అమరావతి: వైసీపీ మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ముందస్తు బెయిల్ పిటిసన్‌పై హైకోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. పిన్నెల్లి బెయిల్ పిటిషన్‌పై హైకోర్టులో గురువారం వాదనలు ముగియటంతో హైకోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. సార్వత్రిక ఎన్నికల్లో మాచర్ల నియోజకవర్గం పాల్వాయ్‌గేట్ పోలింగ్ బూత్‌లో ఈవీఎంను పిన్నెల్లి ధ్వంసం చేసిన సంగతి తెలిసిందే. ఇదొక కేసు కాగా.. హత్యాయత్నంతో పాటు, మరో రెండు కేసులు నమోదయ్యాయి. ఈ కేసులపై ముందస్తు బెయిల్ కోసం పిన్నెల్లి హైకోర్టును ఆశ్రయించారు. జూన్-20 వరకు పిన్నెల్లిని అరెస్ట్ చేయొద్దంటూ గతంలో హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. గడువు ముగియడంతో గురువారం పిన్నెల్లి బెయిల్ పిటిషన్‌పై విచారణ జరిగింది. ఇరువర్గాల వాదనలు విన్న తర్వాత తీర్పును రిజర్వ్ చేసిన హైకోర్టు, తీర్పు వచ్చే వరకు మధ్యంతర ఉత్తర్వులను పొడిగించింది.