తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ను యువగళం పాదయాత్ర సందర్భంగా శుక్రవారం డోన్ నియోజకవర్గంలో విఆర్ఎ సంఘం ప్రతినిధులు కలిసి సమస్యలు విన్నవించారు. రాష్ట్రవ్యాప్తంగా 25వేలమంది విఆర్ఎలు రెవిన్యూ శాఖలో దశాబ్ధాలుగా సేవలందిస్తున్నాం. సుదీర్ఘకాలంగా పనిచేస్తున్నా మాకు పేస్కేలు అమలుచేయడం లేదు. విఆర్ఎలకు కనీస వేతనంగా రూ.26వేలు ఇవ్వాలి.
నామినీలు గా పనిచేస్తున్న వారిని విఆర్ఎలుగా నియమించాలి అని వారు విజ్ఞప్తి చేశారు. వారి సమస్యలపై లోకేష్ సానుకూలంగా స్పందిస్తూ రాష్ట్రంలో అన్నిరకాల ఉద్యోగులను జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఇబ్బందుల పాల్జేస్తోంది. ప్రభుత్వానికి, ప్రజలకు వారధులుగా పనిచేస్తూ సేవలందిస్తున్న విఆర్ఎ ల న్యాయమైన డిమాండ్లకు టిడిపి మద్దతు ఇస్తుంది. టిడిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక విఆర్ఎల న్యాయమైన డిమాండ్లను పరిష్కరిస్తాం అని హామీ ఇచ్చారు.