న్యూఢిల్లీ: తనకు అప్పగించిన పౌర విమానయాన మంత్రిత్వ శాఖకు సంపూర్ణ న్యాయం చేస్తానని కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు అన్నారు. ఢిల్లీలోని రాజీవ్ గాంధీ భవన్లో పౌర విమానయాన శాఖ మంత్రిగా గురువారం బాధ్యతలు చేపట్టిన అనంతరం ఆయన మాట్లాడారు. క్యాబినెట్లో అత్యంత చిన్న వయసులో ఉన్న నాపై పెద్ద బాధ్యత పెట్టారు. ఇది యువతపై ప్రధానికి ఉన్న నమ్మకం. పౌర విమానయాన శాఖ ఇచ్చిన ప్రధాని మోదీకి కృతజ్ఞతలు. మంత్రిత్వ శాఖకు సంబంధించి 100 రోజుల యాక్షన్ ప్లాన్ అమలు చేయనున్నాం. సాంకేతిక వినియోగంతో పౌర విమానయానాన్ని మరింత ముందుకు తీసుకెళ్తాం. సామాన్యుడికి ఈజ్ ఆఫ్ ఫ్లైయింగ్ తీసుకువస్తాం. ప్రయాణికుడికి భద్రత సౌకర్యంగా ఉండేలా చూస్తాం. తెదేపా అధినేత, సీఎం చంద్రబాబు నాయకత్వంలో గత 10 సంవత్సరాలు ఎంపీగా పని చేశా. సమర్థ నాయకత్వం ఎలా ఉండాలనేది ఆయన నుంచి నేర్చుకున్నా. ఎయిర్పోర్టులను పర్యావరణ హితంగా చేయడానికి చర్యలు తీసుకుంటాం. ద్వితీయ, తృతీయ స్థాయి నగరాలకు విమానాశ్రయాలు తీసుకురావడం, విమానయానం సామాన్య ప్రయాణికుడికి అందుబాటులోకి తీసుకురావడమే మా లక్ష్యం. గతంలో రాష్ట్రానికి చెందిన అశోక్ గజపతి రాజు పౌర విమానయాన శాఖ మంత్రిగా ఉన్నారు.
ఆయన హయాంలో ప్రయాణికులకు సదుపాయాలు కల్పించడంతో పాటు ఏపీలోనూ విమానయానానికి అద్భుతంగా పునాదులు వేశారు. ఉడాన్ స్కీమ్ కూడా ఆయన మంత్రిగా ఉన్నప్పుడే అమలు చేసి చిన్న నగరాలతో పాటు, సామాన్యుడికీ విమానయాన అవకాశం కల్పించారు. దీన్ని మరింత విస్తరిస్తాం. ఓ వైపు ప్రధాని మోదీ, మరో వైపు పక్కన చంద్రబాబు లాంటి విజనరీ నాయకులు ఉండటం నాకు కలిసొచ్చే అంశం. దేశ ప్రజలు గర్వపడేలా బాధ్యతలు నిర్వర్తిస్తా. భోగాపురం ఎయిర్పోర్ట్కు అశోక్ గజపతిరాజు హయాంలో పునాది పడిరది. గత ఐదు సంవత్సరాల్లో అక్కడ అభివృద్ధి కుంటుపడిరది. రికార్డు సమయంలో ఆ ఎయిర్పోర్ట్ను పూర్తి చేస్తాం. దీనిపై ఏపీ సీఎం చంద్రబాబుతో చర్చిస్తాం. విజయవాడ, తిరుపతి విమానాశ్రయాలకు డొమెస్టిక్, ఇంటర్నేషనల్ కనెక్టివిటీని మరింత పెంచుతాం. రాజమహేంద్రవరం, కడప, కర్నూలు ఎయిర్పోర్టులను అభివృద్ధి చేస్తాం. తెలంగాణప్రభుత్వంతో సంప్రదించి అక్కడి విమానయాన శాఖ కార్యక్రమాలకు ప్రోత్సాహం అందిసామని రామ్మోహన్ నాయుడు తెలిపారు.