చైతన్యరధం ఈ-పేపర్
అభిప్రాయం
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
టీడీపీ లో చేరండి
విరాళం
Telugu Desam
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
TDP - తెలుగు దేశం పార్టీ
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
No Result
View All Result
Telugu Desam
Home ఆంధ్రప్రదేశ్

భవిష్యత్తు గ్యారెంటీ సక్సెస్‌తో వైసీపీ నేతల్లో వణుకు: అచ్చెన్నాయుడు

టీడీపీ ప్రచార కార్యక్రమాన్ని అడ్డుకునేందుకే డేటా చౌర్యం అంటూ దుష్రచారం

by చైతన్యరధం
Nov 22, 2023 at 3:31pm
in ఆంధ్రప్రదేశ్, చైతన్యరధం, తాజా సంఘటనలు, ముఖ్య వార్తలు
రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఖూనీ: అచ్చెన్నాయుడు
Share on FacebookShare on TwitterShare on Whatsapp
  • హైకోర్టు వ్యాఖ్యలతో జగన్‌ రెడ్డి మైండ్‌ బ్లాక్‌
  • దొంగ ఓట్లపై టీడీపీ ఢిల్లీ స్థాయిలో పోరాటం
  • ఈ అంశాలనుండి ప్రజల దృష్టి మళ్లించేందుకే సజ్జల అబద్ధాల ప్రెస్‌ మీట్‌

అమరావతి(చైతన్యరథం): టీడీపీ భవిష్యత్తుకు గ్యారెంటీ కార్యక్రమానికి వస్తున్న స్పందనతో వారి భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారుతోందనే భయంతో వైసీపీ నేతలు నిద్రలేని రాత్రులు గడుపుతున్నారని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు. చంద్రబాబు బెయిల్‌ పిటిషన్‌పై సీఐడీ, ఏఏజీ పొన్నవోలు సుధాకరరెడ్డి అసత్య ఆరోపణలపై హైకోర్టు సీరియస్‌ వ్యాఖ్యలు చేసిందని, విచారణ సందర్భంలో సుప్రీంకోర్టు, హైకోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేయడం సహజంగా జరుగుతున్నదనేనన్నారు. కానీ సజ్జల రామకృష్ణారెడ్డి హైకోర్టును ధిక్కరించేలా, దురుద్దేశాలు ఆపాదించే విధంగా మాట్లాడటాన్ని ప్రజలు అసహ్యించుకుంటున్నారని,  చంద్రబాబు బెయిల్‌ని ప్రజలు స్వాగతిస్తున్నారని తెలిపారు. టీడీపీపై సజ్జల లేనిపోని అభాండాలు వేస్తున్నారన్నారని మంగళవారం ఒక ప్రకటనలో అచ్చెన్నాయుడు విమర్శించారు. ప్రజల వ్యక్తిగత గోప్యతకు భంగం కలుగుతుందని సజ్జల బాధపడుతున్నారా లేక వారు చేసే దొంగ పనులకు భంగం కలుగుతోందని బాధపడుతున్నారా అని ప్రశ్నించారు. రకరకాల యాప్‌ల ద్వారా సమాచారాన్ని ఫీల్డ్‌ ఆపరేటింగ్‌ ఏజెన్సీ సేకరిస్తున్న విషయం వాస్తవం కాదా అని అడిగారు.

 

సంబంధితవార్తలు

సజ్జల, పేర్ని నానిని పోలీసులు కస్టడీలోకి తీసుకోవాలి

కౌంటింగ్‌ ఏజెంట్లపై వ్యాఖ్యలు

చంద్రబాబు వినూత్న ‘ప్రజాగళం’ యాత్ర

రాష్ట్ర వ్యాప్తంగా 2.60 లక్షల మంది వాలంటీర్లతో గడపగడపకు వెళ్లి వ్యక్తిగత సమాచారాన్ని సేకరిస్తున్నది వాస్తవం కాదా?

చివరికి అక్రమ సంబంధాలు ఉన్నాయా అని కూడా వివరాలు సేకరించడం ప్రజల్ని బ్లాక్‌ మెయిల్‌ చేసే కుట్రతో కాదా అని అచ్చెన్నాయుడు ప్రశ్నించారు. వైసీపీ వ్యక్తిగత సమాచార సేకరణ ద్వారా రాష్ట్రంలో మహిళల అదృశ్యం కేసులు పెరిగిపోయాయని అన్నారు.  ఒకే డోర్‌ నెంబర్‌తో పదులు, వందల సంఖ్యలో ఓట్లు నమోదు చేసుకుంటున్న నీచమైన చరిత్ర జగన్‌ రెడ్డిది. దొంగ ఓట్లలో జగన్‌ రెడ్డి పీహెచ్‌డీ సాధించాడు. దొంగ ఓట్లతో తిరుపతి, కుప్పం, స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలిచిన జగన్‌ రెడ్డి రానున్న సార్వత్రిక ఎన్నికల్లోనూ ఇదే పద్ధతిని అవలంబించేందుకు ప్రయత్నిస్తున్నారు. గడపగడపకూ అంటూ జగన్‌ రెడ్డి ముఠా ఇళ్లకు వెళ్తే.. ప్రజలు చీపుర్లతో చీత్కరించారు..కానీ, అదే సమయంలో భవిష్యత్తుకు గ్యారెంటీ కార్యక్రమంతో ప్రజల్లోకి వెళ్తున్న టీడీపీ నేతలకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని అచ్చెన్నాయుడు చెప్పారు.

 

టీడీపీ కార్యక్రమాన్ని అడ్డుకునేందుకే..

జగన్‌ రెడ్డి పాలనలో ప్రజలపై పడుతున్న భారాలను, సామాజిక భద్రత కరువైన వైనాన్ని ప్రజలకు బాబు ష్యూరిటీ`భవిష్యత్తుకు గ్యారెంటీ కార్యక్రమంలో టీడీపీ నేతలు, కార్యకర్తలు వివరిస్తున్నారు. ఈ కార్యక్రమాన్ని అడ్డుకునేందుకే డేటా చౌర్యం అంటూ వైసీపీ నేతలు దుష్ప్రచారానికి తెరలేపారు. తెలుగుదేశం పార్టీ ఎక్కడా ప్రజల వ్యక్తిగత సమాచారాన్ని తీసుకోవడం లేదు.  ప్రజా సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీసేందుకు అవసరమైన సమాచారాన్ని మాత్రమే సేకరిస్తోంది. ఓటు ఉందో లేదో పరిశీలించుకోమని తెలుగుదేశం పార్టీ ప్రజల్ని అప్రమత్తం చేస్తుంటే.. ప్రజల వ్యక్తిగత స్వేచ్ఛకు భంగం కలిగిస్తున్నారంటూ వైసీపీ నేతలు దుష్ప్రచారం చేస్తున్నారు. రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కుని తొలగిస్తున్న వైసీపీ నేతలు ప్రజల హక్కులను దిగమింగుతున్న విషయం వాస్తవం కాదా అని అచ్చెన్నాయుడు ప్రశ్నించారు.

 

120 సంక్షేమ పథకాలను జగన్‌ రెడ్డి రద్దు చేయటం వాస్తవం కాదా?

తెలుగుదేశం పార్టీ చేపట్టే ఓటర్‌ వెరిఫికేషన్‌పై ఎందుకు అంతలా ఉలిక్కి పడుతున్నారు. మీరు నమోదు చేయించిన దొంగ ఓట్ల బాగోతం బయటపడుతుందనా అని ప్రశ్నించారు. అందుకే ఇటువంటి చర్యలపై ప్రజల్ని అప్రమత్తం చేసేందుకే ఓటర్‌ జాబితాను పరిశీస్తున్నామని, డూప్లికేట్‌ ఓట్లు, చనిపోయిన ఓటర్ల వివరాలను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నామని చెప్పారు. తెలుగుదేశం పార్టీ 2014 ఎన్నికల మేనిఫెస్టో వెబ్‌సైట్‌ నుండి తొలగించామని చెప్పడం పచ్చి అబద్ధం. ఎన్నికల కమిషన్‌ వెబ్‌ సైట్లో  మేనిఫెస్టో ఉంది. కళ్లుండి చూడలేని వైసీపీ నేతలకు అది కనబడదు అని అర్ధమవుతోంది. 2014-19 మధ్య తెలుగుదేశం అభివృద్ధి, సంక్షేమం, సామాజిక న్యాయంలో ఇచ్చిన హామీల కంటే అధికంగా అమలు చేసింది. తెలుగుదేశం అమలు చేసిన 120 సంక్షేమ పథకాలను జగన్‌ రెడ్డి రద్దు చేయడం వాస్తవం కాదా అని అచ్చెన్నాయుడు ప్రశ్నించారు.

 

మేనిఫెస్టోలో జగన్‌రెడ్డి అమలుచేసింది 15 శాతమే

2019 ఎన్నికల్లో ఇచ్చిన వైసీపీ మేనిఫెస్టోలో జగన్‌ రెడ్డి అమలు చేసింది 15 శాతమే. ఎగనామం పెట్టింది, మాట తప్పింది, మడమ తిప్పింది 85 శాతం.  నవరత్నాలు నవమోసాలయ్యాయి. మద్యనిషేధం, ప్రత్యేక హోదా, జాబ్‌ క్యాలెండర్‌, సీపీఎస్‌ రద్దు, పెన్షన్ల పెంపు వంటి ప్రతి హామీపైనా మాట తప్పి మడమ తిప్పి ప్రజల్ని దగా చేయడం వాస్తవం కాదా.  బైబిల్‌, ఖురాన్‌, భగవద్గీత అని చెప్పి, మద్య నిషేధం హామీ అమలు చేయకుండా పవిత్ర గ్రంథాలకు అపచారం చేశాడు. మద్యం ఆదాయాన్ని 15 ఏళ్లు తాకట్టు పెట్టి రూ.38 వేల కోట్లు అప్పు తెచ్చి, మహిళల మాంగల్యాలు తెంపుతున్నారు. టీడీపీ అధికారంలోకి వచ్చాక, ఒక్కో కుటుంబానికి ఎంత లబ్ధి చేకూరుతుందో చెప్పడం నేరమా? మేం చెప్పేది చేస్తాం.. చేసేదే చెప్తాం అని అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు.

Tags: ‘బాబు ష్యూరిటీ -భవిష్యత్తుకు గ్యారంటీకింజారపు అచ్చెన్నాయుడుదొంగ ఓట్లుసజ్జల రామకృష్ణారెడ్డి
Previous Post

జగన్‌ కిరాయి సైన్యంలా మారిన ఖాకీల కోరలు ప్రజలే పీకేస్తారు: లోకేష్‌

Next Post

టీడీపీ భవిష్యత్ గ్యారెంటీతో ప్రశ్నార్ధకంగా మారిన వైసీపీ భవిష్యత్. – నిమ్మల రామానాయుడు మీడియా సమావేశం

మరిన్ని వార్తలు

చైతన్యరధం ఈ పేపర్ 23-10-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 23-10-2026

కార్యకర్త
@ October 23, 2026
చైతన్యరధం ఈ పేపర్ 22-10-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 22-10-2026

కార్యకర్త
@ October 23, 2026
నిత్యవసరాల ధరలను కట్టడి చేయాలి
ఆంధ్రప్రదేశ్

నిత్యవసరాల ధరలను కట్టడి చేయాలి

చైతన్యరధం
@ October 22, 2026
గొడ్డలి పార్టీకి దెబ్బకొట్టాలి ‘స్థానికం’లో కూటమే గెలవాలి
ఆంధ్రప్రదేశ్

కోర్టు తీర్పులను వక్రీకరించి గొడ్డలిపార్టీ కుట్రలు

చైతన్యరధం
@ October 22, 2026
చైతన్యరధం ఈ పేపర్ 20-10-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 20-10-2026

కార్యకర్త
@ October 20, 2026
అల్ట్రాటెక్ ఆధ్వర్యంలో రూ.2,650 కోట్లతో పెట్నికోట సిమెంట్ వర్క్స్ ప్రాజెక్ట్
ఆంధ్రప్రదేశ్

అల్ట్రాటెక్ ఆధ్వర్యంలో రూ.2,650 కోట్లతో పెట్నికోట సిమెంట్ వర్క్స్ ప్రాజెక్ట్

చైతన్యరధం
@ October 20, 2026
ప్రజాస్వామ్యబద్ధంగా స్థానిక ఎన్నికలు
ఆంధ్రప్రదేశ్

ప్రజాస్వామ్యబద్ధంగా స్థానిక ఎన్నికలు

చైతన్యరధం
@ October 20, 2026
స్థానిక ఎన్నికల్లోనూ.. కూటమికి జై కొట్టండి
ఆంధ్రప్రదేశ్

హింస.. నా డిక్షనరీలోనే లేదు

చైతన్యరధం
@ October 20, 2026
Load More

ముఖ్య వార్తలు

గొడ్డలి పార్టీకి దెబ్బకొట్టాలి ‘స్థానికం’లో కూటమే గెలవాలి

కోర్టు తీర్పులను వక్రీకరించి గొడ్డలిపార్టీ కుట్రలు

చైతన్యరధం
@ October 22, 2026
స్థానిక ఎన్నికల్లోనూ.. కూటమికి జై కొట్టండి

హింస.. నా డిక్షనరీలోనే లేదు

చైతన్యరధం
@ October 20, 2026
స్థానిక ఎన్నికల్లోనూ.. కూటమికి జై కొట్టండి

స్థానిక ఎన్నికల్లోనూ.. కూటమికి జై కొట్టండి

చైతన్యరధం
@ October 20, 2026
దుర్గమ్మకు చీర, సారె సమర్పణ

దుర్గమ్మకు చీర, సారె సమర్పణ

చైతన్యరధం
@ October 17, 2026
మరిన్ని

అత్యధికంగా వీక్షించినవి

ఆదర్శ నియోజకవర్గంగా మంగళగిరి!

ఆదర్శ నియోజకవర్గంగా మంగళగిరి!

చైతన్యరధం
@ August 9, 2026 6:20 AM
దళితులపై జగన్‌ది కపట ప్రేమ!

దళితులపై జగన్‌ది కపట ప్రేమ!

చైతన్యరధం
@ July 9, 2026 6:00 AM
చంద్రబాబు విజన్‌తో విద్యుత్ ధగధగలు 

చంద్రబాబు విజన్‌తో విద్యుత్ ధగధగలు 

చైతన్యరధం
@ April 29, 2026 7:10 AM
అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

చైతన్యరధం
@ March 8, 2026 6:30 AM
మరిన్ని

తాజా సంఘటనలు

నిత్యవసరాల ధరలను కట్టడి చేయాలి

నిత్యవసరాల ధరలను కట్టడి చేయాలి

చైతన్యరధం
@ October 22, 2026
గొడ్డలి పార్టీకి దెబ్బకొట్టాలి ‘స్థానికం’లో కూటమే గెలవాలి

కోర్టు తీర్పులను వక్రీకరించి గొడ్డలిపార్టీ కుట్రలు

చైతన్యరధం
@ October 22, 2026
అల్ట్రాటెక్ ఆధ్వర్యంలో రూ.2,650 కోట్లతో పెట్నికోట సిమెంట్ వర్క్స్ ప్రాజెక్ట్

అల్ట్రాటెక్ ఆధ్వర్యంలో రూ.2,650 కోట్లతో పెట్నికోట సిమెంట్ వర్క్స్ ప్రాజెక్ట్

చైతన్యరధం
@ October 20, 2026
ప్రజాస్వామ్యబద్ధంగా స్థానిక ఎన్నికలు

ప్రజాస్వామ్యబద్ధంగా స్థానిక ఎన్నికలు

చైతన్యరధం
@ October 20, 2026
మరిన్ని
TDP-Logo-mini
మన పార్టీ
  • మన సిద్ధాంతం
  • జై హింద్ - జై తెలుగుదేశం
  • మన చరిత్ర
  • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
  • కార్య నిర్వాహక వర్గం
మన నాయకత్వం
  • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
  • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
  • NTR శత జయంతి ఉత్సవాలు
మన విజయాలు
  • భారత దేశం
  • ఆంధ్ర ప్రదేశ్
  • తెలంగాణ
  • 44 సంవత్సరాల విజయాలు
డౌన్లోడ్స్
  • మ్యానిఫెస్టో
  • మహానాడు 2022 తీర్మానాలు
  • నాయకుడితో నా చిత్రం
  • లోగోలు
  • నాయకుల చిత్రాలు
ప్రచార సమాచారం
  • బ్యానర్స్ / బుక్ లెట్స్
  • పోస్టర్స్ / కరపత్రాలు
  • ప్రచార గీతాలు
  • ఎన్నికల సమాచారం / సూచనలు
మీడియా వనరులు
  • పత్రికా ప్రకటనలు
  • ప్రసంగాలు
  • కార్యక్రమాలు
  • ముఖాముఖి & కథనాలు
  • ఫోటో గ్యాలరీ
  • వీడియో గ్యాలరీ

© 2026 తెలుగుదేశం పార్టీ. Privacy Policy | Terms Conditions.

Telegram Whatsapp Facebook Twitter Instagram Youtube
Sanbrains

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist

No Result
View All Result
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారతదేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • TDP పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • విరాళం
  • అభిప్రాయం
  • చైతన్యరధం ఈ-పేపర్
  • జిల్లా వెబ్‌సైట్‌లు
    • Ananthapuramu
    • Anakapalli
    • Bapatla
    • Chittoor
    • EastGodavari
    • Eluru
    • Guntur
    • Kadapa
    • Kakinada
    • Krishna
    • Kurnool
    • Manyam
    • Nandyala
    • Nellore
    • Palnadu
    • Prakasam
    • Srikakulam
    • Tirupati
    • Visakhapatnam
    • Vizianagaram
    • WestGodavari
  • సూపర్ 6

© 2026 Telugu Desam Party.