- టీడీపీలో చేరిన 15 మంది కార్పొరేటర్లు, నుడా మాజీ ఛైర్మన్
- మరో 50 మంది వైసీపీ నేతలు కూడా..
అమరావతి(చైతన్యరథం): నెల్లూరు నగరంలో వైసీపీ ఖాళీ అయింది. పురపాలక శాఖ మంత్రి పి.నారాయణ నేతృత్వంలో 15 మంది కార్పొరేటర్లు, ఓ కో-ఆప్షన్ సభ్యుడితో పాటు నుడా మాజీ ఛైర్మన్ ముక్కాల ద్వారకానాథ్, 50 మంది వరకు వైసీపీ నేతలు గురువారం మంత్రి నారా లోకేష్ సమక్షంలో టీడీపీలో చేరారు. కార్పొరేటర్లు సంక్రాంతి అశ్విని (3వ డివిజన్), పి.ప్రత్యూష (4వ డివిజన్), ఓ.రవిచంద్ర (5వ డివిజన్), ఎమ్.మస్తానమ్మ (6వ డివిజన్), దామవరపు రాజశేఖర్ (9వ డివిజన్), కిన్నెర ప్రేమ్ కుమార్ (10వ డివిజన్), గోతం అరుణ (11వ డివిజన్), కర్తం ప్రతాప్ రెడ్డి (14వ డివిజన్), జి.వెంకటేశ్వర్ రెడ్డి (15వ డివిజన్), వి.శ్రీకాంత్ రెడ్డి (16వ డివిజన్), పొట్లూరు రామకృష్ణ (47వ డివిజన్), షేక్ ఇంతియాజ్ (48వ డివిజన్), వి.రాజేశ్వరి (49వ డివిజన్), కాయల సాహిత్య (51వ డివిజన్), షేక్ సఫియా బేగం (54వ డివిజన్), కో-ఆప్షన్ మెంబర్ షేక్ జమీర్ టీడీపీలో చేరారు. ఉండవల్లి నివాసంలో వీరందరికీ పసుపు కండువాలు కప్పి మంత్రి నారా లోకేష్ పార్టీలోకి ఆహ్వానించారు.