- గెట్ సెట్ గో ఫ్లయిట్ల ద్వారానే డిల్లీకి దొంగడబ్బు
- ఎ1, ఎ2 పర్యటనలకు ఆ సంస్థ ద్వారానే విమానాలు
- ఎవరెవరు ప్రయాణించారో వివరాలు కోరి ఈడి
- తాజా పరిణామాలతో తాడేపల్లి ప్యాలెస్ లో కలవరం
- నీ నిర్వాకం వల్లే ఇదంతా అంటూ ఎ2పై ఎ1 నిప్పులున్యూడిల్లీ : డిల్లీ లిక్కర్ కుంభకోణంలో అసలు దొంగలైన ఎ1,ఎ2ల పాత్ర ఒక్కొక్కటిగా బయటకు వస్తోంది. లిక్కర్ స్కామ్‌లో సూత్రధారిగా ఉన్న శరత్ చంద్రారెడ్డి రెండో భార్య కనేకా రెడ్డికి చెందిన జెట్ సెట్ గో ఎయిర్ లైన్స్ ద్వారా భారీఎత్తున నగదు డిల్లీతోపాటు దేశంలోని ఇతర ప్రాంతాలకు తరలించి నట్లు ఈడికి ఆధారాలు లభించాయి. ఎ1 జగన్, ఎ2 విజయ సాయిరెడ్డిలు తమ పర్యటనల కోసం జెట్ సెట్‌గో కు చెందిన చార్టర్డ్ ఫ్లయిట్‌లనే వినియోగిస్తూ వస్తున్నారు. కనేకారెడ్డికి చెందిన జెట్ సెట్ గో విమానాల్లోనే రాజ కీయ ప్రముఖులు ప్రయాణించినట్లు వారికి కీలక మైన సమాచారం లభించింది. ఇంకేముంది… దాదా పు డిల్లీ లిక్కర్ స్కామ్ వెనుక ఎవరున్నారో దాదాపు తేలిపోయింది.పూర్తి సమాచారం అందిన వెంటనే ఢల్లీి లిక్కర్ స్కామ్‌లో త్వరలోనే సంచలనాలు వెలుగులోకి రానున్నాయి. ఇప్పటికే దర్యాప్తు సంస్థల వద్ద అత్యంత కీలక ఆధారాలు ఉన్నాయి. అతి త్వరలోనే ఎపికి చెందిన ప్రముఖుల అరెస్టులు తథ్యమనే టాక్ డిల్లీలో మారుమోగుతోంది. బేగంపేట ఎయిర్ పోర్టులో స్క్రీనింగ్ లేకపోవడం, ప్రైవేట్ సెక్యూరిటీ ఏజెన్సీ చేతిలో ఎయిర్ పోర్ట్ ఉండడంతో నేరుగా రన్ వే పైకి విఐపిల ముసుగులో వాహనాల్లో భారీగా నగదును తరలించినట్లు విశ్వసనీయ సమాచారం. డిల్లీ లిక్కర్ స్కామ్‌కు సంబంధించి తాజా పరిణామాలతో తాడేపల్లి ప్యాలెస్‌లో కలకలం చెలరేగింది. విశ్వస నీయ సమాచారం ప్రకారం వ్యవహారం టివిల్లో వచ్చిన వెంటనే సిఎం జగన్ రెడ్డి ఎ2 కి ఫోన్ చేసి నిప్పులు చెరిగినట్లు సమాచారం. రెండోకంటికి తెలియకుండా, మనచేతికి మట్టి అంటకుండా గోప్యంగా చేయాల్సిన వ్యవహారంలో నేరుగా తలదూర్చి పీకల్లోతున ఇరికించేశావ్, ఈడి కఠిన నిర్ణయాలు తీసుకుంటే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించినట్లు విశ్వసనీయ సమాచారం.
ఎవరీ కనేకా టేక్రివాల్?
మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌కు చెందిన కనేకా టేక్రివాల్‌ను ఎ2 విజయసాయిరెడ్డి అల్లుడు సోదరుడు శరత్ చంద్రారెడ్డి శరత్‌చంద్రారెడ్డి ఈ ఏడాది జులైలో రెండో వివాహం చేసుకున్నారు. అప్పటినుంచి ఆమె తమపేరును సైతం కనేకారెడ్డిగా మార్చుకుంది. ఈమె నడుపుతున్న జెట్ సెట్ గో రాకపోకలు, అందులో ప్రయాణిస్తున్న వ్యక్తులపై అనుమానం రావడంతో ఎన్ ఫోర్స్ మెంట్ డైరక్టర్ ఎయిర్ పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాకు(ఎఎఐ)కి లేఖ రాసింది. దీంతో బేగంపేట ఎయిర్ పోర్టుకు ప్రైవేటు జెట్ ల రాకపోకలను సైతం నిలిపివేశారు. తీగలాగితే డొంక కదిలింది. ఎ2 విజయసాయిరెడ్డి ప్రైవేటు పర్యటనలతోపాటు ఎ1 జగన్ విదేశీ పర్యటనలకు సైతం జెట్ సెట్ గో సంస్థ ప్రత్యేక విమానాలను సమకూర్చింది. ఇండియా పసిఫిక్ యావియేషన్ అనే సంస్థను కనేకా రెడ్డి టేకోవర్ చేసి జెట్ సెట్ గో పేరుమార్చారు. ఈమె సంస్థ ద్వారా సమకూర్చిన దేశంలోని ఇతర ప్రముఖ జెట్ సంస్థలకంటే అధికమొత్తంలో అద్దెలు చెల్లించారు. జెట్ సెట్ గో హైర్ చేసిన చార్టర్డ్ ఫ్లయిట్ల ద్వారా డిల్లీ, ఇతర ప్రాంతాలకు హవాలా డబ్బు సరఫరా చేసినట్లు సమాచారం. ఇందులో ప్రయాణించిన రాజకీయ ప్రముఖులు, లిక్కర్ స్కామ్ లో వారి పాత్రపై నిగ్గుతేల్చే పనిలో ఈడి అధికారులు నిమగ్నమయ్యారు.
రాకపోకల సమాచారమివ్వాలని ఈడి అధికారుల లేఖ
డిల్లీ లిక్కర్ కుంభకోణం వెనుక ఎ1, ఎ2లే కీలక పాత్ర వహించారని కొద్దిరోజుల క్రితం ‘చైతన్య రథం’ ప్రత్యేక కథనాన్ని ప్రచురించిన విషయం విది తమే.చైతన్యరథంలో కథనం ప్రచురితమయ్యాక ఎ2 విజయసాయిరెడ్డి కలుగులోనుంచి బయటకు వచ్చి తన స్వరాన్ని పెంచినపుడే మా అనుమానం మరింత బలపడిరది. చివరకు అదే నిజమైంది. గతనెల 17వ తేదీన ఎయిర్‌పోర్టు అథారిటీ చైర్మన్‌కు ఈడి డిప్యూ టీ డైరక్టర్ రాబిన్ గుప్తా రాసిన లేఖ తాజాగా వెలు గులోకి వచ్చింది. డిల్లీ లిక్కర్ స్కామ్‌లో అరెస్టయిన శరత్ చంద్రారెడ్డి భార్య భార్య కనికా టేక్రివాల్ అలి యాస్ కనేకారెడ్డి నడుపుతున్న జెట్‌సెట్ గో విమాన యాన సంస్థ వివరాలు, ప్రత్యేక సర్వీసుల రాకపోక లపై వివరాలు ఇవ్వాలని ఎయిర్ పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాకు ఈడి లేఖ రాసింది. కనికా సిఇఓగా నిర్వహిస్తున్న జెట్ సెట్ గో సంస్థ ఏర్పాటైనప్పటినుంచి లేఖ రాసిన తేదీ వరకు నడిపిన అన్ని చార్టర్డ్ విమా నాల వివరాలు, ఆ ప్రత్యేక విమానాల్లో ప్రయాణిం చిన వారి వివరాలు, విమాన మేనేజర్ల జాబితా అం దించాలని ఈడి లేఖలో పేర్కొంది. తాము అడిగిన సమాచారానికి సంబంధించిన అన్నిరకాల డాక్యు మెంట్లు పంపాలని స్పష్టం చేసింది. పిఎంఎల్ ఎ (PREVENTION OF MONEY LAUNDERING ACT — 2002) చట్టం ప్రకారం జరుగుతున్న విచారణలో భాగంగా ఈ వివరాలు కోరుతున్నట్లు ఈడి డిప్యూటీ డైరక్టర్ లేఖలో పేర్కొన్నారు.