అమరావతి (చైతన్యరథం): గత ఐదు సంవత్సరాల వైసీపీ పాలనలో తెలుగుదేశం పార్టీ శ్రేణుల్ని పోలీసులు అక్రమ కేసులతో ఎంతగా వేధించినా కార్యకర్తలు ధైర్యంగా.. బలంగా నిలబడ్డారని మంత్రి నారా లోకేష్ అన్నారు. వైసీపీ నేతలు, కార్యకర్తలు సోషల్ మీడియాలో పెట్టిన అసభ్య పోస్టులపై ఇప్పుడు పోలీసులు చిన్న నోటీసులు ఇస్తున్నా ఆ పార్టీ నేతలు రాజకీయ సన్యాసం అంటున్నారని ఎద్దేవా చేశారు. శుక్రవారం మంత్రి అసెంబ్లీ లాబీలో మీడియాతో చిట్ చాట్‌గా మాట్లాడారు. ఆనాడు తెలుగుదేశం శ్రేణులు తప్పుచేయలేదు కాబట్టే అక్రమ కేసుల్ని ధైర్యంగా ఎదుర్కొంటూ పోరాటం చేశారన్నారు. వైసీపీ శ్రేణులు తప్పు చేసి అడ్డంగా దొరికారు కాబట్టే క్షమాపణలు, రాజకీయ సన్యాసాలు అంటున్నారని..ప్రభుత్వం కూడా తప్పు చేసిన ఏ ఒక్కరినీ వదలబోదని మంత్రి లోకేష్ స్పష్టం చేశారు. సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెట్టినవారిపై ప్రభుత్వం సీరియస్‌గా ఉందన్నారు.
అనంతరం పలువురు ఎమ్మెల్యేలతో మంత్రి లోకేష్ చర్చించారు. జాగ్రత్తగా పని చేయాలనే గురుతర బాధ్యతలను ఇస్తూ అత్యధిక మెజారిటీతో ప్రజలు మనల్ని గెలిపించారన్నారు. ఎమ్మెల్యేల వినతులపై లోకేష్ స్వయంగా స్టేటస్ రిపోర్ట్ ఇచ్చారు. ఎమ్మెల్యేలు తనకు ఇచ్చిన వినతుల్లో ఎన్ని పరిష్కారమయ్యాయి.. కాకపోతే అందుకు గల కారణాలు వివరిస్తూ స్టేటస్ రిపోర్ట్ ఇచ్చారు. కేంద్ర మంత్రులకు వినతిపత్రం ఇస్తే వారు సమాధానం ఇస్తున్న విధానాన్ని ఇక్కడా అమలు చేస్తున్నామని వెల్లడిరచారు. రానున్న రోజుల్లో ఈ విధానాన్ని మరింత పటిష్టం చేస్తామన్నారు.