టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ సమక్షంలో భారీగా టీడీపీలోకి చేరికలు
వైసీపీని వీడి టీడీపీలో చేరిన వైసీపీ నేతలు, కార్యకర్తలతో పాటు 495 కుటుంబాలు
అరాచక సర్కారుని గద్దె దింపేందుకు ప్రజల్ని చైతన్యం చేసేందుకు యువగళం పాదయాత్ర చేపట్టిన టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్..వెంట జనం దండులా కదిలి వస్తున్నారు. ఊరూవాడా, పల్లెపట్టణం యువగళమై నినదిస్తోంది. తనపైనా, తనకుటుంబంపైనా ఫేక్ ప్రాపగాండ చేస్తున్న వైకాపా నేతలపై పెట్టిన క్రిమినల్ పరువునష్టం కేసులలో కోర్టు వాంగ్మూలం నమోదు కోసం పాదయాత్రకి లోకేష్ విరామం ఇచ్చారు. జనజైత్రయాత్ర ఆగిన రోజే జాయినింగ్స్ జాతర మొదలైంది. ఉండవల్లిలోని నివాసంలో గురువారం నారా లోకేష్ సమక్షంలో మంగళగిరి నియోజకవర్గానికి చెందిన వైసీపీ నేతలు, కార్యకర్తలతో పాటు ఎస్సీ, బీసీ, మైనార్టీ సామాజికవర్గాలకు చెందిన 495 కుటుంబాల వారు టీడీపీలో చేరారు.
తమ కుటుంబాలతో కలిసి వచ్చి తెలుగుదేశం వెంటే తాముంటామంటూ నినదించారు. నారా లోకేష్ అందరికీ పసుపుకండువాలు కప్పి తెలుగుదేశంలోకి ఆహ్వానించారు. నేటి నుంచి మనమంతా టిడిపి కుటుంబసభ్యులమని, టిడిపి బలోపేతం కోసం శక్తివంచన లేకుండా పనిచేద్దామని పిలుపునిచ్చారు. తెలుగుదేశం వస్తేనే రాష్ట్ర ప్రగతి, ప్రజాసంక్షేమం సాధ్యమని లోకేష్ పేర్కొన్నారు. పార్టీలో చేరినవారు, టిడిపి నేతలతో నారా లోకేష్ సెల్ఫీలు, ఫోటోలు దిగారు. తాడేపల్లి మండలం, వడ్డేశ్వరం గ్రామానికి చెందిన 305 కుటుంబాల వారు నారా లోకేష్ సమక్షంలో టీడీపీలో చేరారు. దుగ్గిరాల మండలం పెద్దపాలెం గ్రామ సచివాలయ కన్వీనర్ బుల్లా కోటేశ్వరరావుతో పాటు 13 కుటుంబాల వారు టీడీపీలో చేరారు.
దుగ్గిరాల మండలం మోరంపూడి గ్రామానికి చెందిన మాజీ వైసీపీ ఎస్సీ సెల్ రాష్ట్ర కార్యదర్శి ఇత్తడి ప్రేమ్ కుమార్(చంటి)తో పాటు 35 కుటుంబాల వారు టీడీపీలో చేరారు. మంగళగిరి మండలం పెదవడ్లపూడి గ్రామానికి చెందిన 50 కుటుంబాలు నారా లోకేష్ సమక్షంలో టీడీపీలో చేరారు. మంగళగిరి పట్టణానికి చెందిన 20 కుటుంబాలు టీడీపీలో చేరారు. తాడేపల్లి పట్టణం 5వ వార్డుకు చెందిన బోనే గణేష్‌తో పాటు 25 కుటుంబాలు, తాడేపల్లి మండలం ఉండవల్లి గ్రామానికి చెందిన 35 కుటుంబాలు టీడీపీలో చేరారు. దుగ్గిరాల మండల కేంద్రం దుగ్గిరాల నుండి 12 వైసీపీ కుటుంబాల వారు నారా లోకేష్ సమక్షంలో టీడీపీలో చేరారు.