- విద్యాశాఖ జారీచేసిన జీవో నెం.1 ద్వారా వేతనాలు వర్తింపు
అమరావతి (చైతన్య రథం): రాష్ట్రవ్యాప్తంగా ప్రైవేటు పాఠశాలల్లో మొత్తం 1,25 లక్షలమంది ఉపాధ్యాయులు పనిచేస్తున్నారని విద్య, ఐటీ మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. రాష్ట్రంలోని ప్రైవేటు పాఠశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయుల వివరాలు, వారికి ఏ మార్గదర్శకాల ప్రకారం జీతాలు చెల్లిస్తున్నారు, ప్రైవేటు ఉపాధ్యాయుల సంక్షేమం కోసం ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై శాసనమండలిలో కే.ఎస్ లక్ష్మణరావు, ఇళ్లా వెంకటేశ్వరరావు, బొర్రా గోపిమూర్తి అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానం ఇచ్చారు. 01-01-1994 తేదీన విద్యాశాఖ జారీచేసిన జీవో నెం.1 ద్వారా ప్రైవేటు పాఠశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయుల వేతనాలు వర్తిస్తాయని, జీవోలోని నిబంధనలు అమలుచేయాలని సంబంధిత అధికారులకు సూచనలు జారీచేయడం జరిగిందని మంత్రి వివరించారు.