- సీఎం చంద్రబాబుతో కీలక సమావేశం
- రెండురోజుల్లో కూటమి అభ్యర్థులను ప్రకటిస్తామని జనసేన నాయకుల ప్రకటన
అమరావతి(చైతన్యరథం): స్థానిక సంస్థల ఎన్నికల్లో సీట్ల సర్దుబాటుకు సంబంధించి కూటమి నేతలు మరోసారి సమావేశమ య్యారు. ఉండవల్లిలో బుధవారం టీడీపీ అధినేత, సీఎం చంద్రబా బు నివాసంలో జరిగిన సమావేశంలో ఏపీ టీడీపీ చీఫ్ పల్లా శ్రీనివాసరావు, మంత్రి నిమ్మల రామానాయుడు, జనసేన నేతలు నాదెండ్ల మనోహర్, లింగమనేని రమేష్, హరిప్రసాద్ పాల్గొన్నారు. జనసేన నాయకులు పొత్తులో భాగంగా కొన్ని ప్రతిపా దనలు తెచ్చారు. చివరగా వారు ఒక ఏకాభిప్రాయానికి వచ్చారు. అనంతరం బీజేపీ రాష్ట్ర చీఫ్ మాధవ్, మంత్రి సత్యకుమార్ కూడా చంద్రబాబుతో సమావేశమయ్యారు. సీట్ల సర్దుబాటుపై వారితో చర్చలు కొనసాగాయి. కాగా సమావేశం ముగిసిన అనంతరం జనసేన ఎమ్మెల్యే -బొలిశెట్టి శ్రీనివాస్ మీడియాతో మాట్లాడుతూ స్థానిక ఎన్నికల్లో కూటమిగానే పోటీ చేస్తామని తెలిపారు. ఇరు పార్టీల మనోభావాలు దెబ్బతినకుండా చూసుకుంటామని చెప్పారు. మా చర్చల్లో ఏకాభిప్రాయం కుదిరింది.. స్థానిక పరిస్థితుల మేరకు ఎవరు ఎక్కడ పోటీ చేయాలో నిర్ణయించుకుంటామని తెలిపారు. ఎన్ని సీట్లలో పోటీ చేయాలో లెక్కలేమీ వేసుకోలేదు.. పోటీ చేసే స్థానాలపై రెండురోజుల్లో ప్రకటన చేస్తామని వివరించారు. మరో భేటీలో సీట్లు ఖాయం చేసుకుంటాం.. కూటమి తరపున అభ్యర్థుల జాబితాప్రకటిస్తామని తెలిపారు.














