టిడిపి అధికారంలోకి వచ్చాక సాగు, తాగు నీటి ప్రాజెక్టులను యుద్ధప్రాతిపదికన పూర్తిచేస్తామని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ వెల్లడించారు.
యువగళం పాదయాత్ర సందర్భంగా గురువారం చిన్నకొట్టాల గ్రామస్తులు నారా లోకేష్ ను కలిసి తమ సమస్యలు వినంవించారు.
మా గ్రామంలో 1500మంది జనాభా ఉన్నారు. తాగు, సాగు నీటి సమస్య అత్యధికంగా ఉంది.
మా గ్రామంలోని చెరువు నిండితే తప్ప మాకు నీరు దొరికే పరిస్థితి లేదు.
వేసవిలో వాటర్ ట్యాంకర్ తో నీళ్లు కొనుక్కునే దుస్థితి నెలకొంది.
మా గ్రామంలోని చిన్నతిప్పరాయని రిజర్వాయర్ నిర్మిస్తే ఉపయోగంగా ఉంటుంది.
రిజర్వాయర్ నిర్మాణం వల్ల మా గ్రామంతో పాటు చుట్టుపక్కల 5 గ్రామాల సమస్య తీరుతుంది.
మీరు అధికారంలోకి వచ్చాక మాకు నీటి సమస్యకు పరిష్కారం చూపాలి అనివ్ ఆరు విజ్ఞప్తి చేశారు.
వారి సమస్యలపై లోకేష్ సానుకూలంగా స్పందించారు.
జగన్మోహన్ రెడ్డి అసమర్థ పాలనలో రాయలసీమ ప్రజలకు గుక్కెడు నీరు దొరకడం కష్టతరంగా మారింది.
ఒక్క ఛాన్స్ ఇస్తే సమస్యలు తీరుతాయని ఆశపడిన ప్రజలకు మరిన్ని సమస్యలు పెరిగాయి.
టిడిపి అధికారంలోకి వచ్చాక వాటర్ గ్రిడ్ ఏర్పాటు ద్వారా ఇంటింటికీ తాగునీటి కుళాయి అందజేస్తాం.
రాయలసీమలో ప్రాజెక్టులు పూర్తిచేసి సాగు, తాగునీటికి శాశ్వత పరిష్కారం చూపిస్తాం అని లోకేష్ వారికి హామీ ఇచ్చారు.