ఎదిగినకోద్దీ ఒదగమనీ అర్థమందులోదవుంది. `సాహిత్య ప్రాధాన్యత, చైతన్య స్రవంతిల సమ్మేళ నంలా కనిపించే ఇలాంటి తెలుగు పాట రాయడానికి ఎక్కడో ఒక ఇన్‌స్పిరేషన్ ఉంటుంది. రచయిత చంద్ర బోస్.. బహుశ పీవీ నరసింహారావు లాంటివాళ్ల జీవిత కథలు చదివిన స్ఫురణతో రాసిన పాటై ఉండొచ్చు. ఈ రెండు పంక్తులు`పీవీని విశ్లేషించుకోడానికే అన్నట్టే ఉంటాయి. ఎదగడం, ఒదగడం సులువైన పదాల్లానే అనిపించినా `ఆ రెంటినీ జీవితంలో ఆవిష్కరించటానికి మధ్యనుండే ‘స్ట్రగుల్’ చిన్నదేం కాదు. అది`అనితరసాధ్యం, అని ర్వచనీయం. ఏ తరం భారతీయుడైనా సింపుల్‌గా పీవీ అని పిలుచుకునే పాములపర్తి వెంకట నరసింహారావు జీవితానికి ఆ ‘స్ట్రగుల్’ వర్తిస్తుంది.అతి సామాన్య రైతు కుటుంబంలో పుట్టి.. అత్యంత సామాన్య విద్యా భ్యాసాన్ని సాగించి… దేశభక్తిని వంటబట్టించుకున్న ప్రభావంతో రాజకీయాలోకి `ఆధునిక భారత రాజకీయ చరిత్రపైన తనదైన ముద్రవేసిన తెలుగు బిడ్డ `పీవీ నరసింహారావు.
ఆ సాధారణ వ్యక్తే `భావి భారతగతి మార్చిన సంస్కర్త అయ్యాడు. అప్పుల భార తాన్ని అభివృద్ధి వైపు నడిపించాడు. భారత ఆర్థిక మూలాల బలోపేతానికి సాహసోపేత నిర్ణయాలు తీసుకున్నాడు. ఆర్థిక రంగం నుంచి అణుశక్తి కార్య క్రమం వరకు, అంతర్గత భద్రత నుంచి విదేశాంగ విధానం వరకు అన్నింటిపైనా తనదైన ముద్రవేసిన తెలుగుబిడ్డ పీవీ- ఆధునిక భారత చరిత్రను మేలు మలుపు తిప్పిన ఈ రాజనీతిజ్ఞుడు.. కడవరకూ ఒదిగే ఉన్నాడు. అలాంటి వ్యక్తికి ఆలస్యంగానైనా కేంద్ర ప్రభుత్వం భారతరత్న ప్రకటించడం.. భారత్‌ను భారతే గౌరవించుకున్నట్టు.
పీవీ నరసింహారావు 1921 జూన్ 28న వరంగల్ జిల్లా నర్సంపేట మండలం లక్నేపల్లిలో జన్మించారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా వంగరలో ప్రాథమిక విద్య, హనుమకొండలో ఉన్నత పాఠశాల విద్య అభ్యసిం చారు. ఉస్మానియా వర్సిటీ నుంచి బీఏ, నాగ్‌పూర్ వర్సిటీ నుంచి ఎల్‌ఎల్‌ఎం పట్టా తీసుకున్నారు. అలహాబాద్‌లో సాహిత్య రత్నను అభ్యసించారు. 1957లో ఎమ్మెల్యేగా రాజకీయ జీవితం ప్రారంభించి కరీంనగర్ జిల్లా మంథని ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 1971 సెప్టెంబర్ 30 నుంచి 1973 జనవరి 10 వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ 4వ ముఖ్యమంత్రిగా బాధ్యతలను నిర్వర్తించారు. 1991 జూన్ 21 నుంచి 1996 మే 16 వరకు భారత ప్రధానిగా సేవలందిం చారు. తెలుగువాడు ప్రధాని కావడం గర్వకారణంగా భావించిన నాటి సీఎం ఎన్టీఆర్.. నంద్యాల లోక్‌సభ నుంచి పీవీ పోటీ చేస్తే టీడీపీ తరపున పోటీ పెట్ట కుండా మద్దతు తెలిపారు. దీంతో పీవీ 5లక్షల ఓట్ల మెజార్టీతో నంద్యాల ఎంపీగా గెలిచారు. అధిక మెజా రిటీ సాధించి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో చోటు దక్కించుకున్నారు.
ఆధునిక ఆలోచనలతో..
దేశం ఆర్థికంగా దివాలా తీసే స్థితిలో ఉన్నపుడు `పీవీ ప్రధాని పీఠాన్ని అధిష్టించారు. అప్పటివరకూ అనుసరించిన విధానాలకు తోడు, గల్ఫ్ యుద్ధం ప్రభావంతో భారత్ ఆర్థిక పరిస్థితి అప్పటికే అగమ్య గోచరంగా ఉంది. గండం నుంచి గట్టెక్కడానికి 67 మెట్రిక్ టన్నుల బంగారాన్ని బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్, యూనియన్ బ్యాంక్ ఆఫ్ స్విట్జర్లాండ్లలో తాకట్టు పెట్టి 007 మిలియన్ డాలర్ల అప్పు తెచ్చుకోవాల్సిన దుస్ధితిలో పడ్డాం! అలాంటి సమయంలో ప్రధాని అయిన పీవీ- మన్మోహన్‌ను తోడు చేసుకుని సంస్క రణల రథాన్ని పరుగులు తీయించారు. విశ్వవిపణికి భారత్‌ను అనుసంధానించారు. 1992కల్లా ఆర్థిక సంక్షోభాన్ని అదుపు చేసి, తాను దిగిపోయే నాటికి జీడీపీ వృద్ధిని 7.6 శాతానికి చేర్చారు. ‘ఆర్థిక సంస్కర ణల అమలుకు రాజకీయంగా తోడ్పాటునివ్వడానికి తగిన దార్శనికతా ధైర్యమూ పీవీ నరసింహారావు కనబరచారు. ఆ ధీమా ఉన్న ప్రధానమంత్రిగా పీవీ చరిత్రలో అందరికన్నా మిన్నగా నిలిచిపోతారు’ అన్న ఆర్బీఐ మాజీ గవర్నర్ వై.వేణుగోపాల్‌రెడ్డి వ్యాఖ్యలు అక్షరసత్యాలు.
ఆర్థిక వ్యవస్థను సంస్కరించే క్రమంలో ఏ ఒక్క ఉద్యోగిని, కార్మికుణ్ని తొలగించకూడదన్న భావనతోనే పీవీ వ్యవహరించారు. దీనితో పాటు పేదలకు ప్రభు త్వమే వంద రోజుల పాటు పని కల్పించే ఉపాధి హామీ పథక రచన సైతంచేశారు. పదేళ్ల తరవాత యూపీఏ పాలనలో అమలులోకి వచ్చిన జాతీయ ఉపాధి హామీ పథకానికి మూలాలు పీవీ మేధోమథ నంలో ఉన్నాయి. ప్రజాపంపిణీ వ్యవస్థ సంస్కరణ నుంచి ప్రభుత్వ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాల అమలు పర్యవేక్షణకు ప్రత్యేక మంత్రిత్వశాఖ ఏర్పాటు వరకు అన్నింటా పీవీ వినూత్న ధోరణులనే అనుసరిం చారు.దేశీయవిధానాల్లో మార్పులు చేస్తూనే విదేశాంగ విధానాన్ని నూతనపథంలో నడిపించారు. నేటి‘యాక్ట్ ఈస్ట్’ విధానానికి మాతృక అయిన ‘తూర్పు వైపు చూపునకు పీవీయే ప్రాణంపోశారు. తద్వారా ఆసియా లో చైనా ప్రాబల్యానికి పగ్గాలు వేయడంతో పాటు ఇండియాకు కొత్త మిత్రులను సంపాదించ…