- ప్రాజెక్టును గాలికొదలటం వల్లే డయాఫ్రమ్ వాల్ దెబ్బతింది
- 41.15 మీటర్లకు ఎత్తుకు కేంద్రానికి ప్రతిపాదనలు పంపారు
- ఇప్పుడు ఎత్తు తగ్గించామని కట్టుకథలతో దుష్ప్రచారం చేస్తున్నారు
- జనవరి నుంచి డయాఫ్రమ్ వాల్ నిర్మాణాన్ని ప్రారంభిస్తాం
- సమాంతరంగా ఈసీఆర్‌ఎఫ్ పనులు చేపట్టి ప్రాజెక్టు పూర్తిచేస్తాం
- మండలిలో సభ్యుల ప్రశ్నలకు మంత్రి నిమ్మల సమాధానం
అమరావతి(చైతన్యరథం): పోలవరం ప్రాజెక్ట్ పనుల పురోగతి, ఎత్తు తగింపుపై శాసనమండలిలో సభ్యుల ప్రశ్నలకు మంత్రి నిమ్మల రామానాయుడు సమాధానమిచ్చా రు. 2014-19 గత టీడీపీ పాలనలో రూ.11,762 కోట్లు ఖర్చుపెట్టి 72 శాతానికి పైగా పనులు పూర్తి చేశామని తెలిపారు. 2019-24 వైసీపీ పాలనలో కేవలం రూ.4 వేల కోట్లు మాత్రమే ఖర్చు పెట్టి 3 శాతం పనులు జరిగినట్లు రికార్డుల్లో చూపించారు.. గత టీడీపీ పాలనలో పోలవరం ఆర్‌అండ్‌ఆర్ కాలనీల నిర్మాణాలకు రూ.4144 కోట్లు ఖర్చు చేస్తే వైసీపీ పాలనలో ఒక్క అర్‌అండ్‌ఆర్ కాలనీ కూడా పూర్తి చేయలేదని తెలిపా రు. అధికారంలోకి వచ్చిన 15 నెలల వరకు ఏ పనులూ చేయకుండా డయాఫ్రమ్ వాల్‌ను పట్టించుకోకుండా విధ్వంసం చేశారని మండిపడ్డారు. 2020లో వచ్చిన వరదల తో డయాఫ్రమ్ వాల్ దెబ్బతిన్నదని ఐఐటీ హైదరాబాద్ నిపుణులే చెప్పారు.. డయాఫ్రమ్ వాల్ దెబ్బతినడంతో ప్రాజెక్ట్ 20 ఏళ్లు వెనక్కి వెళ్లడంతో పాటు కొత్తగా వాల్ నిర్మాణానికి మరో రూ.1000 కోట్లు కానుందన్నారు. గత ప్రభుత్వమే స్టేజ్-1, స్టేజ్-2 అంటూ ప్రాజెక్ట్ ఎత్తు 41.15 మీటర్లకు ఒప్పుకుంటూ కేంద్రానికి ప్రతిపాదనలు పంపిన విషయా న్ని గుర్తు చేశారు.
2023 మార్చిలో వైసీపీ ప్రభుత్వం 41.15 మీటర్ల ఎత్తుకు లోబడి రూ.36,449 కోట్ల రివైజ్ కాస్ట్‌తో కమిటీ ప్రతిపాదనలు కేంద్రానికి పంపిందన్నారు. నాడు ఏపీ ప్రభుత్వం భాగస్వామ్యంగా ఉన్న పీఐబీ అవే ప్రతిపాదనలు 2024 ఫిబ్రవరి 29న ఆమోదించి కేంద్రానికి సిఫారసు చేస్తే ఇప్పుడు తమపై ఎత్తు తగ్గించామని కట్టుకథలతో దుష్ప్రచారం చేస్తున్నారు. ఎన్డీయే ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టును పూర్తిస్థా యిలో 45.72 మీటర్ల ఎత్తులో నీటిని నిల్వ చేసేందుకు కట్టుబడి ఉందన్నారు. అధికా రంలోకి రాగానే ఐదు రోజులకే ముఖ్యమంత్రి చంద్రబాబు పోలవరం సందర్శించారంటే ప్రాజెక్టుకు ఎంత ప్రాధాన్యత ఇస్తున్నారో గమనించాలని హితవుపలికారు. గత ఐదేళ్ల వైసీపీ పాలనలో కేంద్రం రూ.8,382 కోట్లు రీయింబర్స్ చేస్తే 3,385 కోట్లు ప్రాజెక్టుకు ఖర్చుపెట్టకుండా దారి మళ్ళించిన దుర్మార్గ ప్రభుత్వం జగన్‌రెడ్డి ప్రభుత్వమని ధ్వజమె త్తారు. ముఖ్యమంత్రి చంద్రబాబు కేంద్రంతో సంప్రదింపులు చేసి రూ.12,250 కోట్లు నిధులు తీసుకువచ్చారని, వచ్చే జనవరి నుంచి డయా ఫ్రమ్‌వాల్ పనులు మొదలు పెట్టి సమాంతరంగా ఈసీఆర్‌ఎఫ్ పనులు చేపట్టి ప్రాజెక్ట్‌ను త్వరితగతిన పూర్తిచేస్తామని స్పష్టం చేశారు. ఈ వారంలోనే చంద్రబాబు పోలవరం ప్రాజెక్ట్‌ను సందర్శించి వర్క్ షెడ్యూల్ విడుదల చేస్తారని వివరించారు.