మహానాడు కమిటీలో మాజీమంత్రి ప్రత్తిపాటికి స్థానం ఈ నెల 27, 28, 29 తేదీలలో రాజమండ్రిలో జరగనున్న టీడీపీ మహానాడుకు పార్టీ అధిష్టానం 15 కమిటీలను నియమించింది. సభ, ప్రాంగణ కమిటీలో మాజీ మంత్రి, టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు ప్రత్తిపాటి పుల్లారావుకు కమిటీలో స్థానం కల్పించి బాధ్యతలు అప్పగించారు. ఈ శుక్రవారం సందర్భంగా ప్రత్తిపాటి పుల్లారావు మాట్లాడుతూ, తనకు అప్పగించిన బాధ్యతను సమర్థవంతంగా నిర్వర్తిస్తానని ప్రత్తిపాటి పేర్కొన్నారు.