అమరావతి(చైతన్యరథం): ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 2024-25లో మదర్ శాంక్షన్ కింద కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ ఉపాధి హామీ వేతనాల చెల్లింపుల నిమిత్తం 21.5 కోట్ల పనిదినాలకు రూ.5743.90 కోట్లు మంజూరు చేసిందని ఉపముఖ్యమంత్రి, పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి మంత్రి పవన్కళ్యాణ్ తెలిపారు. కాగా గతంలో ఆమోదించిన 15 కోట్ల పనిదినాలకు సంబంధించి వేతన నిధులు రూ.2934.80 కోట్లు విడుదల చేసిందని, అదనంగా ఇప్పుడు రూ.2812.98 కోట్లను మంజూరు చేస్తూ కేంద్ర గ్రామీణాభివృద్ది శాఖ ఉత్తర్వులు ఇచ్చిందని చెప్పారు. ఇప్పటివరకు ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.2809.10 కోట్లు రోజువారీ వేతన ఎఫ్టీవోల అప్లోడ్ ఆధారంగా నేరుగా కూలీల ఖాతాలకు జమ అయ్యాయని, మిగిలిన మొత్తాలు కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా త్వరలోనే ఖాతాలకు జమ అవుతాయని వెల్లడిరచారు.