- బీసీ కులాల అభివృద్ధికి ప్రత్యేక కార్పొరేషన్లే నిదర్శనం
- అగ్నికుల క్షత్రియ కార్పొరేషన్ ఏర్పాటు శుభపరిణామం
- సీఎం చంద్రబాబు, పవన్‌కళ్యాణ్ వెన్నుదన్నుగా ఉన్నారు
- గత ప్రభుత్వ హయాంలో ఓటు బ్యాంకుగానే చూశారు
- అగ్నికుల క్షత్రియ కార్పొరేషన్ చైర్మన్‌గా పాపారావు బాధ్యతలు
విజయవాడ(చైతన్యరథం): రాష్ట్ర బడ్జెట్‌లో 2024-25 ఏడాదికి బీసీ సంక్షేమానికి కూటమి ప్రభుత్వం రూ.39,007 కోట్లు కేటాయించడం జరిగిందని ఎక్సైజ్, మైన్స్ జియాలజీ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. బుధవారం విజయవాడలోని గొల్లపూ డి బీసీ సంక్షేమ భవనంలో రాష్ట్ర అగ్నికుల క్షత్రియ వెల్ఫేర్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్‌గా చిలకలపూడి పాపారావు బాధ్యతలు స్వీకరణ కార్యక్రమానికి మంత్రితో పాటు ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్, మాజీ రాజ్యసభ సభ్యులు మోపిదేవి వెంకట రమణ ముఖ్యఅతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి కొల్లు రవీంద్ర మాట్లా డుతూ ఎన్నికల ముందు ప్రకటించిన బీసీ డిక్లరేషన్‌లో పేర్కొన్న అన్ని అంశాలనూ అమ లుచేయడానికి సీఎం చంద్రబాబు కృతనిశ్చయంతో ఉన్నారన్నారు. ఇందులో భాగంగా 15 మంది కార్యవర్గ సభ్యులతో అగ్నికుల క్షత్రియ కార్పొరేషన్ ఏర్పాటు చేయడం శుభపరిణామమన్నారు.
తొలి నుంచి అగ్నికుల క్షత్రియులకు చంద్రబాబు, పవన్‌కళ్యాణ్ వెన్నుదన్నుగా నిలుస్తున్నారన్నారు. 2014-19 ప్రభుత్వ కాలంలోనే కార్పొరేషన్ల ఏర్పాటు కు చర్యలు తీసుకోవడం జరిగిందని, వాటికి నిధులు కూడా కేటాయించడం జరిగిందని గుర్తు చేశారు. అయితే 2019లో ప్రభుత్వం మారడంతో కార్పొరేషన్లను నిర్వీర్యం చేయ డమే గాక ఒక్క రూపాయి నిధులు కూడా వాటికి కేటాయించలేదన్నారు. బీసీ నేతగా ఉన్న నన్ను గత ప్రభుత్వం చేయని తప్పుకు అక్రమ కేసులో ఇరికించి 54 రోజులపాటు జైల్లో పెట్టి బాధపెట్టిందని ఆవేదన వ్యక్తం చేశారు. కానీ కూటమి ప్రభుత్వంలో బీసీలకు మంచిరోజులు వచ్చాయన్నారు. తాజాగా బడ్జెట్‌లో బీసీ వెల్ఫేర్‌కు రూ.39 వేల కోట్లు కేటాయించడం జరిగిందని, వాటిని తగిన విధంగా కార్పొరేషన్లకు ఇవ్వడం జరుగుతుం దన్నారు. అగ్నికుల క్షత్రియ వెల్ఫేర్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టిన చిలకలపూడి పాపారావు పదవికి మరింత వన్నె తెచ్చి భవిష్యత్‌లో మరిన్ని ఉన్నత పదవులు అధిరోహించాలని ఆకాంక్షించారు.
గత ప్రభుత్వం నిధులు కేటాయించలేదు
ప్రభుత్వ విప్, శాసనసభ్యులు బొమ్మిడి నాయకర్ మాట్లాడుతూ గత ప్రభుత్వంలో బీసీలకు కార్పొరేషన్లు ఏర్పాటు చేసినా నిధులు మాత్రం కేటాయించలేదన్నారు. కార్పొరేషన్ల పేరుతో కుర్చీలయితే ఇచ్చారు కానీ డబ్బులు మాత్రం ఇవ్వలేదని ఎద్దేవా చేశారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌కళ్యాణ్ నాయకత్వంలో బీసీ సామాజిక వర్గాలకు తప్పక న్యాయం జరుగుతుందని స్పష్టం చేశారు. అగ్నికుల క్షత్రియుడినైన తనకు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి 50 వేల మెజార్టీతో గెలిపించి అసెంబ్లీకి పంపించిన ఘనత పవన్‌కళ్యాణ్‌కే దక్కుతుందన్నారు. మాజీ రాజ్యసభసభ్యులు మోపిదేవి వెంకటరమణ మాట్లాడుతూ టీడీపీ, బీజేపీ, జనసేన ప్రభుత్వం బీసీలకు న్యాయం జరుగుతోందన్నారు. ఈ ప్రభుత్వంలో పదవీ బాధ్యతలు చేపడుతున్న బీసీ నాయకులంతా బాధ్యతతో పనిచేసి రాబోయే రోజుల్లో ఉన్నతస్థాయికి చేరాలని ఆకాంక్షించారు.
అగ్నికుల క్షత్రియ కార్పొరేషన్ ఆనందంగా ఉంది
రాష్ట్ర అగ్నికుల క్షత్రియ వెల్ఫేర్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్ చిలకలపూడి పాపారావు మాట్లాడుతూ వివిధ జిల్లాలకు చెందిన 15 మంది కార్యవర్గ సభ్యులతో అగ్నికుల క్షత్రియ కార్పొరేషన్ ఏర్పాటు చేయడం ఆనందంగా ఉందన్నారు. తనను నమ్మి ఈ బాధ్యతలు అప్పగించిన ఉప ముఖ్యమంత్రి పవన్‌కళ్యాణ్‌కు జీవితాంతం రుణపడి ఉంటానన్నారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌కళ్యాణ్, మంత్రి లోకేష్ సలహా లు, సూచనలకు తగ్గట్టుగా నడుచుకుని అగ్నికుల క్షత్రియుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని స్పష్టం చేశారు. త్వరలో రాష్ట్రవ్యాప్తంగా పర్యటించి వెనుకబడిన వర్గాల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళతానన్నారు. అగ్నికుల క్షత్రియుల్లో వివిధ వృత్తులు పాటిస్తున్న వారు ఉన్నారని, గంగపుత్రులకు మేలు చేసేలా చర్యలు చేపడతా మని వెల్లడిరచారు. ముందుగా బీసీ వెల్ఫేర్ డిపార్ట్‌మెంట్ జేఎండీ ఉమాదేవి కార్పొరేషన్ చైర్మన్, డైరెక్టర్లతో ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమంలో కూటమి పార్టీల నాయకులు, అభిమానులు, అగ్నికుల క్షత్రియ సంఘాల నాయకులు, బీసీ నేతలు, బీసీ వెల్ఫేర్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.