- దోచుకోవడం, చంద్రబాబుపై అక్రమ కేసుల నమోదుకే జగన్‌రెడ్డి తన సమయాన్నంతా వెచ్చిస్తున్నారు
- కరవు మండలాల ప్రకటనలోనూ రైతులను మోసం చేసిన జగన్ రెడ్డి
అమరావతి:రాష్ట్రంలో కరవు బారిన పడి లక్షలాది ఎకరాల్లో కళ్లముందే పం టలు ఎండిపోతున్నా కేబినెట్ భేటీలో కనీసం చర్చించకపోవడం జగన్‌రెడ్డి రైతు వ్యతిరేక విధానాలకు నిదర్శనమని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చె న్నాయుడు విమర్శించారు.రాష్ట్రంలో 70 శాతం మంది ఆధారపడిన వ్యవసాయం రంగం పట్ల జగన్‌రెడ్డి ఉదాసీన వైఖరికి ఇది అద్దం పడుతోందని విమర్శించారు. తమది రైతు ప్రభుత్వం అని గొప్పలు చెప్పుకునే జగన్‌రెడ్డికి.. శ్రీకాకుళం నుం చి అనంతపూర్ వరకు కరవుతో ప్రజలు వలసబాట పడుతున్నది కనిపించడం లేదా అని శనివారం ఒక ప్రకటనలో అచ్చెన్నాయుడు ప్రశ్నించారు. రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు, సాగునీరు అందక పడుతున్న అవస్థలపై కేబినెట్ లో చర్చించే తీరిక కూడా లేదా?
రైతుల బాధలు కేబినెట్లో చర్చించేంత ప్రధాన సమస్యగా మీకు కనిపించ లేదా? పొరుగు రాష్ట్రం కర్ణాటకలో కరవు వల్ల రూ.30వేల కోట్ల నష్టం జరిగిందని కేంద్రానికి నివేదించగా.. ఇక్కడ వ్యవసాయ రంగంపై కనీస సమీక్ష కూడా లేకపోవడం రాష్ట్ర ప్రజలు చేసుకున్న దౌర్భాగ్యం. ముఖ్యమంత్రి, వ్యవసాయ మంత్రి, ఇరిగేషన్ మంత్రి దోచుకోవడం, చంద్రబాబుపై ఎలా అక్రమ కేసులు నమోదు చేయాలా అని కుట్రలు పన్నుతున్నారు తప్పితే.. రైతుల గురించి పట్టించుకోవడం లేదు. ఎస్డీఆర్ఎఫ్ కింద కేంద్రప్రభుత్వం రాష్ట్రానికి జూలైలో రూ.500 కోట్లు విడుదల చేస్తే.. జగన్ రెడ్డి కనీసం పంటలు కాపాడటానికి, తాగునీటి ివసతి కల్పనకు రూపాయి ఖర్చు చేయలేదు. కరవు తీవ్రంగా ఉంటే..జగన్ రెడ్డి మొక్కుబడిగా 103 మండలాలను కరవు మండలాలుగా ప్రకటించి చేతులు దులిపేసుకున్నారు.
రాష్ట్రంలో ప్రజలు కరవుకు బలవడానికి, రైతులు, రైతు కూలీల వలసలకు జగన్ రెడ్డి దోపిడీ పరిపాలనే కారణం. చంద్రన్న ప్రభుత్వం సాగునీటి ప్రాజెక్టులకు ఐదేళ్లలో రూ.68వేల కోట్లు ఖర్చు చేయగా.. జగన్ రెడ్డి రూ.25వేల కోట్లు మాత్రమే ఖర్చు చేశారు. ఇరిగేషన్ ప్రాజెక్టులు పూర్తిచేసి ఉంటే లక్షలాది మంది పేదల వలసలు ఉండేవి కావు. గతంలో జగన్ పట్టిసీమను వట్టిసీమ అన్నారు. ఇప్పుడు పట్టిసీమ నీరే ఆధారమైంది. పట్టిసీమపై నిందలు వేసినందుకు జగన్ రెడ్డి బహిరంగ క్షమాపణ చెప్పాలి. ఇంతటి కరవు తాండివిస్తున్నా, పేద ప్రజలు అల్లాడుతున్నా కరవు సాయం ప్రకటించలేదు. కనీసం బోర్లలో నీరు వాడుకుందామన్నా.. కరెంట్ కోతలతో రైతులు అల్లాడుతున్నారు. చంద్రన్న పాలనలో కరవును ఎదుర్కొనేందుకు ట్రాక్టర్లతో నీటి సరఫరా, రెయిన్ గన్లు, పంట కుంటలు ఏర్పాటు చేశారు. నేడు కరవు మండలాల ప్రకటనలోనూ మోసం చేస్తున్నారు. కేంద్రం నుంచి నిధులు తీసుకురావడంలో విఫలమయ్యారు. ఇప్పటికైనా రాష్ట్రంలో నెలకొన్న తీవ్ర దుర్భిక్షంపై చర్చించి రైతులను తగిన విధంగా ఆదుకోవాలని అచ్చెన్నాయుడు డిమాండ్ చేశారు.