- లారీక్లీనర్గా ఉన్న నిన్ను టీడీపీ ఎమ్మెల్యేగా చేసింది
- నీకోసం కాళ్లరిగిగేలా ఇంటింటికీ తిరిగాం
- తెలుగు మహిళలకు ఇచ్చే గౌరవం ఇదేనా?
- గుడివాడలలో నిప్పులు చెరిగిన మహిళానేతలు
- కొడాలి ఇంటి ముట్టడికి యత్నం.. అరెస్టు
- ఆటోల్లో కుక్కి స్టేషన్లకు తరలించిన పోలీసులు
గుడివాడ: ‘‘ నీ కోసం తెలుగుదేశంలో అనేకసార్లు పాదయాత్ర చేశాం.. ఇంటింటికీ కాళ్లరిగేలా తిరి గాం.. సిగ్గుందా కొడాలి నాని నీకు..తెలుగు మహిళలను అసభ్యపదజాలంతో సంభోదిస్తారా? లారీక్లీనర్గా ఉన్న నిన్ను తీసుకొచ్చి చంద్ర బాబు ఎమ్మెల్యేగా గెలిపిస్తే నీకోసం పనిచేసిన మహిళలను అవమానిస్తావా? క్షమాపణలు చెప్పకపోతే రాష్ట వ్యాప్తంగా ఉద్యమిస్తాం’’ తెలుగు మహిళలపై మానవ మృగం కొడాలి నాని చేసిన అనుచితవ్యాఖ్యలపై తీవ్ర ఆగ్రహోద్రులైన తెలుగుమహిళలు మంగళవారం గుడివాడలోని కొడాలి ఇంటిని ముట్టడిరచారు. గుడి వాడలోని టీడీపీ ఆఫీస్ నుంచి ర్యాలీగా బయల్దేరిన తెలుగు మహిళలను కొడాలి నాని ఇంటి సమీపంలో పోలీసులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా తెలుగు మహిళలు, పోలీసుల నడుమ వాగ్వాదం, తోపులాట చోటుచేసుకుంది. తెలుగు మహిళలను పోలీసులు ఈడ్చికెళ్లి ఆటోల్లో కుక్కి గుడివాడ రూరల్, పెదపారు పూడి పోలీస్ స్టేషన్లకు తరలించారు. మహిళలను కించపరిచిన కొడాలి నాని క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. తెలుగు మహిళల అరెస్టుకు నిరసనగా వన్ టౌన్ పీఎస్ ముందు నియోజకవర్గ ఇన్ చార్జి రావి వెంకట్వేశరరావు కార్యకర్తలతో కలసివెళ్లి ధర్నా చేశారు.