- పరిశ్రమలు తీసుకువచ్చి ఉపాధి అవకాశాలు కల్పిస్తాం
- అమరావతి అభివృద్ధి ఆగిపోవడానికి ఆర్కేనే కారణం
- బ్రేక్‌ఫాస్ట్ విత్ లోకేష్ కార్యక్రమంలో యువనేత
మంగళగిరి(చైతన్యరథం): రాబోయే ఎన్నికల్లో తమ ను గెలిపిస్తే దేశంలోనే నెం.1గా అమరావతిని తీర్చి దిద్దుతామని యువనేత నారా లోకేష్ పేర్కొన్నారు. ఒకే రాష్ట్రం-ఒకే రాజధాని లక్ష్యంతో చంద్రబాబు అమరా వతిని అభివృద్ధి చేస్తే ఈ ప్రాంత ఎమ్మెల్యే ఆళ్ల రామ కృష్ణారెడ్డి కేసులు వేసి అడ్డుకున్నారని మండిపడ్డారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళగిరి పట్టణం లోని పీఈపీఎల్ శ్రీ బాలాజీ ఫార్చ్యూన్ టవర్స్‌లో బ్రేక్‌ఫాస్ట్ విత్ లోకేష్ కార్యక్రమం ద్వారా అక్కడ నివా సితులను శుక్రవారం లోకేష్ కలుసుకున్నారు. ఈ సం దర్భంగా లోకేష్ మాట్లాడుతూ… 2014లో రాష్ట్ర విభజన ఆంధ్రులు కోరుకున్నది కాదు. రాజకీయాల కోసం అడ్డగోలుగా విభజించారు.ఆరుదశాబ్దాలు కలసి అభివృద్ధి చేసుకున్న హైదరాబాద్‌ను వదలి కట్టుబట్టల తో ఆనాడు బయటకు వచ్చాం.
క్లిష్టపరిస్థితుల్లో సీఎం అయిన చంద్రబాబు అన్నివిధాలా ఆలోచించి అమ రావతిని రాజధానిగా నిర్ణయించారు. ఒకే రాష్ట్రం, ఒకే రాజధాని నినాదంతో ఆనాడు అమరావతిని అందరి ఆమోదంతో రాజధానిగా ఏర్పాటుచేసుకున్నాం. అభి వృద్ధి వికేంద్రీకరణకు పెద్దపీట వేశాం. నాడు ప్రతిపక్ష నేతగా ఉన్న జగన్ కూడా ఆనాడు అమరావతి రాజధా నికి అంగీకరించి 30వేల ఎకరాలు ఉండాలన్నారు. అధికారంలోకి వచ్చాక మాటతప్పి మడమతిప్పి మూడు ముక్కలాట పేరుతో రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారు. అమరావతిలో ఎక్కడి పనులను అక్కడే నిలిపివేశారు. ఉద్యోగాల కోసం మన బిడ్డలు హైదరాబాద్, బెంగుళూ రు, చెన్నయ్ ప్రాంతాలకు వలసవెళ్లాల్సిన దుస్థితి కల్పించారని మండిపడ్డారు. రాష్ట్రప్రజలు ఒక్క ఛాన్స్ మాయలో జగన్‌కు ఓటువేశారు.
వైసీపీ వచ్చిన తర్వాత అమరావతిని విధ్వంసం చేశారు. ఇక్కడ పనులు ఆగి పోవడానికి ఈ ప్రాంత ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డే కారణం. కేసులు వేసి రాజధాని ప్రాంత అభివృద్ధిని అడ్డుకున్నారు. ఒక్క పరిశ్రమ రాలేదు. ఉపాధి కోసం మన ప్రాంత యువత హైదరాబాద్, చెన్నై, బెంగళూరు వెళ్లే పరిస్థితి నెలకొంది. ప్రజాప్రభుత్వం వచ్చాక అమ రావతికి పూర్వవైభవం తీసుకువస్తాం. మన ప్రాంతం లోనే పరిశ్రమలు ఏర్పాటుచేసి పెద్దఎత్తున ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పిస్తాం.
బ్లాక్ డెవలప్‌మెంట్ మోడల్‌తో అభివృద్ధి!
2019 ఎన్నికల్లో 21 రోజుల ముందు నేను మంగ ళగిరికి వచ్చా. 5,350 ఓట్ల తేడాతో ఓడిపోయాను. అప్పటి నుంచి కసి, పట్టుదలతో నియోజకవర్గంలోనే ఉండి పనిచేస్తున్నా. ప్రతిపక్షంలో ఉన్నా సొంత నిధుల తో 29 సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాల ద్వారా ప్రజ లకు చేరువయ్యా. ప్రతిపక్షంలోనే ఇక్కడకు రెండు ఐటీ కంపెనీలు తీసుకువచ్చి 150 మందికి ఉద్యోగాలు కల్పించాం. నన్ను, గుంటూరు లోక్‌సభ అభ్యర్థి పెమ్మ సాని చంద్ర శేఖర్‌ను భారీ మెజార్టీతో గెలిపించాలి. డబుల్ ఇంజన్ లా పనిచేసి మంగళగిరి రూపురేఖలు మారుస్తాం. బ్లాక్ డెవలప్‌మెంట్ విధానంలో రోడ్లు, డ్రైనేజీ, తాగునీరు, పార్క్‌లు వంటి మౌలిక సదుపా యాలు కల్పిస్తాం. అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నిర్మిస్తాం. ప్రతి గడపకు సురక్షితమైన తాగునీరు అందిస్తాం. మం గళగిరి మీదుగా వెళ్లే బస్సులు, రైళ్లు ఇక్కడ ఆగే విధంగా చర్యలు తీసుకుంటాం. మంగళగిరిని గోల్డ్ క్లస్టర్‌గా మారుస్తాం.