• వెంకటగిరి నియోజకవర్గం హస్తకావేరి గ్రామస్తులు యువనేత లోకేష్ ను కలిసి వినతిపత్రం సమర్పించారు.
• మా గ్రామ దళితవాడలో సీసీరోడ్లు కొన్ని పెండింగ్ ఉన్నాయి, వాటిని పూర్తిచేయాలి.
• మా గ్రామంలో తెలుగుగంగ కాలువకు రూ.1కోటి మంజూరు చేశారు, కానీ వైసీపీ ప్రభుత్వం రద్దు చేసింది.
• మా గ్రామంలో దళితవాడ, అరుంధతివాడ, ఎన్.ఎల్.కండ్రిగలకు ఓవర్ హెడ్ ట్యాంకులను నిర్మించాలి.
• ఎన్.ఎల్.కండ్రిగలో నిమ్మతోటలకు వెళ్లే దారి చెరువుకట్టమీద వేస్తే ఉపయోగకరంగా ఉంటుంది.
• హస్తకావేరిలో పొలాలకు వెళ్లడానికి సరైన రహదారులు వేయించాలి.
• రైతులు సాగుచేస్తున్న పొలాలను ఫారెస్ట్ ఆఫీసర్లు అడ్డుకుంటున్నారు, సమస్యను పరిష్కరించాలి.
నారా లోకేష్ స్పందిస్తూ…
• జగన్మోహన్ రెడ్డికి దోచుకోవడం, దాచుకోవడంపై తప్ప ప్రజాసమస్యలపై శ్రద్ధలేదు.
• గ్రామాల్లో కనీసం బ్లీచింగ్ పౌడర్ చల్లడానికి కూడా నిధులు లేకుండా చేసి దివాలా తీయించారు.
• మేం అధికారంలోకి వచ్చాక హస్తకావేరి గ్రామంలో పెండింగ్ పనులన్నీ పునఃప్రారంభిస్తాం.
• అవసరమైన ఓవర్ హెడ్ ట్యాంకును నిర్మిస్తాం, ఇంటింటికీ తాగునీటి కుళాయి ద్వారా నీరు అందిస్తాం.
• రైతులకు ఫారెస్టు అధికారులనుంచి వేధింపులు నిలువరిస్తాం.