అమరావతి (చైతన్య రథం): ఏపీ సార్వత్రిక ఎన్నికల పోలింగ్ రోజున, తర్వాత మాచర్లలో వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఆయన సోదరుడు సృష్టిం చిన అరాచకం అంతా ఇంతా కాదు. పోలింగ్ కేంద్రాల్లోకి చొరబడి పిన్నెల్లి సోదరులు తెలుగుదేశంపార్టీ ఏజెంట్లపై దాడులు, దౌర్జన్యాలకు పాల్పడిన విషయం తెలిసిందే. అయితే టీడీపీ పోలింగ్ ఏజెంట్ నోము ల మాణిక్యాలరావు పిన్నెల్లి చేతిలో తీవ్రంగా గాయపడ్డారు. హైదరాబాద్‌లో టీడీపీ అధినేత నారాచంద్రబాబునాయుడి ను ఆయన నివాసంలో గురువారం మాణి క్యాలరావు కలిశారు. పిన్నెల్లి సోదరుల అరాచకాన్ని బయటపెట్టాక తనకు ప్రాణ హాని ఉందని చంద్రబాబుకు స్వయంగా చెప్పుకున్నారు. పిన్నెల్లి సోదరుల అరాచకా లపై మీడియాతో మాట్లాడటం, పోలీసుల కు ఫిర్యాదు ఇచ్చినప్పటి నుంచి మరింత కక్షగట్టారని చంద్రబాబుకు మాణిక్యాల రావు వివరించారు. ఎమ్మెల్యే, అతని సోదరుడు తనను, తన కుటుంబాన్ని అంత మొందించేందుకు ప్రైవేటు సైన్యాన్ని ఉసి గొల్పుతున్నారని ఆవేదన వ్యక్తం చేశాడు. ప్రాణభయంతో ప్రస్తుతం హైదరాబాద్‌లో తలదాచుకున్నానని చెప్పుకున్నారు. పిన్నెల్లి చేతిలో తనకు ప్రాణహాని ఉందన్న విష యాన్ని ఏపీ డీజీపీ హరీశ్‌కుమార్ గుప్తాకు సైతం మొరపెట్టుకున్నానని మాణిక్యాల రావు వాపోయారు. పార్టీ కోసం మాణిక్యాలరావు చేసిన పోరాటాన్ని చంద్ర బాబు అభినందిస్తూ.. ధైర్యంగా ఉండాలని, ఎలాంటి ఇబ్బంది వచ్చినా పార్టీ అండగా ఉంటుందని చంద్ర బాబు భరోసానిచ్చారు.