- పెంచుతామని ఏపీ ఫైబర్‌నెట్ లిమిటెడ్ చైర్మన్ జీవీ రెడ్డి ఉద్ఘాటన
- చైర్మన్‌గా బాధ్యతల స్వీకారం
అమరావతి (చైతన్యరథం): ఏపీ స్టేట్ ఫైబర్‌నెట్ లిమిటెడ్ (ఏపీఎఫ్ఎస్ఎల్) చైౖర్మన్‌గా జీవీ రెడ్డి శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు.బాధ్యతలు స్వీకరించిన అనంతరం చైర్మన్ మాట్లాడుతూ ఫైబర్‌నెట్ కనెక్షన్లను రెండేళ్ల కాలంలో యాభై లక్షలకు పెంచుతామన్నారు. తనకు చైర్మన్ గా అవకాశం కల్పించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, విద్యా శాఖ మంత్రి నారా లోకేష్, ఎంపీ దగ్గుపాటి పురంధేశ్వరిలకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నానన్నారు. 2014లో ఆనాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఏపీ ఫైబర్ నెట్ ను ప్రారంభించారన్నారు. ఇది సర్వీస్ ప్రొవైడర్ కేబుల్ నెట్వర్క్ అని అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు మానస పుత్రిక ఏపీఎస్ఎఫ్ఎల్ అన్నారు. ఇప్పటి వరకు ఆరు లక్షల కేబుల్ కనెక్ష న్లు మాత్రమే ఉన్నాయన్నారు. వీలైనంత వరకు నాణ్యమైన సేవలు అందించి ఇచ్చి ప్రజల ఆదరణ పొందుతామన్నారు. ప్రైవేట్ కంపెనీ సర్వీస్ ప్రొవైడర్లకు పోటీగా ప్రజలకు సేవలు అందిస్తామన్నారు.
గత ప్రభుత్వం లో ఏం జరిగింది, ఏం చేశారనే అంశాల పై త్వరలోనే ఆధారాలతో మాట్లాడతానన్నారు. ఫైబర్ నెట్ ను ప్రజలకు చేరువ చేయడంలో తమ వంతు కృషి చేస్తామన్నారు. ఇంటర్ నెట్, ఫోన్, కేబుల్ పూర్తి క్వాలిటీతో అందిస్తామన్నారు. నేడు వర్క్ ఫ్రమ్ హోమ్ అనేది సహజంగా మారి పోయిన తరుణంలో నెట్ కనెక్షన్ అందరికీ ఆవశ్యకమైందన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ప్రతి ఒక్కరికీ ఈ సేవలు అందాల్సిన అవసరం ఉందన్నారు. 2014 లో ప్రారంభ సమయంలో బాగా కనెక్షన్లు తీసుకున్నారన్నారు. గత ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల చాలా మంది ప్రైవేటు సంస్థలకు మళ్లారన్నారు. మళ్లీ పూర్తి క్వాలిటీతో ప్రసారాలు ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తామన్నారు. యాభై లక్షల కనెక్షన్ల లక్ష్యాన్ని రెండేళ్లలో సాధిస్తామన్నారు. గత ప్రభుత్వంలో జరిగిన అక్రమాల పై అధ్యయనం చేసిన తరువాత స్పందిస్తానన్నారు. ప్రజలకు నాణ్యమైన ప్రసారాలు అందచడం పైనే ప్రస్తుతం మా ఆలోచనలు, ప్రణాళికలు ఉన్నాయన్నారు. చైర్మన్ ను అభినందించిన వారిలో రోడ్లు, భవనాల శాఖ మంత్రి బీసీ జనార్ధన్ రెడ్డి, శాసనసభ్యులు జూలకంటి బ్రహ్మానంద రెడ్డి, గాలి భానుప్రకాష్, బీఎన్ విజయ్ కుమార్, నల్లమిల్లి రామకృష్ణా రెడ్డి, కందుల నారాయణ రెడ్డి, కొండ్రు మురళీ మోహన్, 20 సూత్రాల అమలు కమిటీ చైర్మన్ లంకా దినకర్, మారిటైమ్ బోర్డు చైర్మన్ దామచర్ల సత్య, స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభిరామ్, బీజేపీ నాయకుడు పాతూరి నాగబూషణం, తదితరులు ఉన్నారు.