టిడిపి అధికారంలోకి రాగానే చేనేత ఉత్పత్తులకు మార్కెటింగ్ సౌకర్యం కల్పిస్తామని తెలుగుదేశంపార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ హామీ ఇచ్చారు. యువగళం పాదయాత్రలో భాగంగా మంగళవారం తాడిపత్రి నియోజకవర్గంలో జాతీయ చేనేత ఐక్యవేదిక ప్రతినిధులు లోకేష్ ను కలిసి వారి సమస్యలు విన్నవించారు. వారి సమస్యలపై లోకేష్ సానుకూలంగా స్పందించారు. జగన్మోహనరెడ్డి అధికారంలోకి వచ్చిన నాటినుంచి చేనేత రంగం తీవ్రమైన సంక్షోభంలో వుందని లోకేష్ ఆరోపించారు.
కేవలం ధర్మవరంలో నే 55 మంది చేనేత కార్మికులు ఆత్మహత్యలు చేసుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. టిడిపి అధికారంలోకి రాగానే ఆత్మహత్య లు చేసుకున్న చేనేత కుటుంబాలను ఆదుకుంటామని హామీ ఇచ్చారు. చేనేతలు 200 యూనిట్ లు, మరమగ్గాల కు 500 యూనిట్ లు విద్యుత్ ను ఉచితంగా అందిస్తామని చెప్పారు. టిడిపి హయాంలో చేనేతలు ముడిసరుకు, రసాయనాలను ధరలు తగ్గించి ఆదుకున్నామని తెలిపారు. చేనేతలు రాజకీయంగా అవకాశాలు కల్పిస్తామని లోకేష్ హామీ ఇచ్చారు.