తున తరలివచ్చి, కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాం.