భీమవరం పట్టణంలో రంజాన్ పండుగ పర్వదినాన్ని పురస్కరించుకొని టిడిపి జిల్లా అధ్యక్షురాలు తోట సీతారామలక్ష్మి ముస్లింలకు రంజాన్ తోఫా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ముస్లిం సోదర సోదరీమణులు పండుగ వేడుకలను కుటుంబంతో సంతోషంగా జరుపుకోవాలని సూచించారు. అలాగే వైసిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ముస్లింలకు రంజాన్ తోఫా నిలిపివేసిందన్నారు.