- మూడువారాల్లోనే రికార్డు స్థాయిలో నమోదు
- రాష్ట్రంలో విజయవంతంగా పథకం అమలు
- అర్హులైన ప్రతిఒక్కరికీ ఉచిత గ్యాస్ సిలిండర్లు
- వైసీపీ తప్పుడు ప్రచారాలను ప్రజలు నమ్మొద్దు
- పౌరసరఫరాల మంత్రి నాదెండ్ల మనోహర్
విజయవాడ(చైతన్యరథం): కుటుంబ జీవన ప్రమాణాలను మెరుగుపరిచే ఉద్దేశం తో రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన దీపం-2 పథకం కింద లబ్ధిపొందిన వారి సంఖ్య మూడువారాల్లోనే 50 లక్షల మైలురాయిని చేరుకోవడం గర్వ కారణమని పౌరసరఫరాల మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు. శుక్రవారం విజయవా డ కృష్ణలంకలోని కోత మిషన్ రోడ్డు ప్రాంతంలో జరిగిన దీపం-2 ప్రత్యేక కార్యక్రమం లో ఆయన పాల్గొని లబ్ధిదారు ఎం.కోటేశ్వరమ్మ, కుటుంబసభ్యులతో ముచ్చటించారు. మంత్రితో పాటు విజయవాడ తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్, పౌరసరఫరాల కార్పొ రేషన్ వీసీ, ఎండీ జి.వీరపాండ్యన్, జిల్లా ఇన్‌చార్జ్ కలెక్టర్ నిధి మీనా, విజయవాడ ఆర్‌డీవో కె.చైతన్య తదితరులు పాల్గొన్నారు. ముందుగా మంత్రి గ్యాస్ స్టవ్‌పై టీ కాచి రుచి చూశారు. ఈ సందర్భంగా ఉచిత గ్యాస్ పొందిన కోటేశ్వరమ్మ మాట్లాడుతూ తమ లాంటి కుటుంబాలకు ఏడాదికి మూడు సిలిండర్లు ఉచితంగా అందిస్తే ఒక్కో కుటుం బానికి ఏడాదికి రూ.2,476.50 ప్రయోజనం లభిస్తుందని తెలిపారు.
ఇలాంటి సంక్షేమ, అభివృద్ధి పథకాల వల్ల పిల్లలను బాగా చదివించుకోగలుగుతున్నామని ఆనందం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ దీపావళి పండుగ రోజు ప్రతి మహిళ కళ్లలో ఆనం దం నింపేందుకు ఏడాదికి మూడు గ్యాస్ సిలిండర్లను ఉచితంగా అందించే దీపం-2 పథకాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రారంభించారని తెలిపారు. 1999లో దేశంలోనే మొదటిసారిగా మహిళల ఆరోగ్య భద్రత గురించి ఆలోచించి కట్టెల పొయ్యి పొగతో అనారోగ్య సమస్యలు వస్తాయనే ఉద్దేశంతో దీపం పథకాన్ని చంద్రబాబు ప్రారంభించారని వివరించారు. ప్రతిపక్షాలు, జగన్‌రెడ్డి కావాలనే పథకంపై దుష్ప్రచా రం చేస్తున్నారని, గ్యాస్ కనెక్షన్ల సంఖ్యపై కూడా అవగాహన లేకుండా కోటి 85 లక్షలు అంటూ ఇష్టమొ చ్చినట్లు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. మూడు గ్యాస్ కంపెనీలు అందించిన సమా చారం మేరకు రాష్ట్రంలో 1,55,00,200 గ్యాస్ కనెక్షన్లు ఉన్నాయని వివరించారు. ఇంత పెద్ద కార్యక్రమానికి సంబంధించి ఇప్పటివరకు కేవలం 521 ఫిర్యాదులు మాత్రమే అందడం కార్యక్రమం అమల్లో పారదర్శకత, నిజాయితీకి నిదర్శ నమని పేర్కొన్నారు. మరింత మెరుగైన సేవలందించే విధంగా స్థానిక గ్యాస్ కంపెనీలు, ప్రజాప్రతినిధులను సమన్వయం చేసుకుంటూ ముందుకెళుతున్నామని తెలిపారు.
అత్యంత పారదర్శకంగా పథకం అమలు: ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్
కట్టెల పొయ్యితో వంట చేస్తూ మహిళలు పడుతున్న ఇబ్బందులను గుర్తించి నాడు సీఎంగా ఉన్న చంద్రబాబు దీపం పథకాన్ని తీసుకొచ్చారు. ఇప్పుడు దీపం -2 పథకం ద్వారా 21 రోజుల్లోనే 50 లక్షల మందికి లబ్ధి చేకూరడం సంతోషంగా ఉంది. అతి తక్కువ ఫిర్యాదులు నమోదు కావడం ఈ పథకం అమలు పారదర్శకతకు నిదర్శనం.