- బీసీలకు జరుగుతున్న అన్యాయంపై నోరు విప్పని మంత్రులు
- బడుగులకు ఇచ్చిన పదవులు నాలుక గీసుకోవడానికి కూడా పనికిరావు
- రాష్ట్రాన్ని నాలుగు భాగాలు చేసి నలుగురు రెడ్లకు అప్పగించారు
- మా ప్రశ్నలకు బదులిచ్చాకే మంత్రులు యాత్రలు చేయాలి
- పేదల గొంతు కోస్తున్న పెత్తందారు జగన్‌రెడ్డి కరపత్రం విడుదల చేసిన టీడీపీ నేతలు
అమరావతి, చైతన్యరథం: నాలుగున్నరేళ్లపాటు బడుగు, బలహీన వర్గాలను దోచుకోని, వారిపై దాడు లు చేసి, వారిని ఊచకోత కోసి ఎన్నికలు వచ్చేసరికి ముఖ్యమంత్రి జగన్‌రెడ్డి కొత్త నాటకానికి తెరలేపారని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు విమర్శించారు. ఒక్క అవకాశం అంటూ అధికారంలోకి వచ్చి అన్ని వర్గాల ప్రజలను వంచించి, రాష్ట్రాన్ని అధోగతిపాలు చేసి ఇప్పుడు మళ్లీ మోసం చేసేందుకు సామాజిక సాధికారిక యాత్రలు పేరుతో ప్రజల ముందకు వస్తున్నారని ధ్వజమెత్తారు. గురువారం మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో పేదల గొంతు కోస్తున్న పెత్తందారు జగన్ రెడ్డి అంటూ టీడీపీ రూపొందించిన కరపత్రాన్ని అచ్చెన్నాయుడు.. పొలిట్ బ్యూరో సభ్యులు నక్కా ఆనందబాబు, వర్ల రామయ్య, కొల్లు రవీంద్ర, ఎంఎ షరీఫ్, సోమిరెడ్డి చంద్ర మోహ న్‌రెడ్డి, మాజీ ఎంపీ కొనకళ్ల నారాయణ, మాజీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న, నాగుల్‌మీరా, ఎస్టీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు ధారు నాయక్‌తో కలిసి ఆవిష్కరించారు. ఆ సందర్భంగా అచ్ఛెన్నాయుడు మాట్లాడుతూ సీఎం జగన్ రెడ్డి నాలున్నరేళ్ల పాటు గాఢనిద్రలో ఉండి అన్ని వర్గాల ప్రజలను ఇబ్బందుల పెట్టి ఇప్పడు సామాజిక సాధికారిత బస్సు యాత్రల పేరుతో కొత్త నాటకం ప్రారంభించారని విమర్శించారు. ఒక్కసారి అవకాశం ఇవ్వండి అంటూ అధికారంలోకి వచ్చిన తన విధానాలతో బడుగు, బలహీన వర్గాలకు తీరని నష్టం చేసిన జగన్ రెడ్డి మరోసారి ఆ వర్గాలకు మోసం చేసేందుకు పూనుకున్నాడని అన్నారు.
మంత్రులు సమాధానం చెప్పాకే బస్సు యాత్ర చేయాలి
తన పాలనలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలను జగన్ రెడ్డి ఊచకోత కోశారని, వారిపై నిత్యం దాడులు జరిగాయని, వందల మందిని హత్య చేశారని అచ్చెన్నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ వర్గాలకు స్వాతంత్య్రం వచ్చిన నాటి నుండి అందుతున్న రాజ్యాంగ హక్కులను కూడా జగన్ రెడ్డి హరించి వేశారని, సబ్ ప్లాన్ నిధుల్లో ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయలేదని, నిధులన్నింటినీ దారి మళ్లించారని చెప్పారు. బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతి కోసం కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలకు రాష్ట్ర ప్రభుత్వ వాటా జత చేయకుండా ఆ వర్గాలకు తీరని అన్యాయం చేస్తున్నారని చెప్పారు. బీసీ కులాలకు కార్పొరేషన్లు పెట్టి పదవులిచ్చామని గొప్పలు చెబుతున్న జగన్ రెడ్డి ఆ కార్పొరేషన్లకు ఒక్క రూపాjైునా కేటాయించారా అని ప్రశ్నించారు. సంక్షేమ పితామహుడైన చంద్రబాబు అన్ని వర్గాలకు అన్ని పథకాలను అమలు చేశారని, వాటన్నింటినీ జగన్ రెడ్డి రద్దు చేసి ఆ వర్గాలకు తీరని ద్రోహం చేశారని, వీటిపైన మంత్రులు ఎందుకు ప్రశ్నించరని అడిగారు. స్థానిక సంస్థల్లో బీసీలకు రిజర్వేషన్లను చంద్రబాబు 34 శాతానికి పెంచితే జగన్ రెడ్డి దాన్ని 20 శాతానికి కుదించారని, దీనిపై బీసీ మంత్రులు ఎన్నడైనా జగన్ రెడ్డిని అడిగారా అని ప్రశ్నించారు. స్థానిక సంస్థల్లో బడుగు, బలహీన వర్గాలకు పదవులిచ్చామని జగన్ రెడ్డి చెబుతున్నారని, ఈ పదవులతో ఆ వర్గాల ప్రజలు అధికారం చెలాయించే పరిస్థితి ఉందా అని వైసీపీ బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ మంత్రులు, నేతలు గుండె మీద చెయ్యేసుకొని చెప్పాలని అన్నారు. అధికారమంతా తన సొంత సామాజిక వర్గ నేతల చేతుల్లో పెట్టి ఎందుకు పనికిరాని పదువులను బడుగు, బలహీన వర్గాలకు ఇచ్చారని, ఇవి నాలుక గీసుకోవడానికి కూడా పనికి రావన్నారు. పేరుకే బడుగు, బలహీన వర్గాల నేతలు మంత్రులు అని, రాష్ట్రం మొత్తాన్ని జగన్ రెడ్డి నాలుగు భాగాలుగా విభజించి నలుగురు రెడ్లను ఆ ప్రాంతాలకు సామంతరాజులుగా పెట్టుకున్నారని చెప్పారు. రాజ్యాంగబద్ద పదవులన్నీ కూడా రెడ్డి సామాజిక వర్గానికే కట్టబెట్టి బడుగు, బలహీన వర్గాలను తొలుబొమ్మలు చేసి ఆడిస్తున్నారన్నారు. ఒక్క బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ మంత్రి కైనా ఒక్క రూపాయి సొంతంగా విడుదల చేసే అధికారం ఉందా అని ప్రశ్నించారు. తాము అడిగిన ప్రశ్నలన్నింటికీ సమాధానం చెప్పిన తర్వాతే బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ మంత్రులు బస్సు యాత్రకు వెళ్లాలని అచ్చెన్నాయుడు డిమాండ్ చేశారు.