- పుంగనూరు పుడింగి, పేటిఎం బ్యాచ్‌తో రండి
- పులివెందుల దాకా తరిమికొడతాం
- సిగ్గూ, లజ్జా ఉన్న వ్యక్తి.. అన్నక్యాంటీన్ ధ్వంసం చేయిస్తారా?
- నీ పతనం ప్రారంభమైంది..లెక్కపెట్టుకో!
- చావో, రేవో తేల్చుకోవాలనే వచ్చా.. నీ సంగతేంటో చూస్తా!
- క్లేమోర్ మైన్స్‌కే భయపడలేదు..ఆకురౌడీలు నాకో లెక్కా!
- నీవద్ద ఉన్నది 60వేలమంది పోలీసులు..నాదగ్గర 60లక్షల సైన్యం
- ప్రజల్లో తిరుగుబాటు మొదలైతే ఆపడం పోలీసుల తరంకాదు
- కార్యకర్తపై చెయ్యేస్తే వాడి ఇంటికే వెళ్తా
- చట్టంముందు పోలీసులు కూడా దోషులుగా నిలబడక తప్పదు
- కుప్పంలో అన్నక్యాంటీన్ ధ్వంసంపై నిప్పులు చెరిగిన చంద్రన్న
కుప్పం: తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు కుప్పం పర్యటనను ఏవిధంగానైనా చెడగొట్టాలని వైసిపి పేటిఎం బ్యాచ్ చేసిన ప్రయత్నాలు బూమ్ రాంగ్ అయ్యాయి. కుప్పం బస్టాండువద్ద పేదల కోసం తెలుగుదేశం పార్టీ ఏర్పాటుచేసిన అన్న క్యాంటీన్‌ను ఉదయం 11గంటలకు అన్న క్యాంటీన్ ను చంద్రబాబు ప్రారంభిస్తారనగా, వైసిపి పేటిఎం బ్యాచ్ ఒక్కసారిగా వచ్చి విధ్వంసం సృష్టించింది. ఈ సమయంలో అక్కడే ఉన్న పోలీసులు కనీసం నిలు వరించకపోగా, దగ్గరుండి పని పూర్తిచేయించి అక్కడ నుంచి పంపించేశారు. ఆ తర్వాత ఇవే మూకలు రోడ్లపై వీరంగం చేస్తూ ప్యాలెస్ రోడ్డులో చంద్రబాబు నాయుడు కు స్వాగతం పలుకుతూ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు, బ్యానర్ల ను ధ్వంసం చేశాయి. బస్టాండు సమీపంలో ఉన్న టిడిపి కార్యాలయంలోకి చొచ్చుకెళ్లేందుకు కూడా వైసిపి ముష్క రమూకలు ప్రయత్నించాయి.ఎన్టీఆర్ విగ్రహం వద్ద పలువురు టిడిపి కార్యకర్తలపై వైసిపి మూకలు దాడికి పాల్ప డ్డాయి. పోలీసుల లాఠీఛార్జిలో రాజు అనే టిడిపి కార్యకర్త గాయపడ్డారు. చంద్రబాబు పర్యటన సందర్భంగా బుధ వారం రామకుప్పం మండలం కొల్లుపల్లిలో టిడిపి జెండా లను,ఫ్లెక్సీలను తొలగించి వైసిపిమూకలు కవ్వింపు చర్య లకు పాల్పడ్డాయి. విషయంతెలుసుకున్న పార్టీ అధినేత చంద్రబాబునాయుడులో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. పాదయాత్రగా అన్న క్యాంటీన్ ప్రాంతానికి వేలాది కార్యకర్తలతో బయలుదేరారు. వైసిపి మూకలు అన్న క్యాంటీన్‌ను ధ్వంసంచేసిన ప్రాంతంలోనే నేలపై కూర్చొని ధర్మపోరాట దీక్షకు దిగారు.వైసిపి మూకల దుశ్చర్యపై చంద్రబాబునాయుడు తీవ్రస్థాయిలో విరుచుకు పడ్డారు.
నిప్పులు చెరిగిన చంద్రబాబునాయుడు
వైసిపి మూకల విధ్వంసం తర్వాత చంద్రబాబు నాయుడు పాదయాత్ర చేస్తూ అన్నక్యాంటీన్ ప్రాంతానికి చేరుకున్నారు. స్థానిక కార్యకర్తల ద్వారా వైసిపి మూకలు చేపట్టిన విధ్వంసకాండను తెలుసుకున్న చంద్రబాబు నాయుడు ఆగ్రహంతో ఊగిపోయారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, మంత్రి పెద్దిరెడ్డి, స్థానిక వైసిపి నేతలు, పేటిఎం బ్యాచ్‌పై విరుచుకుపడ్డారు. చిల్లరగాళ్లను పం పడంకాదు జగన్‌రెడ్డీ..నేరుగా నువ్వేరా తేల్చుకుందాం.. పుంగనూరు పుడింగి, పేటిఎం బ్యాచ్ అంతా కలిసిరండంటూ సింహగర్జన చేశారు. ఇటువంటి చిల్లర వేషాలు వేస్తే పులివెందులదాకా తరిమికొడతాం..జాగ్రత్త అంటూ హెచ్చరించారు. నీకు సిగ్గూ, లజ్జా ఉన్నాయా.. పేదలకు అన్నంపెట్టే అన్నక్యాంటీన్ ధ్వంసం చేయిస్తారా? ఈరోజు నుంచే నీపతనం ప్రారంభమైంది.. లెక్కపెట్టుకో.. చావో, రేవో తేల్చుకోవాలనే వచ్చా.. నీ సంగతేంటో చూస్తానంటూ తీవ్రస్వరంతో ఆగ్రహం వ్యక్తంచేశారు. తిరుమలలో 24 క్లేమోర్ మైన్స్‌కే భయ పడలేదు..ఆకురౌడీలు నాకో లెక్కకాదన్నారు. నీవద్ద ఉన్నది 60వేలమంది పోలీసులు..నాదగ్గర 60లక్షల సైన్యం.. ప్రజల్లో తిరుగుబాటు మొదలైతే ఆపడం పోలీసుల తరంకాదని అన్నారు. ఇకపై వైసిపి నాయకుడు ఎవడైనా టిడిపి కార్యకర్తపై చెయ్యేస్తే వాడి ఇంటికే వెళ్తానని తెలిపారు.
కుప్పం చరిత్రలో చీకటిరోజు
ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి రాష్ట్రాన్ని అతలాకుతలం చేయాలనుకుంటున్నారు. అసలు మనం ప్రజాస్వామ్యంలో ఉన్నామా అనే అనుమానం కలుగుతోందని చంద్ర బాబునాయుడు ఆందోళన వ్యక్తంచేశారు. ఇవాళ కుప్పం చరిత్రలో చీకటిరోజు.. నాపైనే దాడులకు దిగుతారా? వైసీపీ అరాచక పాలనలో వీధికో రౌడీ తయారయ్యారు.. కుప్పంలో ఇలాంటి అవాంఛనీయ ఘటనలు ఇదివరకెన్నడూ లేవు. ధర్మపోరాటానికి కుప్పం నుంచే నాంది పలుకుతున్నానని ప్రకటించారు. ప్రజా వ్యతిరేకత తట్టుకోలేకే ఇలాంటి పనులకు పాల్పడుతున్నారని మండి పడ్డారు. నేను బతికున్నంతవరకు కుప్పంను మీరేమీ చేయలేరని అన్నారు. రాష్ట్రంలో నెలకొన్న అరాచకపాలన పై రాబోయే రోజుల్లో రాష్ట్రమంతా ధర్మపోరాటం పేరుతో నిరసనలు చేపడతాం. పోలీసులు అడ్డుకున్నా ముందు కెళ్తామని అన్నారు. జగన్‌రెడ్డి చేతిలో పోలీసులు కీలు బొమ్మలుగా మారారని దుయ్యబట్టారు. గూండాలు, రౌడీ లను అణచివేసిన పార్టీ టీడీపీ.. పోలీసులను అడ్డుపెట్టుకుని రాజకీయం చేస్తారా? పోలీసులు, వైసీపీ గూండాలు కలిసొచ్చినా సమాధానం చెప్తానని అన్నారు. కార్యకర్త రక్తంతో తడిచిన టీడీపీ జెండాను పోలీసులకు చూపిన చంద్రబాబు వారి వైఖరిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. ఇక్కడ పోలీసుల కంటే బ్రిటిష్ వాళ్లు ఎంతో నయం.. మీకు దమ్ముంటే నన్ను అరెస్ట్ చేయండని సవాల్ విసిరారు.వైసిపి మూకలకు సహకరిస్తూ టిడిపివారిపై తప్పుడు కేసులుపెడుతున్న పోలీసులు కూడా చట్టంముందు పోలీసులు కూడా దోషులుగా నిలబడక తప్పదని హెచ్చరిం చారు. సుమారు గంటన్నరపాటు ఆందోళన తర్వాత కుప్పం ఎన్టీఆర్ విగ్రహం వద్ద అన్న క్యాంటీన్‌ను టిడిపి అధినేత చంద్రబాబునాయుడు ప్రారంభించారు. అక్కడకు వచ్చిన అన్నార్తులకు స్వయంగా తానే భోజనం వడ్డించారు. అనంతరం ఎన్టీఆర్ విగ్రహం నుంచి పార్టీ కార్యాలయం వరకు నల్లబ్యాడ్జీ ధరించి చంద్రబాబు పాదయాత్ర చేశారు. వైసీపీ పతనానికి కౌంట్ డౌన్ ప్రారంభమైంది. వచ్చే ఎన్నికల్లో వైసీపీకి వచ్చే స్థానాలు గుండుసున్నా అని చంద్రబాబు నాయడు పేర్కొన్నారు.
టిడిపి కేంద్ర కార్యాలయానికి ఎన్‌ఎస్ జిడిఐజి
గత కొద్దిరోజులుగా రాష్ట్రంలో నెలకొన్న పరిణామాల నేపథ్యంలో చంద్రబాబునాయుడుకు ప్రత్యర్థులు హాని తలపెట్టే అవకాశం ఉందన్న సమాచారంతో ఎన్ ఎస్‌జి డీఐజి గురువారం టిడిపి కేంద్ర కార్యాలయం, తాడేపల్లిలోని నివాసం వద్ద అణువణువూ పరిశీలించారు. పార్టీ ఆఫీసులోని ప్రతి రూమ్‌ను ఎన్‌ఎస్‌జీ బృందం పరిశీలించింది. ఇటీవల చంద్రబాబు పర్యటనల్లో వైకాపా మూకలు తరచూ గొడవలకు దిగుతుండటంతో చంద్రబాబు భద్రతపై ఎన్‌ఎస్‌జీ ప్రత్యేకంగా ఫోకస్ పెట్టింది. రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు,చంద్రబాబు భద్రత, పోలీసుల నిర్లక్ష్యంపై ఆందోళన వ్యక్తం చేస్తూ ఇప్పటికే కేంద్రానికి టీడీపీ ఫిర్యాదులు పంపింది.
టిడిపి నేతలపై తప్పుడు కేసులు
మొగుణ్ణి కొట్టి మొగశాలకెక్కిన చందంగా కుప్పం లో చంద్రబాబు పర్యటనలో గత రెండురోజులుగా విధ్వంసం సృష్టించిన వైసిపినేతలను వదిలి పోలీసులు టిడిపి నేతలు, కార్యకర్తలపై తప్పుడు కేసులు నమోదుచేశారు. మాజీ ఎమ్మెల్సీ గౌరివాని శ్రీనివాసులుతో సహా 8 మంది పై కేసు నమోదయ్యాయి. వైసీపీ కార్యకర్త గణేష్ ఫిర్యాదు మేరకు హత్యాయత్నంతోపాటు 143, 147, 148, 149, 424సెక్షన్ల కింద కేసు నమోదుచేశారు. మరో 11మంది తెలుగుదేశం ముఖ్యనాయకులు, కార్యకర్తలపై ఎస్సీ,ఎస్టీ అట్రాసిటీ కిందకూడా కేసులు నమోదుచేశారు.
నేడు గవర్నర్‌ను కలవనున్న టిడిపి బృందం
రాష్ట్రంలో తాజాగానెలకొన్న పరిణామాలు,క్షీణించిన శాంతిభద్రతలపై టిడిపి రాష్ట్రఅధ్యక్షుడు అచ్చెన్నాయుడు నేతృ త్వంలోని ప్రతినిధి బృందం శుక్రవారం గవర్నర్ బిశ్వ భూషణ్ హరిచందన్‌ను కలిసి వినతిపత్రం సమర్పించా లని నిర్ణయించారు. ప్రతిపక్షనేత చంద్రబాబునాయుడు కుప్పం పర్యటన సందర్భంగా టిడిపి కార్యకర్తలపై రాళ్ల దాడి, కుప్పంలో అన్నక్యాంటీన్ విధ్వంసం, టిడిపి కేడర్‌పై దాడులకు దిగడం, టిడిపి యువనేత లోకేష్ పర్యటన సందర్భంగా శ్రీకాకుళంలో పోలీసులు వ్యవహరించిన ఏకపక్ష వైఖరి, నెల్లూరు జిల్లా కావలిలో దళిత యువకుడు కరుణాకర్‌ను ఆత్మహత్యకు ప్రేరేపించిన ఘటనలపై గవ ర్నర్‌కు ఫిర్యాదుచేయాలని టిడిపినిర్ణయించింది.