అమరావతి(చైతన్యరథం): సమాధులపై ఫొటోలు వేసుకున్నట్లుగా సర్వే రాళ్లపై జగన్ బొమ్మలు వేయించారని రాష్ట్ర వ్యవసాయ మంత్రి అచ్చెన్నాయుడు ఎద్దేవా చేశారు. రైతుల పొలాల్లో సర్వే రాళ్లపై జగన్ తన ఫొటోలు వేయించుకోవడం విడ్డూరమన్నారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా మంత్రి ట్వీట్ చేశారు. రైతు తన పొలంలో దిష్టిబొమ్మ పెట్టడానికి ఒప్పుకుంటాడు కానీ పొలం హక్కు పుస్తకాల మీద దిష్టిబొమ్మ పెడితే ఊరుకోడు.. సమాధి రాళ్ల మీద ఫోటో వేసుకున్నట్లు రైతులందరి పొలాల్లో సర్వే రాళ్లపై నీ (జగన్) ఫోటోలు వేయించావు. ప్రజల సొమ్ము రూ.650 కోట్లతో సర్వే రాళ్లపై బొమ్మలు వేసి పబ్లిసిటీ స్టంట్లు చేసినందుకే నిన్ను ఇంటికి పంపించారు..అంటూ జగన్‌ను ట్యాగ్ చేస్తూ ట్వీట్ చేశారు.