- ఉత్తరాంధ్రనే కబ్జా చేసిన ఘనాపాటీలు
- కుటుంబం ఆధీనంలో 2వేల ఎకరాలు
- ‘సమష్టి అవినీతి’ బొత్స ప్రత్యేకత
- కూడళ్ల నుంచి కోడిగుడ్ల వరకూ బిజినెస్సులు
- బార్లూ, థియేటర్లూ.. అంతా వ్యాపారమే
- నాన్న పేరిట ట్రస్ట్‌తోనూ అవినీతి..
- మద్యం, మైనింగ్‌లో టాప్ మాఫియా
- ఐదేళ్లలో ఆస్తులు డబుల్ చేసిన రికార్డు
భారతదేశం గర్వించదగ్గ తెలుగుజాతి ఆణిముత్యాల చరిత్రలో `ఉత్తరాంధ్రులది ప్రత్యేక పేజీ. వెనుకబడిన ప్రాంతమైన ఉత్తరాంధ్ర నుంచి చట్టసభల్లోకి అడుగుపెట్టినవాళ్లెందరో. అలాంటి మహనీయుల నేలమీద పుట్టిన బొత్స సత్యనారాయణకూ ఘన చరిత్రేవుంది. కాకపోతే `అది చీకటి చరిత్ర. ఆ మకిల చరిత్రలో అవినీతి పుటలు లెక్కలేనన్ని. చట్టం దృష్టిలో బొత్స కుటుంబం నిరుపేద. తెల్ల రేషన్ కార్డు కుటుంబం. కానీ `మకలి చరిత్రలోని అవినీతి పుటల్ని తిరగేస్తే మాత్రం.. వందల కోట్ల విలువ చేసే భూములు బయటపడతాయి. లిక్కర్ బార్లు దేదీప్యమానంగా వెలుగుతుంటాయి. విలువైన కార్లు మెత్తటి హారన్‌లు మోగిస్తుంటాయి. బలమైన నిరుపేద కుటుంబం కనుక `తెల్లరేషన్ కార్డు మీదే తెల్లారేసరికి ప్రభుత్వ భూమిపై వారసత్వం పుట్టుకొస్తుంటుంది. ఇలాంటి సినిమాటిక్ సీన్లన్నింటికీ `కథ, స్క్రీన్‌ప్లే, డైరెక్షన్ బొత్స సత్యనారాయణ.
వోక్స్‌వ్యాగన్ ఊసెత్తితే `ప్రపంచానికి గుర్తొచ్చేది అధునాతన పరిజ్ఞానంతో వచ్చిన కొత్త కారు. కాని `బొత్స చరిత్రను చదువుకన్నోళ్ల బుర్రల్లో తళుక్కున మెరిసేది `రూ. 11 కోట్ల కుంభకోణం. ‘‘యేటీ.. ఇక్కడుంది బొత్స కదేటి..’’ అన్న డైలాగ్ విన్నపుడు పొట్ట చేత్తో పట్టుకుని కడుపుబ్బ నవ్వుకుంటాం. కానీ `ఉత్తరాంధ్రలోని 3 జిల్లాల్లో 2 వేల ఎకరాలకు పైగా భూములు బొత్స కుటుంబ ఆధీనంలో ఉన్నాయని తెలిస్తే మాత్రం.. గుండె కిందకు జారిపోయినట్టు కళ్లు తేలేస్తాం. ఔను, బొత్స కుటుంబం ఉత్తరాంధ్రను కబ్జా చేసింది. చేస్తూను ఉంది. రాజకీయాన్ని వ్యాపకం చేసుకున్న బొత్స కుటుంబం `అధికారాన్ని అడ్డంపెట్టుకుని అక్షరాలా ఆరువేల కోట్లు వెనకేసింది. కుటుంబంలో ఓ గొప్ప వ్యక్తి కాలం చేస్తే `వాళ్లమీద గౌరవంకొద్దీ ట్రస్ట్ ఏర్పాటు చేసి సేవా కార్యక్రమాలు నిర్వహించడం ఎక్కడైనా చూసేదే. బొత్స అందుకు విరుద్ధం. నాన్న గురునాయుడు కాలంచేస్తే `ఆయన పేరిట 2006లో ట్రస్టు ఏర్పాటుచేసి కోట్లాది రూపాయల వసూలు సేవ చేసుకున్న ఘన చరిత్ర బొత్సది. కుదమట్టంగావుండే బొత్స ఆహార్యం మాదిరిగానే `ఆయన అవినీతి చరిత్ర సైతం కుదమట్టం. అలాంటి బొత్స బొజ్జనిండా
భూకబ్జాలే!
బొత్స సత్యనారాయణ రాజకీయ ప్రస్థానం మొదలైన నాటినుంచి నేటి వరకు ప్రజాసేవకు దూరంగానే ఉన్నారు. అధికారం అండతో అక్రమార్జనలోనే మునిగి తేలుతున్నారు. గాజులరేగ ప్రాథమిక వ్యవసాయ పరపతి సహకార సంఘం సొసైటీ అధ్యక్షునిగా ఎన్నికై 1992 నుంచి 1995 వరకు డీసీసీబి ఛైర్మన్‌గా బాధ్యతలు నిర్వర్తించారు బొత్స. నాటినుంచి నేటివరకు చేయని అవినీతి దందా అంటూ లేదు. భారీ పరిశ్రమలు, గృహనిర్మాణం, మార్కెటింగ్, పంచాయతీరాజ్ శాఖలమంత్రిగా బొత్స ఎన్నో కుంభకోణాలకు పాల్పడ్డారు. ప్రస్తుత వైసీపీ ప్రభుత్వ హయాంలో మునిసిపల్ శాఖ, ప్రస్తుతం విద్యామంత్రిగానూ చేయని కుంభకోణం లేదు. అవినీతిని ఉత్తరాంధ్రకు విస్తరించినట్లు.. కుటుంబీకు లకు ఒక్కో ప్రాంతాన్ని అప్పగించి.. ‘సమిష్టి అవినీతి’కి తెరలేపడం బొత్స కుటుంబంలోనే చూడొచ్చు.
బొత్స రaాన్సీ(భార్య):ఎంపీగా పనిచేసిన బొత్స రaాన్సీ భర్తకంటే ఏడడుగులు ముందుంది.ఇసుక దందా, గ్రావెల్ మాఫియాను దగ్గరుండి పర్యవేక్షిస్తుంది. ఏ అధికారి పోస్టింగైనా.. మేడమ్‌కి పేపర్‌లో నోట్ల కట్టలు పెట్టి ఇవ్వడం ఇక్కడ రివాజు చేశారు. అవి నీతిలో మేడమ్ వెరీ స్ట్రిక్ట్`అన్నది ఆమెకున్న గుర్తింపు.
సందీప్ (బొత్స కుమారుడు): ఎంబీబీయస్ పూర్తిచేసిన బొత్స పుత్రరత్నం వైద్య వృత్తికన్నా ఆదాయానికి రాజకీయాలనే ఆలంబన చేసుకున్నారు. తెరచా టున తండ్రినిపెట్టి`పబ్లిక్‌గా అవినీతి బాగోతాలు నడిపిస్తూ కోట్లు కూడబెట్టాడు. పంచాయితీల దందాలో ఆయన స్పెషలిస్ట్. కోవిడ్‌ను క్యాష్ చేసు కున్న ఏకైక డాక్టర్ పొలిటీషియన్ ఈయనేనేమో.
అనూష(కుమార్తె): తల్లిదండ్రులకు ఏమాత్రం తీసిపోని తనయ అనూష. పబ్లిక్‌దైనా,ప్రయివేట్‌దైనా.. ఖాళీ జాగాలంటే ఆమెకు విపరీతమైన మోజు. కనిపిం చిన జాగా సాయంత్రంకల్లా కబ్జా చేయాలని ఆదేశాలివ్వడం అనూషకే చెల్లు.
బొత్స ఆదినారాయణ (సోదరుడు): రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులను బెదిరిస్తుంటాడు.కాంట్రాక్టర్ల నుం చి కమీషన్లు వసూలుచేస్తుంటాడు.ఇంటా బయటా చాలా వ్యవహారాలు చక్కదిద్దేది ఆదినారాయణే.
చిన్న శీను (మేనల్లుడు): బొత్సకి స్వయాన మేనల్లుడు చిన్న శీను. ఉత్తరాంధ్ర ఇలాకాలో చిన్న శీనుకు పెద్ద సీనుందంటే అది బొత్స చలవే. అతని ఆగ డాలకు అడ్డేలేదు. 1999లో ఎంపీపీ అయినప్పటి నుంచి షాడో ఎమ్మెల్యేగా అరాచకాలకు తెరలేపా డు. కోడికత్తి వ్యవహారంలో కీలకపాత్ర పోషిం చింది ఇతనే. జెడ్పీటీసీ ఛైర్మన్‌గా బాధ్యతలు నిర్వ హిస్తున్న సమయంలో విజయనగరంలో 60ఎక రాల దళితుల భూములను దిగమింగాడు. ఇతని పేరు చెబితే సొంత పార్టీ నేతలే బెదిరిపోతారు. బొత్స ఇలాకాలో ఇతగాడే రాజ్యాంగేతర శక్తి.
బొత్స బొజ్జనిండా…
బొత్స బొజ్జనిండా అవినీతి, అక్రమాలే. లిక్కర్ వ్యాపారాలు, భూకబ్జాలు, అక్రమ మైనింగ్ వ్యవహారా ల్లో వందల కోట్ల రూపాయలు వెనకేసిన బొత్స, ఈ ఐదేళ్లలో అంతకు మూడిరతలు దందాను విస్తృతం చేశాడు. ఉత్తరాంధ్రకు చేసిన సేవ పాతాళంలో చూపి స్తే..స్వార్జితం మాత్రం రిషికొండను తలదన్నేంత. బొత్స భూబాగోతాలు చెప్పాలంటే గ్రంథాలే రాయాలి. విజయ నగరంలో 500ఎకరాలు, విశాఖపట్నంలో 1000 ఎకరాలు, శ్రీకాకుళం జిల్లాలో 500 ఎకరాలు వీరి కుటుంబసభ్యుల ఆధీనంలో ఉన్నాయి. అదీ `విలువైన భూములపైనే బొత్స కుటుంబం కన్ను పడుతుంది. ఉమ్మడి కుటుంబాల మధ్య చిచ్చుపెట్టి మరీ భూకబ్జా లకు పాల్పడటం బొత్స ఫ్యామిలీ స్పెషాలిటీ. రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం రైతుల భూములపై కన్నేశారు. భూములను ఆక్రమించి నామమాత్రపు పరిహారం చెల్లించి వందల ఎకరాలు దిగమింగారు. చెరువులు, స్మశానాలను, ప్రభుత్వ పాఠశాలలనూ వదలకుండా అవినీతికి సరికొత్త నిర్వచనాలు ఇచ్చారు.
మద్యం మాఫియా
2012లో మంత్రి బొత్స సత్యనారాయణ హయాం లో జరిగిన లిక్కర్ కుంభకోణంలో 20మంది మంత్రు లు, 140 మంది ప్రజాప్రతినిధులు, 1500 మందికి పైగా అధికారులు ఉంటే.. ఈ కుంభకోణంలో బొత్స సత్యనారాయణ మాత్రం ప్రత్యేకమైన పాత్ర పోషిం చారు. విజయనగరం జిల్లాలో ఏర్పాటు చేసిన మద్యం దుకాణాల యజమానుల పేర్లను పరిశీలిస్తే వ్యవసాయ కూలీలు, తాపీ మేస్త్రీలు ఉన్న విషయం ఏసీబీ నివేదిక లో బట్టబయలైంది.
విజయనగరం జిల్లాలో 202 మద్యం దుకాణాల్లో 132 దుకాణాలు వైట్ రేషన్ కార్డు దారులవేనని బట్టబయలైంది. నాటినుంచి నేటి వరకు అదే మాఫియాను కొనసాగిస్తున్నారు. విజయనగరం జిల్లాలో బార్‌లన్నీ మంత్రి బొత్స సత్యనారాయణ అను చరులవే. పొరుగు రాష్ట్రంనుంచి అక్రమ మద్యాన్ని దిగు మతి చేసుకుని బెల్టు షాపుల్లో అమ్మే ప్రక్రియను బొత్స కుటుంబీకులే పర్యవేక్షిస్తుంటారు.
బొత్స సత్యనారాయణ కుటుంబ సభ్యులంటేనే అవి నీతి అనకొండలు. కొండల్ని చెరువులుగా మార్చడమే కాదు ఉత్తరాంధ్రలో ఎవరి పేరుమీద మైనింగ్ లీజు వచ్చినా గద్దల్లా వాలిపోయి దాన్ని ఆక్రమించేసుకుంటారు. మాంగనీసు, తెల్లరాయి, ఎర్రమట్టి వంటి విలువైన ఖనిజాలను పెద్దఎత్తున మైనింగ్‌చేసి వందల కోట్లు గడిరచారు.
గరివిడి మండలంలోని సదానందపురం దువ్వం, దేవాడ ప్రాంతాల్లో 700 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న మాంగనీసు ఖనిజాలను బొత్స మేనల్లుడు మజ్జి శీను ఆధ్వర్యంలో మైనింగ్ చేస్తూ ఇతర రాష్ట్రాలకు తరలించి కోట్ల రూపాయలు గడిరచారు.
ప్రతి పనికీ ఓ రేటు
విజయనగరం జిల్లాలో ప్రతి పనికీ ఒక రేటుంటుంది. విజయనగరం మున్సిపల్ కార్పొరేషన్‌లో బొత్స పేరు చెబితే చాలు కాంట్రాక్టర్లు పారిపోతారు. ప్రతి పనిలోను 20 శాతం కమిషన్ అప్పగించాల్సిందే. చేసిన పనులకు బిల్లులు రావాలంటే మరో 10 శాతం అదనం. చెయ్యి తడిపితే ప్రభుత్వ భూమి ప్రైవేటు భూమి అవుతుంది. అటవీ భూమి పట్టా భూమి అవుతుంది. బొత్స కుటుంబసభ్యుల అండదండలతో ప్రతి పనికీ ఒక రేటుపెట్టి కోట్ల రూపాయలు గడిస్తున్నారు.
సబ్‌స్టేషన్ ఉద్యోగాలకు రూ.25 లక్షలు, అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలకు రూ.2కోట్లు, అధికారుల బదిలీ, పోస్టింగుల్లో రూ.5 కోట్లు, కాంట్రాక్టర్ల నుంచి వసూలు రూ.12కోట్లు, కోడిగుడ్లు,చిక్కీ సరఫరా నుంచి రూ.80 లక్షలు, అంగన్‌వాడీ పోస్టుల అమ్మకం రూ.40 లక్షలు, పోలీస్ స్టేషన్‌ల నుంచి మామూళ్లు రూ.3 కోట్లు.
ఏమాటకామాటే చెప్పుకోవాలి. దేశంలోని పేదల్లో వైసీపీ జగన్ ఎంత పేదవాడో.. వెనుకబడిన ఉత్తరాంధ్ర పేదల్లో బొత్స అంత నిరుపేద. కుటుంబం మొత్తం వైట్ రేషన్ కార్డుమీదే బతుకుతుంది. హతవిధీ!!
సెంటు పట్టా పేరుతో రూ.60 కోట్ల కుంభకోణం
సెంటు పట్టా పేరుతో రాష్ట్రవ్యాప్తంగా వైసీపీ నేతలు తక్కువ మొత్తానికి భూములు కొని ఎక్కువ మొత్తానికి ఆ భూములు అమ్మి వందల కోట్లు దిగమింగారు. బొత్స సత్యనారాయణ మాత్రం అందుకు విరుద్ధం. తన భూమినే ప్రభుత్వానికి ఇచ్చి బయట మార్కెట్ కన్నా మూడిరతలు ఎక్కువ పరిహారాన్ని పొందారు. తరువాత వైసీపీ కార్యకర్తలకే ఒక్కొక్కరికీ రూ.50 వేల నుంచి లక్ష రూపాయల చొప్పున ఇళ్ల పట్టాలమ్మి రూ.60 కోట్లు వెనకేశారు. ఇక ఇళ్ల పట్టాల మెరక, చదును కోసమంటూ కోట్లాది రూపాయల ప్రభుత్వ సొమ్ము దిగమింగారు.
లెక్కలేనన్ని ఆస్తులు
బొత్స సత్యనారాయణ ఎన్నికల అఫిడవిట్ చూస్తే మొత్తం ఆస్తులు రూ.8 కోట్ల 23 లక్షలు. అప్పులు కోటి 40 లక్షలు. కానీ అధికారాన్ని అడ్డంపెట్టుకుని వీళ్లు సంపాదించిన ఆస్తులు రూ.6 వేల కోట్లకు పైనే. ఉత్తరాంధ్రలో బొత్స కుటుంబసభ్యులు చెయ్యని వ్యాపారం లేదు. మద్యం, కాంట్రాక్టులు, మైనింగే కాదు కోడిగుడ్ల వ్యాపారం, హౌస్ కీపింగ్ కాంట్రాక్టులు కూడా వీరి అనుచరులే నిర్వహిస్తుంటారు.
విశాఖలో 3థియేటర్లు. విజయనగరం జిల్లాలో 12 థియేటర్లు. విజయనగరం, విశాఖపట్నం, శ్రీకాకుళంలో 15 షాపింగ్ కాంప్లెక్స్‌లు. హైదరాబాద్, ఢల్లీి, బెంగుళూరు, చెన్నైలో రూ.100కోట్ల విలువ చేసే విల్లాలు. ట్రాన్స్‌పోర్ట్ కాంట్రాక్టుల కోసం 60కి పైగా లారీలు. సినిమాల్లో పెట్టుబడులు రూ.300 కోట్లు. దక్షిణాఫ్రికాలో బొగ్గు గనులు. తమిళనాడు, తెలంగాణ, ఢల్లీి, కర్నాటకలో రూ.600కోట్ల విలువైన స్థలాలు. ఇవీ బొత్స కుటుంబ ఆస్తుల్లో పైకికనిపించేవి, ముఖ్యమైనవి.
కబ్జాల పర్వం..
విజయనగరం మండలం గాజులరేగలో 5 ఎకరాల చెరువు కబ్జా. తోటపాలెంలో డీసీయంయస్ స్థలం కబ్జా చేసి కాలేజీ నిర్మాణం. గురునాయుడు మెమోరియల్ ట్రస్ట్ పేరుతో 78 ఎకరాల భూకబ్జా. విజయనగరం కలెక్టరేట్ ఎదుట ఉన్న 3 ఎకరాల భూమి కబ్జా. కాళీమాత ఆలయం దగ్గర 4 ఎకరాల భూమి ఆక్రమణ. గాజువాకలో 40 ఎకరాల భూమికి దొంగ పట్టాల సృష్టి. శ్రీకాకుళం జిల్లాలో 60 ఎకరాల అసైన్డ్ భూమి. భీమిలిలో 80 ఎకరాల పట్టా భూమి కైవశం. ఆనందపురంలో 62 ఎకరాల పేదల భూమిపై పట్టాల సృష్టి. విజయనగరం జిల్లా సత్యసాయినగర్ లేఅవుట్ లోని సర్వే నెం.53`4, 53`5లో బి.రాజేష్, టి.సూర్యనారాయణలకు చెందిన కోట్లాది రూపాయల విలువ చేసే భూమిని బొత్స కుటుంబీకులు బలవంతంగా లాక్కున్నారు.