- సంఘ విద్రోహ శక్తులను ప్రోత్సహించొద్దు
- కుట్రలతో సమాజాన్ని విడగొట్టాలని
- గొడ్డలి పార్టీ కుతంత్రాలు పన్నుతోంది
- హే రామ్ అంటూ రావణుడికి సమర్థనా
- తల్లికి గౌరవం ఇవ్వని వ్యక్తి అవసరమా?
- ముఖ్యమంత్రి చంద్రబాబు ధ్వజం
బనగానపల్లె(చైతన్యరథం): కుట్రలు కుతంత్రాలతో కులం, మతం, ప్రాంతం, వర్గాలతో సమాజాన్ని విడగొట్టాలని గొడ్డలి పార్టీ ప్రయత్నం చేస్తుందని సీఎం చంద్రబాబు మండిపడ్డారు. బనగానపల్లెలో పట్టాదారు పాసుపుస్తకాల పంపిణీ సభలో ఆయన మాట్లాడుతూ గంజాయి, బ్లేడ్ బ్యాచ్లు, రౌడీయిజాన్ని వైసీపీ ప్రోత్సహిస్తూ రాష్ట్రంలో విధ్వంసం చేస్తోంది. అంతర్వేది రథం దహనం, దుర్గమ్మ గుడిలో వెండి సింహాల చోరీ, రామతీర్ధంలో రాముడి విగ్రహం ధ్వంసం చేసినా గత పాలకులు నిందితులపై ఎలాంటి చర్యలు తీసుకోలేదని వ్యాఖ్యానించారు. గత పాలకులు తిరుపతి వెంకన్న ప్రసాదాన్ని కల్తీ చేశారు. హిందువుల మనోభా వాలను దెబ్బతీశారు. ఇలాంటి ఘోరాలు చాలా చేశారు. ఇలాంటి వాటిని ప్రక్షాళన చేస్తున్నామని తెలిపారు. రెండురోజుల క్రితం ఆదోనిలో శివాలయంలోని దీపంలో ఓ దుర్మార్గుడు సిగరెట్ వెలిగించి అపచారం చేశాడు. వెంటనే కేసు పెట్టి నిందితుడిని అరెస్టు చేశాం. మత విద్వేషాలు రగిలించేలా ఎవరు దుశ్చర్యకు పాల్పడినా కూటమి ప్రభుత్వం క్షమించదని హెచ్చరించారు.
దుర్మార్గులకు గొడ్డలి పార్టీ ఫండింగ్
సామాజిక మాధ్యమాల్లో కొందరు దుర్మార్గాలకు పాల్పడుతు న్నారు. రావణ్ అనే వ్యక్తి పురాణాలను దూషిస్తాడు. మన రాముడు, సీతపై నీచంగా మాట్లాడతాడు. తీవ్రవాదాన్ని, పాకిస్తాన్ను సమర్థిస్తాడు. అలాంటి వారికి గొడ్డలి పార్టీ ఆర్థిక సాయం అందిస్తుంది. ఎంతటి బరితెగింపు ఇది. ప్రజలు దీనిని గుర్తించాలి. వారి పోకడలు ఏమిటో తెలుసుకోవాలి. ముఖ్యమం త్రి స్థాయి వ్యక్తినే దూషిస్తున్న వారికి సామాన్య ప్రజలు ఏం లెక్క తిరుమలకు వెళ్లి డిక్లరేషన్ ఇమ్మంటే వాటిని తిరస్కరించి జగన్రెడ్డి అపచారం చేశారు. నేను చర్చికి వెళ్లినా, మసీదుకు వెళ్లినా అక్కడి మతాచారాలను గౌరవిస్తాను. హే రామ్ అంటూ రావణుడిని ప్రోత్సహిస్తున్న వ్యక్తులను ఏమనాలో తెలియడం లేదు. కాలజ్ఞానం రాసిన పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి కూడా ఇలాంటి వింతలు విచిత్రాలు జరుగుతాయని చెప్పారు. మతవిద్వేషాలు ఎవరు రెచ్చగొట్టే ప్రయత్నం చేసినా చూస్తూ ఊరుకోం. నంద్యాలలో వైఎస్సార్ విగ్రహాన్ని ధ్వంసం చేసిన వ్యక్తి వైసీపీకి చెందిన వాడే అని తెలిసి తోక ముడిచారు. ఓట్లు కోసం తండ్రికి పూజలు చేస్తున్నాడు. బతికి ఉన్న తల్లికి మాత్రం ఆస్తి ఇవ్వకుండా క్షోభ పెడుతున్నాడు. ఇలాంటి వ్యక్తులు మన సమాజా నికి అవసరమా. తల్లికి గౌరవం ఇవ్వని వ్యక్తులు మనకు ఎందుకు? అని ప్రశ్నించారు.














