- వ్యాపార, వాణిజ్యవర్గాలపై పోలీసుల్ని ఉసిగొల్పడం కక్షసాధింపే
- పెద్దారెడ్లు ఛీ కొట్టారన్న అక్కసుతోనే
- తనిఖీల పేరుతో ఇళ్లు, కార్యాలయాల్లోకి వెళ్లే అధికారం పోలీసులకెవరిచ్చారు
- వేధింపులపై ఎన్నికల కమిషన్ వెంటనే స్పందించాలి
- పోలీసులు, అధికారులు కోర్టుల్లో సమాధానం చెప్పక తప్పదు
- టీడీపీ వాణిజ్య విభాగం రాష్ట్ర అధ్యక్షుడు డూండీ రాకేష్ మండిపాటు
అమరావతి: వ్యాపారులపై జగన్మోహన్రెడ్డి ప్రభు త్వం అనుసరిస్తున్న కక్షసాధింపు విధానాలు శ్రుతిమిం చాయని టీడీపీ వాణిజ్య విభాగం రాష్ట్ర అధ్యక్షుడు డూండీ రాకేష్ విమర్శించారు. సొంతపెట్టుబడితో వ్యాపారం చేసుకుంటూ,న్యాయంగా కట్టాల్సిన పన్నులు కడుతూ గౌరవంగా బతుకుతున్న వ్యాపారులపై ప్రభు త్వం వేధింపులకు పాల్పడటం బాధాకరమన్నారు. జగన్‌రెడ్డి దృష్టిలో వ్యాపారులంటే భారతి మాత్రమేనని, భారతి సిమెంట్స్, భారతి టెలివిజన్, భారతి ఫ్యాక్టరీలు తప్ప మరే ఇతర వ్యాపారాలు, వాణిజ్యసంస్థలు, చిన్న చితకా వ్యాపారులు, పెద్ద పారిశ్రామికవేత్తలు ఎవరూ ముఖ్యమంత్రికి కనిపించడం లేదని తప్పుబట్టారు.
మంగళగిరిలోని పార్టీ జాతీయ కార్యాలయంలో సోమ వారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ వ్యాపార వర్గాలపై దాడులు, వేధింపులు ఆపాలని గతంలో ఎన్నో సార్లు వాణిజ్య సంఘాలు వైసీపీ ప్రభుత్వాన్ని కోరినా ఫలితం లేకుండా పోయిందన్నారు. ప్రస్తుతం ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో తెలుగుదేశం పార్టీలో ఉండే వ్యాపారులు, ఆ పార్టీకి అండగా నిలిచే వ్యాపారులపైకి ప్రభుత్వం పోలీస్ శాఖను ఉసిగొల్పింది. తెల్లారక ముందే ఎలాంటి సెర్చ్ వారెంట్ లేకుండా, ఏ విధమైన అనుమతులు లేకుండా నెల్లూరులో టీడీపీ నేత, మాజీ మంత్రి నారాయణ సహా, ఆయన బంధువుల ఇళ్లు, కార్యాలయాల్లో పోలీసులు తనిఖీల పేరుతో నానాహం గామా సృష్టించారు. ఇళ్లలో ఉండే నగదు, బంగారం తీసుకెళ్లి అందరినీ స్టేషన్లకు తరలించడం పరిపాటిగా మారిందని రాకేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
పెద్దారెడ్లు ఛీ కొట్టారన్న అక్కసుతో..
నెల్లూరు పెద్దారెడ్లు అంతా మూకుమ్మడిగా జగన్ రెడ్డిని ఛీ కొట్టడంతో చివరకు వారి వ్యాపారాలపై దాడు లు చేయిస్తున్నాడు. వ్యాపార, వ్యవహారాలతో పోలీసు లకు ఏమి పని? ఫేక్ రిజిస్ట్రేషన్లతో వ్యాపారాలు చేస్తే, వాటికి సంబంధించిన ఆధారాలు చూపించి, సదరు వ్యక్తుల్ని ప్రశ్నించి, తప్పు చేసినట్టు తేలితే, సంబంధిత విభాగం వారికి అప్పగించాలి. అది చేయకుండా తని ఖీల పేరుతో పోలీసులు ఇళ్లలోకి చొరబడి బీరువాలు, లాకర్లు, బెడ్రూమ్లు, కిచెన్ల్లో వెతకడం ఏమిటి? నగదు ఉందా, బంగారం ఉందా అని వెతికే అధికారం పోలీసులకు ఎక్కడిది? తనిఖీలు చేయాలంటే ఒక పద్ధ తి ఉంటుంది. ముందుగా నోటీసులు ఇచ్చి, సంబం ధిత వ్యక్తుల్ని విచారణకు పిలవాలి. కానీ రాష్ట్ర పోలీస్ యంత్రాంగం అందుకు పూర్తి విరుద్ధంగా వ్యవహరి స్తోందని రాకేష్ తప్పుబట్టారు.
టీడీపీ సానుభూతిపరులైన వ్యాపారుల ఇళ్లలో వెతి కితే ఏం దొరుకుతుంది.
వైసీపీ నేతలు, ఆ పార్టీ సాను భూతిపరులైన వ్యాపారుల ఇళ్లల్లో వెతికితే కళ్లు చెదిరి పోయే సంపద వెలుగుచూస్తుంది. ఇసుక, ఎర్రచంద నం, ఖనిజ సంపద, మద్యం అమ్మకాల దోపీడీతో వేలకోట్లు దోచేసిన మంత్రి పెద్దిరెడ్డి, ఇసుక మాఫియా ను నడిపిస్తున్న సజ్జల రామకృష్ణారెడ్డి, మాజీమంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, ప్రస్తుత మంత్రులు, వైసీపీ నేతల ఇళ్లు, కార్యాలయాల్లో వెతికితే వేలకోట్ల నగదు, బంగారం, ఇతర ఆస్తులపత్రాలు లభిస్తాయి. రాష్ట్రాన్ని ప్రజల్ని దోచేసుకున్నవారిని వదిలేసి, కష్టపడి బతికే వ్యాపారులపై వేధింపులు ఏమిటి? రాష్ట్రానికి ఇన్ని పరిశ్రమలు, కంపెనీలు తీసుకొచ్చాను… ఇన్ని ఉద్యోగా లు వచ్చాయి.. పన్నులరూపంలో ఇంత ఆదాయం వచ్చిందని చెప్పే ధైర్యం లేని జగన్‌రెడ్డి, చివరకు ఇలా బరితెగించి వ్యాపార, వాణిజ్య వర్గాలపై తనిఖీల పేరుతో వేధింపులకు పాల్పడుతున్నారు. పక్క జిల్లా నుంచి వచ్చిన అధికారులమంటూ కొద్దిరోజుల క్రితం పర్చూరులో కారం పొట్లాలతో వచ్చి మరీ తనిఖీలు జరిపారు. అవేమి తనిఖీలో ఈ ముఖ్యమంత్రే చెప్పాలి. జగన్‌రెడ్డి పాలనలో రాష్ట్రం బీహార్ కంటే దారుణంగా తయారైందనడానికి ఇంతకంటే రుజువేం కావాలని రాకేష్ ప్రశ్నించారు.
తప్ప్పుచేసిన పోలీసుల ఆటకట్టిస్తాం
రాష్ట్రంలోని వ్యాపారులకు టీడీపీ వాణిజ్య విభాగం అండగా ఉండి ప్రభుత్వ వేధింపుల్ని ప్రతిఘటిస్తుంది. రాష్ట్రంలో స్పిన్నింగ్ మిల్లులు, గ్రానైట్ పరిశ్రమ, సిమెంట్ కంపెనీలు, రైస్ మిల్లుల యాజమాన్యాలు, రియల్ ఎస్టేట్, ఆఖరికి బట్టల దుకాణాలు, బెల్లం వర్తకులు, ఫ్లెక్సీ ప్రింటర్ల యాజమాన్యాల వారిని కూడా జగన్ వదల్లేదు. వ్యాపారాలన్నీ ఆయనొక్కడే చేసుకోవాలి… రాష్ట్రంలో ఎవరూ ఉండకూడదు.. అనే నియంత్రత్వ ధోరణితో వ్యవహరిస్తున్న జగన్‌రెడ్డిని, అతని ప్రభుత్వాన్ని వ్యాపారవర్గాలు తరిమికొట్టే రోజు దగ్గర కొచ్చింది. ఏ విభాగమైనా, ఏ అధికారి అయినా పద్ధతి ప్రకారం.. నిబంధనల మేరకు నడుచుకోవాలి.
అంతేగానీ ప్రభుత్వ ఆదేశాలనో, ముఖ్యమంత్రి చెప్పాడనో, మరో నాయకుడు చెప్పాడనో వ్యాపారుల్ని వేధిస్తే చూస్తూ ఊరుకోం. తప్పుచేస్తున్న అధికారులందరినీ కోర్టుల ముందు నిలబెట్టి శిక్షపడేలా చేస్తాం. రాష్ట్రంలో వ్యాపార, వాణిజ్య వర్గాలపై జరుగు తున్న దాడులు, తనిఖీల పేరుతో వేధింపులకు పాల్పడు తున్న తీరుపై ఎన్నికల కమిషన్ వెంటనే స్పందించాలి. ఇష్టానుసారం ప్రవర్తిస్తున్న అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలి. నెల్లూరులో సోమవారం జరిగిన తనిఖీలు, దాడుల వివరాలను పోలీస్‌శాఖ వెంటనే బయట పెట్టాలి. లేకుంటే వ్యాపారులకు అండగా నిలిచి, తప్పుచేసిన పోలీసుల ఆటకట్టిస్తామని రాకేష్ హెచ్చరించారు.