చైతన్యరధం ఈ-పేపర్
అభిప్రాయం
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
టీడీపీ లో చేరండి
విరాళం
Telugu Desam
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
TDP - తెలుగు దేశం పార్టీ
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
No Result
View All Result
Telugu Desam
Home ఆంధ్రప్రదేశ్

17 నెలలు…రూ.20 లక్షల కోట్లు!

వీఈఆర్‌ 2040 మాస్టర్‌ ప్లాన్‌ రూపకల్పన సదస్సులో సీఎం చంద్రబాబు

by చైతన్యరధం
Nov 14, 2025 at 6:40am
in ఆంధ్రప్రదేశ్, చైతన్యరధం, తాజా సంఘటనలు
17 నెలలు…రూ.20 లక్షల కోట్లు!
Share on FacebookShare on TwitterShare on Whatsapp
  • గ్లోబల్‌ డెస్టినేషన్‌గా విశాఖ ఎకనమిక్‌ రీజియన్‌
  • పోర్ట్‌ ఆధారిత అభివృద్ధిపై ప్రభుత్వం ఫోకస్‌
  • వీఈఆర్‌ 2040 మాస్టర్‌ ప్లాన్‌ రూపకల్పన సదస్సులో సీఎం చంద్రబాబు
  • విశాఖ ఎకనమిక్‌ రీజియన్‌ డాక్యుమెంట్‌ విడుదల చేసిన సీఎం, నీతి ఆయోగ్‌ సీఈఓ సుబ్రమణ్యం

విశాఖపట్నం (చైతన్య రథం): రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడంతోపాటు… పెట్టుబడులను తెచ్చేలా పూర్తిస్థాయిలో దృష్టి సారించామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. ఈ క్రమంలోనే ప్రభుత్వం ఏర్పాటైన 17 నెలల్లోనే రాష్ట్రానికి రూ.20 లక్షల కోట్ల పెట్టుబడులు తేగలుగుతున్నామని ప్రకటించారు. పెట్టుబడుల సదస్సుకు ముందు రోజైన గురువారం నిర్వహించిన విశాఖ ఎకనామిక్‌ రీజియన్‌ సదస్సుకు సీఎం హజరయ్యారు. గ్లోబల్‌ ఎకనమిక్‌ హబ్‌గా విశాఖ రీజియన్‌ అభివృద్ధి చేసేలా రూపొందిస్తోన్న ప్రణాళికపై చర్చించారు. అలాగే విశాఖ ఎకనామిక్‌ రీజియన్‌ `2040 మాస్టర్‌ ప్లాన్‌ రూపకల్పనపై దృష్టి సారించాలన్నారు. ఈ సదస్సు వేదికగా విశాఖ ఎకనామిక్‌ రీజియన్‌ డెవలప్‌మెంట్‌ డాక్యుమెంట్‌ను ముఖ్యమంత్రి, నీతిఆయోగ్‌ సీఈఓ సుబ్రహ్మణ్యం సంయుక్తంగా విడుదల చేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ.. ‘‘విశాఖను మోస్ట్‌ లివబుల్‌ సిటీగా తీర్చిదిద్దుతున్నాం. ప్రధాని మోదీ ఏపీ అభివృద్ధికి సహకరిస్తున్నారు. 2038కి భారత్‌ రెండో అతిపెద్ద ఆర్ధిక వ్యవస్థగా మారుతుంది. 2047కు భారతదేశం అగ్రస్థానంలోకి రావటాన్ని ఎవరూ ఆపలేరు. రాష్ట్రాభివృద్ధి కోసమే ఓ విజన్‌ తయారు చేసుకుని అమలు చేస్తున్నాం. దేశంలోని నాలుగు నగరాలకు విజన్‌ తయారు చేయాలని కేంద్రం నిర్దేశించింది. ముంబై, వారణాసి, సూరత్‌, విశాఖవంటి నగరాల అభివృద్ధికి విజన్‌ రూపొందించాలని కేంద్రం సూచించింది. ఈమేరకు ప్రస్తుతం రూపొందించుకున్న విజన్‌ అమలు చేయాలని నిర్ణయించింది. అక్షర క్రమంలో, అభివృద్ధి పోటీలో ఏపీనే ఎప్పుడూ ముందుంటుంది. సాగరతీరాన ఉన్న విశాఖ నగరం దేశంలోనే అత్యంత సుందరమైన ప్రాంతం’’ అని ముఖ్యమంత్రి ఉద్ఘాటించారు.

వాళ్లు పాడు చేశారు… మేం బాగు చేస్తున్నాం
‘‘గత పాలకులు రాష్ట్రాన్ని, దాని అభివృద్ధిని సర్వనాశనం చేశారు. అందుకే కూటమిగా ప్రజల మద్దతుతో పునర్నిర్మాణం చేస్తున్నాం. రూ.3.65 లక్షల కోట్ల విలువైన ఎంఓయూలు సీఐఐ పార్టనర్షిప్‌ సమ్మిట్‌కంటే ముందే కుదుర్చుకున్నాం. రెండు రోజుల సదస్సులో మరిన్ని పెట్టుబడులపై ఒప్పందాలు కుదుర్చుకోబోతున్నాం. 17 నెలల్లోనే రాష్ట్రానికి రూ.20 లక్షల కోట్ల పెట్టుబడులు తీసుకొచ్చే పరిస్థితికి ప్రస్తుతానికి ఏపీ చేరింది. గూగుల్‌ డేటా సెంటర్‌ 15 బిలియన్‌ డాలర్ల పెట్టుబడులతో వస్తోంది. అనకాపల్లిలో దాదాపు రూ. లక్ష కోట్లతో ఆర్సెల్లార్‌ మిట్టల్‌ స్టీల్‌ ప్లాంట్‌ నిర్మించబోతోంది. 9 జిల్లాలతో ఏర్పాటు చేస్తున్న విశాఖ ఎకనామిక్‌ రీజియన్‌ భవిష్యత్‌ ఆర్థిక శక్తిగా ఏపీని నిర్దేశించే ఓ మోడల్‌. విశాఖను గ్లోబల్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ డెస్టినేషన్‌, సుస్థిర అభివృద్ధి కేంద్రంగా తీర్చిదిద్దుతున్నాం. విశాఖపట్నం ఇండస్ట్రియల్‌ రీజియన్‌ మాస్టర్‌ ప్లాన్‌ `2040కు రూపకల్పన చేశాం. తూర్పుతీరంలో వీఈఆర్‌ దేశ ఆర్ధిక ప్రగతికి గేట్‌ వే. అన్ని వనరులున్న 9 జిల్లాలతో విశాఖ ఎకనామిక్‌ రీజియన్‌ ఏర్పాటైంది. విశాఖ ఎకనామిక్‌ రీజియన్‌ అథారిటీకి చైర్మన్‌ హోదాలో నేనే స్వయంగా అభివృద్ధిని పర్యవేక్షిస్తాను. అలాగే ఈ రీజియన్‌కు పరిశ్రమల శాఖ కార్యదర్శి సీఈఓగా వ్యవహరిస్తారు. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం పరిధిలో ఏరో సిటీని అభివృద్ధి చేస్తాం. ఇదే ప్రాంతంలో ఆక్వా సహా ఇతర రంగాలకు చెందిన పరిశ్రమలనూ ఆకర్షిస్తాం. పర్యాటకంతోపాటు హెల్త్‌ కేర్‌ రంగంలోనూ విశాఖ ఓ కేంద్రంగా మార్చేలా ప్రణాళికలు చేస్తున్నాం. పోర్టులు, పారిశ్రామిక కారిడార్‌లు, లాజిస్టిక్స్‌, నౌకా, రక్షణ పరిశ్రమలు, టూరిజం రంగాలను సమన్వయం చేస్తాం’’ అని సీఎం చంద్రబాబు వెల్లడిరచారు.

సంబంధితవార్తలు

భూ హక్కుల పరిరక్షణలో దేశానికే ఆదర్శంగా ఏపీ

చైతన్యరధం ఈ పేపర్ 20-06-2026

డీఎస్సీపై మంత్రి లోకేష్ సవాల్‌కు..సమాధానం చెప్పే దమ్ముందా జగన్?

పోర్టులే… ఏపీ అభివృద్ధికి హార్ట్‌
‘‘రాష్ట్రాన్ని పోర్ట్‌ ఆధారితంగా అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తున్నాం. విశాఖ, గంగవరం, కాకినాడ, రామాయపట్నం పోర్టులను అనుసంధానం చేస్తున్నాం. తూర్పుతీర సముద్ర వాణిజ్యానికి విశాఖను ప్రధాన నోడల్‌ పాయింట్‌గా అభివృద్ధి చేస్తాం. విశాఖ`శ్రీకాకుళం కారిడార్‌ను నౌకా నిర్మాణ హబ్‌గా తీర్చిదిద్దుతాం. సముద్ర ఆధారిత పరిశ్రమలు, మత్స్య పరిశ్రమ, గ్రీన్‌ హైడ్రోజన్‌ ప్రాజెక్టులను ప్రోత్సహిస్తున్నాం. తీర ప్రాంత ఆర్థిక కార్యకలాపాల ద్వారా సుస్థిర జీవనోపాధి అవకాశాలు సృష్టించడం మా ప్రభుత్వ విధానం. స్మార్ట్‌ లాజిస్టిక్స్‌, కనెక్టివిటీపై ప్రధానంగా దృష్టి పెట్టాం. విశాఖ`కాకినాడ`రాజమండ్రి హైవే, రైల్వే లైన్లను మెరుగుపరుస్తాం. ఎయిర్‌ కార్గో, ఇండస్ట్రియల్‌ పార్కులు, ఎక్స్‌పోర్ట్‌ హబ్‌లను ఒకే ఎకో సిస్టమ్‌ కిందకు తీసుకువస్తాం. స్కిల్‌ విశాఖ ఇనిషియేటివ్‌ ద్వారా 1 లక్షమంది యువతకు నైపుణ్య శిక్షణ అందిస్తాం. మారిటైమ్‌, నావల్‌ సిస్టమ్‌ క్లస్టర్‌ రూపకల్పనలో కేంద్ర ప్రభుత్వ, నౌకాదళ, ప్రైవేట్‌రంగ భాగస్వామ్యం కోసం ప్రయత్నిస్తున్నాం’’ అని ముఖ్యమంత్రి వివరించారు. ఈ సదస్సుకు కేంద్ర మంత్రి రామ్మోహన్‌ నాయుడు, మంత్రులు పయ్యావుల కేశవ్‌, పొంగూరు నారాయణ, డోలా బాల వీరాంజనేయ స్వామి, కొండపల్లి శ్రీనివాస్‌, కందుల దుర్గేష్‌, అనిత, గుమ్మిడి సంధ్యారాణి, సీఎస్‌ విజయానంద్‌ సహా పలువురు ప్రజా ప్రతినిధులు హజరయ్యారు.

Previous Post

సరికొత్త పర్యాటకానికి బాటలు

Next Post

చైతన్యరధం ఈ పేపర్ 14-11-2025

మరిన్ని వార్తలు

భూ హక్కుల పరిరక్షణలో దేశానికే ఆదర్శంగా ఏపీ
ఆంధ్రప్రదేశ్

భూ హక్కుల పరిరక్షణలో దేశానికే ఆదర్శంగా ఏపీ

చైతన్యరధం
@ June 20, 2026
చైతన్యరధం ఈ పేపర్ 20-06-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 20-06-2026

కార్యకర్త
@ June 20, 2026
డీఎస్సీపై మంత్రి లోకేష్ సవాల్‌కు..సమాధానం చెప్పే దమ్ముందా జగన్?
ఆంధ్రప్రదేశ్

డీఎస్సీపై మంత్రి లోకేష్ సవాల్‌కు..సమాధానం చెప్పే దమ్ముందా జగన్?

చైతన్యరధం
@ June 20, 2026
గాదె సాయికృష్ణ ఉదంతంపై…రాజకీయ లబ్ధికి జగన్ ఆరాటం
ఆంధ్రప్రదేశ్

గాదె సాయికృష్ణ ఉదంతంపై…రాజకీయ లబ్ధికి జగన్ ఆరాటం

చైతన్యరధం
@ June 20, 2026
ఆంధ్రప్రదేశ్

అంగన్వాడీ కేంద్రాలకు ఇండక్షన్ స్టవ్‌లు

చైతన్యరధం
@ June 20, 2026
అమరావతిలో డిజిటల్ మౌలిక సదుపాయాలు
ఆంధ్రప్రదేశ్

అమరావతిలో డిజిటల్ మౌలిక సదుపాయాలు

చైతన్యరధం
@ June 20, 2026
ఏపీలో సిలికాన్-కార్బన్ యానోడ్ యూనిట్ ఏర్పాటు చేయండి
ఆంధ్రప్రదేశ్

ఏపీలో సిలికాన్-కార్బన్ యానోడ్ యూనిట్ ఏర్పాటు చేయండి

చైతన్యరధం
@ June 20, 2026
జీరో డిజిటల్ ఫైనాన్షియల్ ఫ్రాడ్స్ దిశగా చర్యలు
ఆంధ్రప్రదేశ్

జీరో డిజిటల్ ఫైనాన్షియల్ ఫ్రాడ్స్ దిశగా చర్యలు

చైతన్యరధం
@ June 20, 2026
Load More

ముఖ్య వార్తలు

అన్నదాతల ఖాతాల్లోకి ‘సుఖీభవ’

అన్నదాతల ఖాతాల్లోకి ‘సుఖీభవ’

చైతన్యరధం
@ June 20, 2026
పొగాకు రకం ఏదైనా కిలో రూ.200కి తగ్గకూడదు

పొగాకు రకం ఏదైనా కిలో రూ.200కి తగ్గకూడదు

చైతన్యరధం
@ June 19, 2026
ఫీల్డ్ విజిట్‌లు చేయాల్సిందే

ఫీల్డ్ విజిట్‌లు చేయాల్సిందే

చైతన్యరధం
@ June 18, 2026
సింగపూర్ ప్రధానితో సీఎం చంద్రబాబు భేటీ

సింగపూర్ ప్రధానితో సీఎం చంద్రబాబు భేటీ

చైతన్యరధం
@ June 16, 2026
మరిన్ని

అత్యధికంగా వీక్షించినవి

చంద్రబాబు విజన్‌తో విద్యుత్ ధగధగలు 

చంద్రబాబు విజన్‌తో విద్యుత్ ధగధగలు 

చైతన్యరధం
@ April 29, 2026 7:10 AM
అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

చైతన్యరధం
@ March 8, 2026 6:30 AM
కష్టాలు ఉన్నా.. కర్తవ్యం వీడలేదు!

కష్టాలు ఉన్నా.. కర్తవ్యం వీడలేదు!

చైతన్యరధం
@ February 18, 2026 6:15 AM
న్యాయవ్యవస్థపై 420 జగన్‌రెడ్డి విషపూరిత కుట్ర!

సైకో పోయాడు.. నవ నిర్మాత వచ్చాడు

చైతన్యరధం
@ December 21, 2025 6:00 AM
మరిన్ని

తాజా సంఘటనలు

భూ హక్కుల పరిరక్షణలో దేశానికే ఆదర్శంగా ఏపీ

భూ హక్కుల పరిరక్షణలో దేశానికే ఆదర్శంగా ఏపీ

చైతన్యరధం
@ June 20, 2026
డీఎస్సీపై మంత్రి లోకేష్ సవాల్‌కు..సమాధానం చెప్పే దమ్ముందా జగన్?

డీఎస్సీపై మంత్రి లోకేష్ సవాల్‌కు..సమాధానం చెప్పే దమ్ముందా జగన్?

చైతన్యరధం
@ June 20, 2026
గాదె సాయికృష్ణ ఉదంతంపై…రాజకీయ లబ్ధికి జగన్ ఆరాటం

గాదె సాయికృష్ణ ఉదంతంపై…రాజకీయ లబ్ధికి జగన్ ఆరాటం

చైతన్యరధం
@ June 20, 2026

అంగన్వాడీ కేంద్రాలకు ఇండక్షన్ స్టవ్‌లు

చైతన్యరధం
@ June 20, 2026
మరిన్ని
TDP-Logo-mini
మన పార్టీ
  • మన సిద్ధాంతం
  • జై హింద్ - జై తెలుగుదేశం
  • మన చరిత్ర
  • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
  • కార్య నిర్వాహక వర్గం
మన నాయకత్వం
  • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
  • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
  • NTR శత జయంతి ఉత్సవాలు
మన విజయాలు
  • భారత దేశం
  • ఆంధ్ర ప్రదేశ్
  • తెలంగాణ
  • 44 సంవత్సరాల విజయాలు
డౌన్లోడ్స్
  • మ్యానిఫెస్టో
  • మహానాడు 2022 తీర్మానాలు
  • నాయకుడితో నా చిత్రం
  • లోగోలు
  • నాయకుల చిత్రాలు
ప్రచార సమాచారం
  • బ్యానర్స్ / బుక్ లెట్స్
  • పోస్టర్స్ / కరపత్రాలు
  • ప్రచార గీతాలు
  • ఎన్నికల సమాచారం / సూచనలు
మీడియా వనరులు
  • పత్రికా ప్రకటనలు
  • ప్రసంగాలు
  • కార్యక్రమాలు
  • ముఖాముఖి & కథనాలు
  • ఫోటో గ్యాలరీ
  • వీడియో గ్యాలరీ

© 2026 తెలుగుదేశం పార్టీ. Privacy Policy | Terms Conditions.

Telegram Whatsapp Facebook Twitter Instagram Youtube
Sanbrains
No Result
View All Result
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారతదేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • TDP పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • విరాళం
  • అభిప్రాయం
  • చైతన్యరధం ఈ-పేపర్
  • జిల్లా వెబ్‌సైట్‌లు
    • Ananthapuramu
    • Anakapalli
    • Bapatla
    • Chittoor
    • EastGodavari
    • Eluru
    • Guntur
    • Kadapa
    • Kakinada
    • Krishna
    • Kurnool
    • Manyam
    • Nandyala
    • Nellore
    • Palnadu
    • Prakasam
    • Srikakulam
    • Tirupati
    • Visakhapatnam
    • Vizianagaram
    • WestGodavari
  • సూపర్ 6

© 2022 Telugu Desam Party. Designed by Tecbrains.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Create New Account!

Fill the forms below to register

*By registering into our website, you agree to the Terms & Conditions and Privacy Policy.
All fields are required. Log In

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist