అమరావతి : నంది గామలో టిడిపి అధినేత చంద్రబాబునాయుడు ప్రచార రథంపై వైసిపి మూకలు రాళ్లు రువ్వడంపై టిడిపి ప్రతినిధి బృందం సోమవారం గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్‌తో భేటీ అయింది. చంద్రబాబు ప్రచార రథంపై దాడి ఘటనకు సంబంధించిన వివరాలు, పలు ఆదారాలతో టిడిపి నేతలు గవర్నర్‌కు ఫిర్యాదు చేశారు. ఈ విషయమై ఇప్పటికే నందిగామ పీఎస్‌లో ఫిర్యాదు చేసిన చంద్రబాబు సీఎస్‌వో మధు, మాజీ ఎమ్మెల్యే సౌమ్య ఫిర్యాదు చేశారని తెలిపారు. పలువురు అనుమానితుల ఫొటోలతో సహాముఖ్య మైన సాక్ష్యా ధారాలతో టీడీపీ నేతల ఫిర్యాదు గవర్నర్‌కు అందించారు.
రక్తగాయాలైతే 324 సెక్షన్ పెడతారా: వర్ల రామయ్య
గవర్నర్‌ను కలసిన అనంతరం రాజ్‌భవన్ వెలుపల టిడిపిపొలిట్‌బ్యూరో సభ్యుడు వర్ల రామ య్య విలేకరులతో మాట్లాడుతూ.. పోలీసుల నిర్ల క్ష్యం వల్లే వైసిపి మూకలు చంద్రబాబుపై దాడికి యత్నించాయని తెలిపారు. సెక్యూరిటీ సిబ్బందికి గా యమై రక్తం కారుతుంటే పోలీసులు 324సెక్షన్ కింద కేసుపెట్టడం హాస్యాస్పదంగా ఉందన్నారు. విశాఖలో మంత్రి కారుకు దెబ్బతగిలితే హత్యాయత్నం కేసుపె ట్టారు. నందిగామలో ప్రతిపక్షనేత సిఎస్‌ఓకు రక్తం కారినాబెయిలబుల్ సెక్షన్‌పెట్టడం దుర్మార్గంకాదా అని ప్రశ్నించారు.ఘటనపై గవర్నర్ కూడా విచారం వ్యక్తం చేశారని,ముద్దాయిలకు సాయం చేయాలనే పోలీసులు ప్రయత్నిస్తున్నారని వర్ల రామయ్య ఆరోపించారు.
అసాంఘిక శక్తులను పోలీసులే ప్రోత్సహించారు: బోండా ఉమ
అసాంఘిక శక్తులు, రౌడీషీటర్లను దగ్గరుండి పోలీ సులే ప్రోత్సహించారని మరో టిడిపి సీనియర్ నేత బోండా ఉమా ఆరోపించారు.మాజీ సీఎంపై దాడి జరి గితే ఫైన్ విధించి బెయిల్‌పై బయటికి వచ్చే కేసులు పెడతారా అని ప్రశ్నించారు. పోలీసులు నమోదు చేసి న కేసులపై గవర్నర్ సైతం ఆశ్చర్యం వ్యక్తం చేశారు. రాజకీయ కక్ష సాధింపు కోసం పోలీసులను అడ్డు పెట్టుకుంటున్న తీరుపై ఫిర్యాదు చేశామని చెప్పారు. వైసీపీ రాజకీయ కక్షలకు పోలీసు యంత్రాంగాన్ని వాడుకుంటోందని అన్నారు.ప్రతిపక్ష నేతపై దాడి జరిగితే పెట్టీకేసుపెట్టారు. పోలీసు వ్యవస్థను ఇం తగా దుర్వినియోగంచేసే ప్రభుత్వాలను ఎప్పుడూ చూడలే దని అన్నారు. డీజీపీతో మాట్లాడి చర్యలు తీసుకుంటామని గవర్నర్ చెప్పినట్లు ఆయన పే ర్కొన్నారు. గవర్నర్ కలిసిన వారిలో ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్,ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడు, విజయ వాడ పార్లమెంటు అధ్యక్షుడు నెట్టెం రఘు రామ్, శ్రీరామ్ రాజగోపాల్ తాతయ్య, తంగిరాల సౌమ్య తదితరులు ఉన్నారు.