- బీసీలను బ్లాక్ మెయిల్ చేయడానికి, వారిని శాశ్వతంగా తన బానిసల్ని చేసుకోవడానికే జగన్ రెడ్డి కులగణన పేరుతో కొత్తనాటకం మొదలెట్టాడు
- జగన్ రెడ్డి మెప్పుపొంది తన స్వప్రయోజనాలు నెరవేర్చుకోవడానికే ఆర్ కృష్ణయ్య వేషాలు
- బీసీలను టీడీపీకి దూరం చేసేందుకే ఆర్ కృష్ణయ్య కొత్త కుట్రలు
- జగన్ రెడ్డి దమనకాండకు, దుర్మార్గపు పాలనకు బీసీలు బలైనప్పుడు వేలాది బీసీ కుటుంబాలు రోడ్డునపడినప్పుడు కృష్ణయ్య ఎక్కడున్నాడు?
- జగన్ రెడ్డి తన జేబు సంస్థలతో తూతూమంత్రంగా కులగణన చేయాలని చూస్తున్నాడు
- బీసీల పథకాలు, ప్రయోజనాలకు గండి కొట్టి వారిని శాశ్వతంగా తన బ్లాక్ మెయిల్ రాజకీయాలకు వాడుకోవడానికే కులగణన డ్రామాలు
అమరావతి: బీసీ కులగణన పేరిట జగన్‌రెడ్డి ప్రభు త్వం మరో భారీమోసానికి తెరలేపిందని టీడీపీ పొలిట్ బ్యూరోసభ్యుడు, మాజీ మంత్రి కొల్లు రవీంద్ర మండి పడ్డారు. ఎన్నికల్లో లబ్ధి పొందడానికే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలను వంచిస్తూ తన పార్టీ పెయిడ్ ఆర్టిస్ట్ లతో సామాజిక సాధికార బస్సుయాత్రలు జగన్‌రెడ్డి నిర్వహి స్తున్నాడనిన్నారు. ఎలాగైనా మరలా అధికారంలోకి రావాలని ముఖ్యమంత్రి కుయుక్తులు పన్నుతుంటే, వైసీ పీలోని బీసీ నేతలు, మంత్రులు నిస్సిగ్గుగా ఆయనకు వంతపాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగ ళగిరిలోని పార్టీ జాతీయ కార్యాలయంలో గురువారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ రాష్ట్రంలోని బీసీ నేతలు చాలరన్నట్టు తెలంగాణలో ఉండే ఆర్ కృష్ణయ్య ఏపీలో ఒక బీసీ సంఘం నిర్వహిస్తూ, దాని ముసుగు లో మొత్తం బీసీలను జగన్‌రెడ్డికి తాకట్టు పెట్టి రాజ్య సభ సభ్యుడిగా పదవి పొంది తన సొంత ప్రయోజనాల కోసం పాటు పడుతున్నాడని దుయ్యబట్టారు. సదరు నాయకుడు నేడు బీసీలను తెలుగుదేశానికి దూరం చేయడం కోసం కొత్త కుట్రలకు తెరలేపాడు. తెలంగా ణ రాష్ట్రానికి తొలి బీసీ ముఖ్యమంత్రిగా ఆర్.కృష్ణయ్య పేరుని ప్రకటించింది తెలుగుదేశం పార్టీనే. బ్లాక్ మెయి ల్ రాజకీయాలకే పరిమితమైన ఆర్.కృష్ణయ్య పద్ధతి మార్చుకొని బీసీలకు న్యాయం చేస్తాడని నమ్మి ఎమ్మెల్యే గా గెలిపించి శాసనసభకు పంపిస్తే ఆయన ఏనాడూ తన వర్గాల కోసం గొంతెత్తింది లేదు. జగన్‌రెడ్డి, అతని ప్రభుత్వం బీసీలకు తీరని అన్యాయం చేస్తుంటే ఏనాడై నా బీసీల తరుపున ముఖ్యమంత్రిని కృష్ణయ్య ప్రశ్నిం చాడా? బీసీ సబ్‌ప్లాన్ నిధులు దారి మళ్లించినా, రాజ్యా ంగపరంగా బీసీలకు దక్కాల్సిన స్థానిక సంస్థల పదవు లు దక్కకుండా చేసినా, బీసీల రిజర్వేషన్లకు కోత పెట్టినా ఏనాడూ జగన్‌రెడ్డిని ఆర్ కృష్ణయ్య ఒక్కమాట అన్నది లేదు. ప్రజలు ఎన్నుకున్న బీసీ సర్పంచ్‌లు.. ఇతర ప్రజాప్రతినిధులు ప్రజల సంక్షేమానికి వెచ్చించా ల్సిన నిధుల్ని జగన్‌రెడ్డి మింగేస్తుంటే కృష్ణయ్యకు కనిపించడం లేదా అని కొల్లు ప్రశ్నించారు.
బీసీల భవిష్యత్‌ను కాలరాయడానికే జగన్‌రెడ్డి కులగణన పేరుతో కొత్తనాటకం..
బీసీలను బ్లాక్ మెయిల్ చేయడానికే జగన్‌రెడ్డి కొత్త గా కులగణన నాటకం మొదలెట్టాడు. బీసీలకు అసలు ఎలాంటి భవిష్యత్ లేకుండా చేయాలన్న దుష్ట ఆలోచన తోనే జగన్ కులగణనను తెరపైకి తెచ్చాడు. కుల గణన.. జనగణన పేరుతో ప్రజల వివరాలు సేకరించే అధికారం వాలంటీర్లకు ఎవరిచ్చారు. కులగణన అనేది చట్టబద్ధంగా న్యాయప్రకారం జరగాలి. జాతీయ బీసీ కమిషన్ అనుమతితో.. రిటైర్డ్ జస్టిస్ నేతృత్వంలోని కమిటీ పర్యవేక్షణలో బాధ్యతగల ప్రభుత్వాధికారులు చేయాల్సిన కులగణనను ఎఫ్.ఓ.ఏ(ఫీల్డ్ ఆపరేటింగ్ ఏజెన్సీ)లో భాగమైన రామ్ ఇన్ ఫో టెక్ సంస్థ ద్వారా చేయించడం ముమ్మాటికీ చట్ట విరుద్ధమే. జగన్‌రెడ్డి మొక్కుబడిగా చేపట్టబోతున్న కులగణన ముమ్మాటికీ బీసీలను వంచించడానికి చేస్తున్నదే. వాలంటీర్లు అడిగి తే వేలిముద్రలు ఎందుకు వేయాలి? వారు అడిగితే ఓటీపీ వివరాలు ఎందుకు చెప్పాలి? వారికిచ్చే ప్రతి సమాచారం అంతిమంగా మనకే చేటు చేస్తుందని ప్రతి బీసీ కుటుంబం గుర్తించాలి. అభిప్రాయ సేకరణ పేరు తో నిర్వహిస్తున్న సభలు.. సమావేశాల్ని వైసీపీ కార్యక్ర మాల్లా మార్చి బీసీలు నోరెత్తకుండా చేస్తున్నారు. కుల గణనలోని లోటుపాట్లు..సాధ్యాసాధ్యాలపై ఎక్కడా బీసీ లకు.. సంఘాల నేతలకు మాట్లాడే అవకాశం ఇవ్వడం లేదు.వైసీపీలోని బీసీ నేతలు..పార్లమెంట్‌సభ్యులు నేరు గా కేంద్రప్రభుత్వాన్ని కలిసి జగన్ ప్రభుత్వం చేపట్ట బోతున్న కులగణన దేనికోసమో..ఎందుకోసమో..ఎంత వరకు చట్టబద్ధమో తెలుసుకోవాలి. బీహార్లో ఏం జరిగి ందో చూశాం.అక్కడి రాష్ట్రప్రభుత్వం ఇలానే కులగణన చేసినా అది ఎందుకు అమలుకు నోచుకోలేదో ఆలోచిం చండి.అధికారపార్టీలోని బీసీనేతలు.. మంత్రులు…పార్ల మెంట్ సభ్యులతో పాటు మొత్తం ఎంపీలంతా ప్రధానిని కలిసి బీసీలకోసం, వారి సంక్షేమం కోసం కులగణన చేయాల్సిన అవసరముందని చెప్పి ఒప్పించండి. అది చేయకుండా కేవలం బీసీలను గుప్పెట్లో పెట్టుకొని ఆడిరచాలనో…వారిని బ్లాక్ మెయిల్ చేయాలనో..వారి కి రావాల్సిన పథకాలు.. నిధులు రాకుండా చేయాలనో ఇలాంటి గణనలు చేపడితే వాటిని ఎట్టిపరిస్థితుల్లో ముందుకు సాగనివ్వబోమని కొల్లు తేల్చిచెప్పారు.
పదవుల్లో బీసీలకు జగన్‌రెడ్డి తీవ్ర అన్యాయం చేసినప్పుడు కృష్ణయ్య ఎందుకు స్పందించలేదు?
ప్రభుత్వ సలహాదారుల్లో,నామినేటెడ్ పోస్టుల్లో, విశ్వ విద్యాలయాల వైస్‌ఛాన్స్‌లర్లుగా బీసీలకు ఎందుకు ప్రాధాన్యత ఇవ్వడం లేదని ఏనాడూ జగన్‌రెడ్డిని కృష్ణ య్య ఎందుకు ప్రశ్నించలేకపోయాడు. బీసీ మంత్రులు, ఎమ్మెల్యేలను ఉత్సవ విగ్రహాలుగా మార్చి, వారిపై అధి కారాన్ని తనవర్గం వారికి కట్టబెట్టిన జగన్‌రెడ్డి నియం తృత్వ పోకడలు కృష్ణయ్యకు కనిపించడం లేదా? నామ మాత్రంగా 56బీసీ కార్పొరేషన్లు పెట్టి, వాటికి ఛైర్మన్లు, డైరెక్టర్లుగా నియమించిన వారిని ఉత్త బొమ్మలుగా మార్చిన జగన్‌రెడ్డి అహంకారాన్ని బీసీల ప్రతినిధినని చెప్పుకునే కృష్ణయ్య ఏనాడూ ఎందుకు నిలదీయలేదని కొల్లు నిలదీశారు.
కృష్ణయ్య లాగా బీసీల్ని రాజకీయాలకు.. స్వార్థానికి వాడుకునే ఆలోచన టీడీపీ బీసీ నేతలకు లేదు..
బాపట్ల జిల్లాలో బీసీ బాలుడు అమర్నాథ్ గౌడ్‌ను దారుణంగా పెట్రోల్‌పోసి తగలబెట్టి చంపినప్పుడు కృష్ణ య్యకు బీసీలు గుర్తురాలేదు. తెలుగుదేశంపార్టీకి మద్ధ తుగా సైకిల్ యాత్ర చేస్తున్న బీసీ సోదరుల్ని పుంగ నూరులో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గూండాలు దారుణంగా బట్టలువిప్పి అవమానిస్తే కృష్ణయ్యలో చల నం లేదు. నెల్లూరు జిల్లా కావలి వద్ద ఆర్టీసీ డ్రైవర్ని వైసీపీ నాయకుడు చావగొడితే మానవతా దృక్పథంతో కూడా కృష్ణయ్య స్పందించలేదు. ధర్మవరం వస్త్ర వ్యాపా రులు తమకు రావాల్సిన బకాయిల కోసం విజయవాడ కు వస్తే… వారికి డబ్బు ఇవ్వకుండా కొట్టి అవమానిస్తే దానిపై కృష్ణయ్య ఎందుకుస్పందించలేదు? జగన్ ప్రభు త్వంలో బీసీలపై నిత్యం రాష్ట్రంలో ఏదోఒకమూల ఏదో ఒక దారుణం జరుగుతూనే ఉన్నా బీసీల నాయకుడిని అని చెప్పుకునే కృష్ణయ్య ఎందుకు నోరెత్తడం లేదు? పార్టీలకతీతంగా పనిచేసే బీసీ నాయకులు.. టీడీపీలోని కీలక బీసీ నేతలపై జగన్‌రెడ్డి తప్పుడు కేసులు పెట్టి.. అన్యాయంగా జైలుకు పంపిననాడు కృష్ణయ్యకు బీసీల పై జరుగుతున్న దారుణాలు కనిపించలేదా? నాపై.. అచ్చెన్నాయుడిపై..యనమల రామకృష్ణుడు.. అయ్యన్న పాత్రుడిపై వైసీపీ ప్రభుత్వం పెట్టిన అక్రమ కేసులపై కృష్ణయ్య ఏనాడూ ఎందుకు ముఖ్యమంత్రిని ప్రశ్నించ లేదు? బీసీ మహిళలైన పంచుమర్తి అనురాధ.. ఆదిరెడ్డి భవానీ వంటి వారిని జగన్‌రెడ్డి.. అతని ఎమ్మెల్యేలు.. వైసీపీ నేతలు దారుణంగా అవమానించిన విషయం కృష్ణయ్యకు గుర్తులేదా?బీసీ నాయకులమైన మేం ఎప్పు డూ బీసీల పక్షానే నిలుస్తాం. కృష్ణయ్యలాగా పదవుల కోసం.. స్వప్రయోజనాలకోసం బీసీల్ని వాడుకొని రాజ కీయంగా ఎదిగే దుర్బుద్ధి తమకు లేదని కొల్లు స్పష్టం చేశారు.
రాష్ట్రంలో బీసీలకు జరుగుతున్న అన్యాయంపై కృష్ణయ్య పార్లమెంట్లో ఏనాడూ నోరెత్తలేదు
కేంద్రప్రభుత్వం నుంచి బీసీల సంక్షేమానికి రావా ల్సిన నిధులు రాకపోయినా,వచ్చిన వాటిని సద్వినియో గం చేయకుండా దారి మళ్లిస్తున్నా రాజ్యసభ సభ్యుడిగా ఉన్న కృష్ణయ్య ఏనాడూ ఎందుకు పార్లమెంట్లో బీసీలకు జరిగే అన్యాయంపై మాట్లాడలేదు?పాఠశాలల విలీనం పేరుతో బీసీ పిల్లలకు ప్రాథమిక విద్యను దూరం చేసిన జగన్‌రెడ్డి నిర్వాకం కృష్ణయ్యకు కనిపించడం లేదా?బీసీ విద్యార్థులు,యువత కోసం టీడీపీ ప్రభుత్వం తీసుకొచ్చి న బెస్ట్ అవైలబుల్ స్కూళ్లు..విదేశీవిద్య… స్టడీ సర్కిళ్లను జగన్‌రెడ్డి రద్దుచేయడంపై కృష్ణయ్య ఏం సమాధానం చెబుతాడు? బీసీలకు జగన్‌రెడ్డి ఇంత అన్యాయం చేస్తు న్నా.. తప్పుడు కేసులతో వారిని వేధిస్తున్నా కృష్ణయ్య, వైసీపీలోని బీసీ నేతలు, బీసీ మంత్రులు, గ్రామ, మం డలస్థాయి నేతలు ఏ ముఖం పెట్టుకొని సిగ్గులేకుండా వైసీపీలో కొనసాగుతున్నారని ప్రశ్నిస్తున్నా. అధికారం లోకి వచ్చాక 70మందికి పైగా బీసీ నేతల్ని దారుణం గా చంపించిన జగన్‌రెడ్డి లాంటి బీసీ ద్రోహికి, బీసీల పథకాలు..వారి రాజకీయ పదవుల్ని దూరం చేసిన బీసీ వంచకుడికి వత్తాసు పలకడం అంటే బీసీలను దారు ణంగా వంచించడ మేనని వైసీపీలోని బీసీనేతలు.. బీసీ మంత్రులు గ్రహించాలని కొల్లు హితవు పలికారు.
బస్సుయాత్ర నిర్వహణ, పర్యవేక్షణకు కూడా బీసీలు పనికిరారా?
జగన్‌రెడ్డి..అతని ప్రభుత్వ కార్యక్రమాలు నిర్వహిం చడానికి..ఇతర కీలక పదవుల్లో కొనసాగడానికి బీసీలు పనికిరారా? సామాజిక సాధికార బస్సుయాత్ర నిర్వహ ణను.. దాని పర్యవేక్షణ ఏర్పాట్లను ఏరికోరి తనవర్గం వారికి.. బీసీయేతర వర్గాలకు కట్టబెట్టిన జగన్‌రెడ్డి ఏ విధంగా బీసీలకు మేలు చేశాడో.. చేస్తున్నాడో అధికార పార్టీలోని బీసీ నేతలు, బీసీ మంత్రులు చెప్పాలి. బీసీల స్వాధీనంలో ఉన్న 14లక్షల ఎకరాల అసైన్డ్ భూముల్ని కొల్లగొట్టినా జగన్‌రెడ్డిని ప్రశ్నించలేని వైసీపీ బీసీ నాయ కత్వం బీసీలకు అవసరమా అని కొల్లు ప్రశ్నించారు.