- జగన్ రెడ్డి వచ్చాక 3 రెట్లు పెరిగిన మత్తుబానిసల ఆత్మహత్యలు
- దేశంలో ఎక్కడ గంజాయి పట్టుబడినామూలాలు ఎపిలోనే!
- దేశంలోనే గంజాయి రవాణాలో ఎపి.నెం.1
- ఎన్ సిబి తాజా నివేదకకు సిఎం ఏం సమాధానం చెబుతారు?
(చైతన్యరథం ప్రత్యేక ప్రతినిధి – అమరావతి)
ఒకప్పుడు అన్నపూర్ణగా పేరొందిన ఆంధ్రప్రదేశ్‌ను గత 40నెలల్లో జె-గ్యాంగ్ ధనదాహంతో గంజాయి ప్రదేశ్‌గా మార్చేసింది. యావత్ భారత్‌కే గాకుండా విదేశాలకు సైతం బియ్యం ఎగుమతుల్లో అగ్రగామిగా పేరొందిన ఆంధ్రప్రదేశ్ జగన్‌రెడ్డి పాలన పుణ్యమా అని గంజాయికి నిలయంగా మార్చేశారు. గంజాయి అక్రమ రవాణాలో ఏపీ మొదటిస్ధానంలో ఉందని, ఏపీలో దొరికినంత గంజాయి దేశంలో మరే ఇతర రాష్ట్రంలో దొరకలేదని నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్సీబీ) నివేదిక 2021 తాజాగా వెల్లడిరచింది.
టీడీపీ హయాంలో ఈజ్ ఆఫ్ డూయింగ్, ఎన్‌ఆర్ ఈజీఎస్ పనుల్లో ఏపీ నెం 1 స్ధానంలో ఉంటే నేడు గంజాయి అక్రమ రవాణాలో మొదటి స్ధానంలో నిలిచింది. ఎ1 జగన్‌రెడ్డి డైరక్షన్‌లో ఎ2 విజయసాయి రెడ్డి విశాఖ మన్యంలో గంజాయి పంటను కుటీరపరిశ్రమగా మార్చేశారు. దీనికి నర్సీపట్నం ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర గణేష్ లాంటి తొత్తులను పెట్టుకొని విచ్చ లవిడిగా గంజాయిని పొరుగురాష్ట్రాలకు, పొరుగుదేశా ల ఓకు తరలించి వేలకోట్లరూపాయలు పోగేసుకున్నా రు. ఎన్‌సిబి నివేదిక ప్రకారం 2021లో దేశ వ్యాప్తం గా 7,49,761కిలోల గంజాయి పట్టుబడితే అందులో 2,00,588 కిలోలు మన రాష్ట్రంలోనే పట్టుబడిరది. దేశంలో పట్టుబడ్డగంజాయిలో సగం(50శాతం) ఏపీ, ఒడిషా రాష్ట్రాల్లోనే పట్టుబడింది. రాష్ట్రంలో నెలకొన్న ఈ పరిస్థితికి ముఖ్యమంత్రి జగన్‌రెడ్డి, ఆయన ప్రభు త్వం సిగ్గుతో తలదించుకోవాల్సిఉంది. పట్టుబడ్డ గంజా యి కేజీలు 2,00,588కిలోల గంజాయి విలువ 600 కోట్లు. ఇక పట్టుబడకుండా అక్రమ రవాణా జరుగుతున్న గంజాయి విలువ 20రెట్లకు పైగా ఉంది.
గంజాయిపై టిడిపి రాజీలేని పోరు
తెలుగుదేశంపార్టీ గతఏడాది అక్టోబర్ నెలలో యువత జీవితాలను నిర్వీర్యం చేస్తున్న గంజాయిపై పోరుకు పిలుపునిచ్చింది. గంజాయిసాగులో వైసిపి నేతల పాత్రపై ఆధారాలతో సహా టిడిపి బయట పెట్టింది. ఈ పరిణామాలను తట్టుకోలేని వైసిపి రౌడీ మూకలు సంవత్సరం క్రితం గత ఏడాది అక్టోబర్ 19వతేదీన మంగళగిరిలోని తెలుగుదేశంపార్టీ కేంద్ర కార్యాలయంపై దాడికి దిగారు. అయినప్పటికీ ఏ మాత్రం వెనక్కి తగ్గకుండా టిడిపి అధినేత చంద్ర బాబునాయుడు నేతృత్వంలో తెలుగుదేశం పార్టీ శ్రేణులు గంజాయి, మత్తుపదార్థాల వ్యవహారాన్ని డిల్లీ వరకు తీసుకెళ్లారు. దీనిపై సీరియస్ అయిన కేంద్ర దర్యాప్తు సంస్థలు రంగంలోకి దిగడంతో తమ బండారం బయటపడుతుందని భయపడిన వైసిపి ప్రభుత్వం తూర్పుగోదావరి, విశాఖ ఏజన్సీలో ఎస్‌ఇబి దాడులు నిర్వహించి పదోవంతు లోపు పంటను ధ్వంసం చేసి పెద్దఎత్తున పత్రికల్లో ఫోటోలు వేసుకుని జనాన్ని నమ్మించే ప్రయత్నం చేశారు. అయితే రోజుకూ వేల టన్నుల్లో గంజాయి రాష్ట్రం నుంచి రవాణా జరుగుతంటే కేవలం 1775 కేసులు మాత్రమే నమోదయ్యాయంటే గంజాయి మాఫియాకు వైసీపీ పెద్దలు ఏ విధంగా సహకరిస్తున్నారో స్పష్టమవుతోంది.
ఎపిని మాదకద్రవ్యాలకు అడ్డాగా మార్చి జె-గ్యాంగ్
జగన్ రెడ్ది నేతృత్వంలో వైసీపీ నేతలు తన అక్రమ సంపాదన కోసం రాష్ట్రంలో గంజాయి, డ్రగ్స్ మాఫియాలను పెంచిపోషిస్తూ యువశక్తిని నిర్వీర్యం చేయడానికి సైతం వెనకాడలేదు. గత ఏడాది సెప్టెంబర్‌లో గుజరాత్ లోని ముంద్రా పోర్టులో పట్టుబడిన 21వేల కోట్లరూపాయల హెరాయిన్ మూలాలు ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడలో ఆషీట్రేడింగ్ కంపెనీ పేరుతో ఉండటం గమనార్హం. రాష్ట్రంలో డ్రగ్స్ వినియోగానికి ప్రధానకారణం నిరుద్యోగ సమస్య. ఉద్యోగం, ఉపాధి లేని నిరుద్యోగులు భవిష్యత్ పై నిరాశ, నిస్ప్ర హలకు లోనై మత్తు పధార్ధాలకు బానిసలై ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు.
3రెట్లు పెరిగిన మత్తుబానిసల ఆత్మహత్యలు
తాజాగా విడుదలైన ఎన్‌సిఆర్‌బి నివేదికవిస్మయం గొలిపే పచ్చినిజాలు బయల్పడ్డాయి. 2018లో మత్తు పదార్థాల కారణంగా 196మంది చనిపోతే ఈ సంఖ్య జగన్మోహన్‌రెడ్డి అధికారంలోకి వచ్చాక దాదాపు మూడురెట్లు పెరిగింది. 2020లో 385మంది యువత మాదకద్రవ్యాల కారణంగా మృతిచెందగా, 2021లో 571మంది ఆత్మహత్యలు చేసుకున్నట్లు ఎన్సీఆర్బీ నివే దిక వెల్లడిరచింది. దీనికి ముఖ్యమంత్రి జగన్‌రెడ్డి అం డ్ కో ఏమనిసమాధానం చెబుతారు?వైసీపీ అధికారం లోకివచ్చాక ఏపీ గంజాయిడెన్‌గా మారిందన్నది వాస్త వం. విశాఖ,తూ.గో ఏజెన్సీ ఏరియాల్లో విజయసాయి రెడ్డి, స్ధానిక వైసీపీ నేతల ఆధ్వర్యంలో సుమారు 25 వేల ఎకరాల్లో గంజాయి సాగవుతోంది. టీడీపీ హయాంలో ఉత్తరాంధ్రను పారిశ్రామిక హబ్‌గా అభివృద్దిచేస్తే నేడు గంజాయి డెన్‌గా అభివృద్ది చేశారు.
ఎపి నుంచి 14రాష్ట్రాలకు గంజాయి సరఫరా
మన రాష్ట్రం నుంచే దేశం మొత్తానికి గంజాయి సరఫరా అవుతోందని సరిహద్దు రాష్ట్రాలు ఇప్పటికే పలు సందర్భాల్లో స్పష్టంచేశాయి. దేశంలోని 14 రాష్ట్రాలకు ఎపి నుంచే గంజాయి సరఫరా అవుతోంది. ఉత్తర ప్రదేశ్, ఢిల్లీ, పంజాబ్, బెంగళూరు, కేరళ సహా పలు ప్రాంతాల్లో పట్టుబడిన గంజాయి మూలాలు ఏపీనే ఉన్నట్లు అక్కడి పోలీసులు గుర్తించారు. చివరకు విశాఖ ఏజన్సీలో గంజాయి మాఫియా ఎంతగా బరితెగించిందంటే ఏకంగా అమెజాన్ ద్వారా డోర్ డెలివరీ చేసేస్థాయికి చేరింది. ఒక్క గంజాయే కాదు, ? హెరాయిన్, కొకైన్, గంజాయి వంటి భయంకర మత్తు పదార్ధాల మాఫియాలు కూడా జగన్మోహన్ రెడ్డి ఏలుబడిలో రాష్ట్రంలో విచ్చలవిడిగా చెలరేగిపోతున్నాయి. కొద్దిరోజుల క్రితం బెంగుళూరులో కస్టమ్స్ అధికారులు ఓ పార్సిల్ ను పరిశీలించగా 4.49 కిలోల ఎఫిడ్రిన్ అనే మత్తు పధార్దం దొరికింది. ఇది విజయవాడ భారతీ నగర్ లోని కొరియర్ సంస్ధ నుంచి ఆస్ట్రేలియాకు వెళ్తున్నట్టు గుర్తించారు. ప్రతి రోజు ఎక్కడో చోట ఇతర రాష్ట్రాల్లో, విధేశాల్లో పట్టుబడ్డ గంజాయి ఏపీ నుంచే వెళ్తున్నట్టు అక్కడి పోలీసు అధికారులు చెబుతున్నారు. టీడీపీ హయాంలో రాష్ట్రంలో గంజాయిపై ఉక్కుపాదం మోపగా..నేడు రాష్ట్రాన్ని గంజాయి, డ్రగ్స్, నకిలీ మద్యం మాఫియాలకు అడ్డాగా మార్చి ప్రజలజీవితాలతో చెలగాటమాడుతున్నారు. విజ్జులైన ఆంధ్రప్రదేశ్ లోని యువత ముఖ్యమంత్రి ధనదాహంతో పెంచిపోషిస్తున్న మత్తుపదార్ధాల మాఫియాపై చైతన్యవంతులు కావాల్సిన అవసరం ఎంతైనా ఉంది.