రైతుల ఆత్మహత్యల్లో ఏపి దేశంలోనే నంబర్ 3 లో ఉంది. కౌలు రైతుల ఆత్మహత్యల్లో నంబర్ 2 లో ఉంది.
జగన్ పాలనలో భూసార పరీక్షా కేంద్రాలకు కరెంట్ బిల్లులు కట్టక మూతపడ్డాయి.
జగన్ పాలనలో రైతు రథాలు లేవు, డ్రిప్ ఇరిగేషన్ లేదు, గిట్టుబాటు ధర లేదు.
నెల్లూరు కి చెందిన వ్యక్తి వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్నారు.
ఆయన కోర్టు దొంగ. ఆయన జైలుకి పోవడం ఖాయం.
అకాల వర్షాలతో రైతులు నష్టపోతే కనీసం పంట నష్టం అంచనా వేసే దిక్కు లేదు.
ప్రతి నియోజకవర్గం లో ఏడాదికి 500 బోర్లు వేస్తాం అని జగన్ హామీ ఇచ్చాడు. ఒక్క బోరు కూడా వెయ్యడం లేదు.
రైతు భరోసా కింద రూ.12,500 ఇస్తామని చెప్పి రూ. 7,500 ఇచ్చి చేతులు దులుపుకున్నారు జగన్.
డ్రిప్ ఇరిగేషన్ ఎత్తేసి మెట్ట ప్రాంతం రైతుల్ని దెబ్బతీశాడు జగన్.
జగన్ వచ్చిన తరువాత రైతులు లేని రాజ్యం గా మారిపోతుంది.
జగన్ చేతిలో ఎక్కువ నష్టపోయింది రైతులే.
జగన్ పాలనలో పాడి రైతులు కూడా తీవ్రంగా నష్టపోయారు.
టిడిపి హయాంలో గొర్రెల పెంపకం, పాడి పరిశ్రమ రైతులకి అనేక ప్రోత్సాహకాలు ఇచ్చాం. సబ్సిడీలో పశువులు, దాణా, మందులు, మేత అందించాం.
జగన్ ప్రభుత్వం పాడి పరిశ్రమ కు ఇచ్చే అన్ని సంక్షేమ కార్యక్రమాలను ఆపేసాడు.
రైతుల్ని ఆదుకోకపోగా మోటార్ల కు మీటర్లు పెడుతున్నాడు. గ్యాస్ సబ్సిడీ ఎత్తేసినట్టే ఉచిత విద్యుత్ కూడా జగన్ ఎత్తేసాడు. రైతులు మీటర్లు పగలగొట్టండి. మీకు అండగా టిడిపి ఉంటుంది.
జగన్ పాలనలో విత్తనం, ఎరువులు, పురుగుల మందుల రేట్లు విపరీతంగా పెరిగిపోయాయి
జగన్ పాలనలో వ్యవసాయం చెయ్యలేని పరిస్థితి వచ్చింది.
నిమ్మ రైతుల కష్టాలు నాకు తెలుసు. రీసెర్చ్ సెంటర్ ఏర్పాటు చేస్తాం. మెరుగైన రకాల మొక్కలు తీసుకొస్తాం.
ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటు చేసి మార్కెట్ తో లింక్ చేసి మంచి రేటు వచ్చేలా చేస్తాం.
టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే పంటకు జబ్బులు వచ్చినప్పుడు ఏ మందు కొట్టాలో ప్రభుత్వమే చెప్పి అవగాహన సద్దస్సు లు నిర్వహిస్తాం.
టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే 90 శాతం సబ్సిడీ తో డ్రిప్ అందజేస్తాం.
ఎస్సీ, ఎస్టీలకు అయితే 100 శాతం సబ్సిడీ తో డ్రిప్ అందజేస్తాం.
కల్తీ విత్తనాలు, ఎరువులు, పురుగుల మందులు సరఫరా చేస్తుంది వైసిపి నాయకులే.
టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే కల్తీ విత్తనాలు, ఎరువులు, పురుగుల మందులు సరఫరా చేసే వారి పై చర్యలు తీసుకుంటాం.
టిడిపి అధికారంలో ఉన్నప్పుడు కోపరేటివ్ జాయింట్ ఫార్మింగ్ సొసైటీ ఆధ్వర్యంలో ఉన్న 70 వేల ఎకరాలు బడుగు, బలహీన వర్గాల ప్రజలకు పూర్తి హక్కులు కల్పిస్తూ పట్టాలు ఇచ్చాం.
చుక్కల భూముల పేరుతో వైసిపి ప్రభుత్వం డ్రామా చేస్తుంది. వైసిపి ప్రజాప్రతినిధులు వద్ద ఉండే అనుచరులకు తప్ప చుక్కల భూముల పట్టాలు ఎవరికీ ఇవ్వడం లేదు.
టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే కోల్డ్ స్టోరేజ్లు ఏర్పాటు చేస్తాం.
మామిడి రీసెర్చ్ సెంటర్ ఏర్పాటు చేసి ఎగుమతి కి కావాల్సిన రకాలు ఇక్కడ పెంచే విధంగా ప్రోత్సహిస్తాం.
పల్పింగ్ యూనిట్లు, ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటు చేస్తాం.
అసైన్డ్ భూముల సమస్యలు పరిష్కారం కోసం కొన్ని రాష్ట్రాలు అమలు చేస్తున్న నిబంధనలు పాటించాలని నిర్ణయం తీసుకున్నాం.
సోమశిల హై లెవల్ కెనాల్ టిడిపి అధికారంలోకి వచ్చిన తర్వాత యుద్ద ప్రాతిపదికన పూర్తి చేస్తాం.
తోపుగుంట, కండాపురం, చౌటుపల్లి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్లను టిడిపి వచ్చిన వెంటనే పూర్తి చేస్తాం.
ఆల్తూరుపాడు రిజర్వాయర్ పనులు టిడిపి అధికారంలోకి వచ్చిన తర్వాత పూర్తి చేస్తాం.
టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే పెట్టుబడి వ్యయం తగ్గించేలా చర్యలు తీసుకుంటాం. గిట్టుబాటు ధర కల్పిస్తాం.
హార్టి కల్చర్ ని ఉపాధి హామీకి అనుసంధానం చేసి ఆదుకుంటాం.
వెంకటగిరి నియోజకవర్గం రైతులకు సాగు నీరు అందించే బ్యాలెన్సింగ్ రిజర్వాయర్లను టిడిపి అధికారంలోకి వచ్చిన తర్వాత పూర్తి చేస్తాం.
జగన్ పాలనలో వరి రైతులు తీవ్రంగా నష్టపోయారు. నెల్లూరు జిల్లా లో వరి కొనుగోళ్ల లో భారీ స్కాం కి పాల్పడ్డారు. కొన్న ధాన్యానికి డబ్బులు వెయ్యడం లేదు.
పెట్రోల్, డీజిల్ ధరల్లో జగన్ ఏపిని నంబర్ 1 చేశాడు. టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే పెట్రోల్, డీజిల్ పై పన్ను తగ్గిస్తాం.
టిడిపి అధికారంలోకి వచ్చిన తర్వాత జీరో బడ్జెట్ న్యాచురల్ ఫార్మింగ్ ని పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తాం.
టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే చంద్రన్న భీమా పథకాన్ని తిరిగి ప్రారంభిస్తాం.
అమెరికా, యూకే లాంటి దేశాల్లో కూడా రైతులకు సబ్సిడీలు ఇస్తారు. కేవలం 7,500 ఇవ్వడానికే వ్యవసాయ ని జగన్ పరిమితం చేసాడు. ఉన్న అన్ని సంక్షేమ కార్యక్రమాలు రద్దు చేసాడు.
ఏ పంట వెయ్యాలో చెప్పడం దగ్గర నుండి గిట్టుబాటు కల్పించే వరకూ ప్రభుత్వం రైతులకి అండగా నిలబడిన రోజే రైతు నిలబడతాడు.
రైతు లేనిదే దేశం లేదు. రైతుకి అండగా నిలబడటం నా బాధ్యత.