- పాల్గొన్న వర్ల, మంత్రులు మండిపల్లి, గొట్టిపాటి
- సీఎం సముచిత స్థానం కల్పించారని అభినందన
- కుట్టు శిక్షణ పూర్తి చేసుకున్న మహిళలకు సర్టిఫికెట్లు
- తుమ్మలపల్లి క్షేత్రయ్య కళాక్షేత్రంలో కార్యక్రమం
విజయవాడ(చైతన్యరథం): ఏపీ ఖాదీ గ్రామీణ పరిశ్రమల బోర్డ్ చైర్మన్‌గా కె.కె.చౌద రి బుధవారం బాధ్యతలు స్వీకరించారు. తుమ్మలపల్లి క్షేత్రయ్య కళాక్షేత్రంలో జరిగిన ఈ కార్యక్రమంలో రవాణా, యువజన, క్రీడా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్‌రెడ్డి, విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్, పొలిట్‌బ్యూరో సభ్యులు వర్ల రామయ్య హాజరై కె.కె.చౌదరిని అభినందించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి మండిపల్లి మాట్లాడుతూ అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరుకు చెందిన కె.కె.చౌదరి రాష్ట్ర తెలుగు యువత ఉపాధ్యక్షుడిగా ఘనమైన సేవలు అందించిన ఆయనకు సీఎం చంద్ర బాబు సముచిత స్థానం కల్పించడం హర్షణీయమన్నారు. అనంతరం కె.కె.చౌదరిని ఘనంగా సత్కరించారు. తర్వాత కుట్టు శిక్షణ పూర్తి చేసుకున్న పలువురు గ్రామీణ మహి ళలకు సర్టిఫికెట్లు అందజేశారు.