- తప్పుడు పనులు చేస్తుంటే చూస్తూ ఊరుకోవాలా?
- రాష్ట్రంలో ఆందోళనకరంగా మారిన శాంతిభద్రతలు
- నేను మాట్లాడితే ఎదురుదాడి చేస్తున్నారు
- సాక్షి గుమాస్తా నాపై విమర్శలు చేయడం విడ్డూరం
- వైసిపి నేతలపై నిప్పులు చెరిగిన చంద్రబాబునాయుడు
- టిడిపి కేంద్ర కార్యాలయంలో ఘనంగా ప్రపంచ ఆదివాసీ దినోత్సవం
అమరావతి: ముఖ్యమంత్రి జగన్‌రెడ్డి ఊరికో ఆంబోతును జనంపైకి వదిలారు.. ఆ ఆంబోతులంతా బట్టలిప్పి తిరుగుతూ ప్రజలను భయభ్రాంతులను చేస్తుంటే తాము చూస్తూ ఊరుకోవాలా అని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు తీవ్రస్థాయిలో దుయ్యబట్టారు. ఒక ముఖ్యమంత్రిగా, పార్టీ అధ్యక్షుడిగా తప్పుచేసిన వారిని పిలిచి మందలించాలి, మరోమారు అలాంటిది జరగకుండా పార్టీ నుంచి సస్పెండ్ చేయాల్సింది పోయి కులాలను రెచ్చగొట్టి పబ్బం గడుపు కోవాలనుకోవడం సిగ్గుచేటని అన్నారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఎస్టీ సెల్ ఆద్వర్యాన ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా హాజరైన చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ.. వైసీపీ ప్రభుత్వాన్ని, జగన్ రెడ్డిని, వారి మంత్రులను, ఎంపీలను చూస్తే సిగ్గేస్తోం ది.. ఆత్మాభిమానంతో రాజకీయాలు చేయాలన్నారు. నేడు సిగ్గు, లజ్జాలేనివాళ్లంతా రాజకీయాల్లోకి వచ్చారు.. చేసిన తప్పుకు పశ్చాత్తాపపడకుండా కులాల, మతాల చిచ్చు పెట్టాలని చూడటం హేయమన్నారు.చేసిన తప్పులు కప్పిపుచ్చుకోవడానికి మళ్లీ తప్పుడు పనులు చేసే పరిస్థితికి వచ్చారు.. జగన్‌రెడ్డి అటువంటి వారిని కట్టడిచేయక పోవడంతో ఆ ఆంబోతులంతా ఆడబిడ్డలపై పడే పరి స్థితికి వచ్చారని ఆందోళన వ్యక్తంచేశారు. అటువంటి ఆంబోతులను కొమ్ములు విరిచి అదుపుచేసే శక్తి తెలుగు దేశం పార్టీకి ఉంది.. బాధితులకు తెలుగుదేశం పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. రాష్ట్రంలో ఇంత దారుణ పరిస్ధితులు ఎన్నడూ చూడలేదు. అనంతపురం లో ఒక యువతిపై ముగ్గురు అత్యాచారం చేశారు. బాధిత యువతి వాళ్లకు భయపడి పొరుగు రాష్ట్రమైన కర్నాటక వెళ్లి కేసుపెట్టారు. నంద్యాలలో కానిస్టేబుల్‌ని ఓ రౌడీ షీటర్ చంపాడు. మహిళా హోంగార్డులపై ఎస్సై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. రాష్ట్రంలో పరిస్థితి చూస్తే ఆందోళన కలుగుతోంది. వీటిపై నేను మాట్లాడితే నాపై ఎదురుదాడి చేస్తారు. వాళ్ల దాడికి నేను భయపడతానా? అంటూ చంద్రబాబు నిప్పులు చెరిగారు. సాక్షిలో పనిచేసే గుమాస్తా నన్ను విమర్శిస్తున్నారు. నేరుగా ఏ ఎన్నికల్లో గెలవని సాక్షి గుమాస్తా 7 సార్లు గెలిచిన నన్ను విమర్శించడం హాస్యాస్పదంగా ఉందని చంద్రబాబు నాయుడు ఎద్దేవా చేశారు.
ఆదివాసీలకు అండగా నిలుస్తాం
ఆదివాసీలకు రాజకీయంగా గుర్తింపు తీసుకొస్తాం..అందరూ కలిసికట్టుగా వచ్చే ఎన్నికల్లో టీడీపీని గెలిపించా లని చంద్రబాబునాయుడు విజ్జప్తిచేశారు. టీడీపీ అధి కారంలోకి వస్తేనే ఆదివాసీల సంక్షేమం, రాష్ట్రాభివృద్ది సాధ్యమని అన్నారు. గిరిజనులు భయపడాల్సిన అవసరం లేదు, మీకు తెలుగుదేశం పార్టీ అండగా ఉం టుందని తెలిపారు. రాష్ట్ర పునర్ నిర్మాణం కోసం, భావిత రాల భవిష్యత్‌కోసం తెలుగుదేశంపార్టీ మళ్లీ అధికారం లోకి రావాల్సిన అవసరం ఉందన్నారు. ప్రపంచ ఆదీవాసి దినోత్సవం సంధర్బంగా ప్రతీ గిరిజనుడికి నా శుభా కాంక్షలు. గిరిజన ప్రాంతాల్లో ఏదైనా అభివృద్ధి జరిగిం దంటే అది కేవలం ఒక్క తెలుగుదేశం ప్రభుత్వ హయాం లోనే జరిగింది. కొండ ప్రాంతాల్లోని గిరిజనులను, మైదానా ప్రాంతాల్లోని గిరిజనులను సమన్వయం చేసి చూడాల్సిన భాధ్యత ప్రభుత్వాలది. గిరిజనుల హక్కులను కాపాడేందుకు, ఆ హక్కుల అమలు పట్ల వారిలో నమ్మకం కల్పించేందుకు, వారిలో చైతన్యం తీసుకొచ్చేందుకు ఇలాంటి దినోత్సవాలు జరుపుకుంటున్నామని అన్నారు. టిడిపి అధికారంలో ఉన్నప్పుడు గిరిజనుల కోసం ప్రత్యేక మైన కార్యక్రమాలను ఏర్పాటు చేసి వారిలో చైతన్యం తీసుకొచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ. గిరిజనుల్లో నమ్మకాన్ని, విశ్వాన్ని పెంపొందించడం కోసం రాష్ట్రంలోని నలుమూలల నుంచి గిరిజనులను సమీకరించి అరకు లోయలో ప్రపంచ ఆదివాసీ దినోత్సవం నిర్వహించామని చెప్పారు. గిరిజనుల అభివృద్ది కోసం ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో 14 సూత్రాలతో గిరిజనాభివృద్ధి ప్రణాళిక తయారుచేశారు. ఆ తర్వాతనే గిరిజన ప్రాంతాల్లో అనేక మౌళిక వసతులతో అభివృద్ది పనులు చేపట్టడం జరిగింది. కొండ ప్రాంతాల్లో మొట్ట మొదటి సారిగా పాఠశాలు ప్రవేశపెట్టిన ఏకైక ముఖ్యమంత్రి నందమూరి తారకరామారావు అని కొనియాడారు.
మేం గురుకులాలను ప్రవేశపెడితే
జగన్ రెడ్డి మూసివేయాలని చూస్తున్నారు
గిరిజన విధ్యార్ధులకు మంచి పౌష్టికాహారం ఇచ్చి వారికి మంచి భవిష్యత్తు ఇవ్వాలని తెలుగుదేశం ప్రభుత్వం గిరిజన గురుకులాలలను ప్రవేశపెడితే నేడు జగన్ రెడ్డి వాటిని మూసేస్తున్నాడని చంద్రబాబునాయుడు పేర్కొన్నారు. గిరిజన ప్రాంతాల్లో విధ్యాబోధ చేసేందుకు ఉపాధ్యాయులు లేని రోజుల్లో 10 వ తరగతి పాసైన గిరిజనులకే ఉద్యోగాలిచ్చి వారికి ప్రత్యేక శిక్షణ ఇచ్చి జీవో నం. 3 తో వారికే ఉపాధ్యాయ ఉద్యగాలు ఇచ్చిన నాయకుడు ఎన్టీఆర్. జీవో నం.3 తో ఉపాధి, ఉద్యోగ అవకాశాలు, భూమిపై హక్కులు, అడవి ఆదాయంపై ఆధిపత్యం గిరిజనులకే దక్కాలని ఎన్టీఆర్ ఆదేశించారు. అటువంటి అత్యంత ముఖ్యమైన జీవోను రద్దు చేస్తే గాలి మాటలు చెప్పుకుంటూ తిరిగే జగన్ రెడ్డి కనీసం శాసనసభలో తీర్మానం చేసి పంపలేకపోయాడని దుయ్యబట్టారు. ఈ జీవో రద్దుతో ఏజెన్సీ ప్రాంతాల్లో కూడా మైదాన ప్రాంతం వారు ఆదిపత్యం వహించే పరిస్థితి నెలకొంది. దీనికంతటికీ కారణం వైసీపీ ప్రభుత్వమే. గిరిజనులకు న్యాయం చేయలేని జగన్ రెడ్డి ముఖ్యమంత్రి పదవిలో కొనసాగే అర్హత లేదని అన్నారు.