- అమరావతి పనులకు టెండర్లు పిలిచేందుకు సీఆర్డీఏ ఓకే
- సీఎం చంద్రబాబు అథ్యక్షతన 41వ సీఆర్డీఏ అథారిటీ భేటీ
- భవనాలు, రోడ్లు, మౌలిక వసతులు చేపట్టేందుకు అనుమతులు
- హామీ ఇచ్చిన విధంగా మూడేళ్లలో అమరావతి పూర్తి
- నిర్ణయాలను మీడియాకు వెల్లడిరచిన మంత్రి నారాయణ
అమరావతి: రాజధాని అమరావతిలో రూ.11,467 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టబోతున్నట్లు మంత్రి నారాయణ తెలిపారు. ఈమేరకు సీఆర్డీఏ అథారిటీ అనుమతించిందన్నారు. సీఎం చంద్రబాబు అధ్యక్షతన సీఆర్డీఏ 41వ అథారిటీ సమావేశం సోమవారం జరిగింది. మొత్తం 23 అంశాల అజెండాగా ఉండవల్లిలోని చంద్రబాబు నివాసంలో జరిగిన భేటీకి మంత్రి నారాయణ హాజరయ్యారు. భేటీ అనంతరం ఆయన మాట్లాడుతూ.. రూ.2,498 కోట్లతో రహదారి పనులు, రూ.1508 కోట్లతో పాలవాగు, కొండవీటి వాగు చేపట్టనున్నట్టు తెలిపారు. మూడు రిజర్వాయర్ల నిర్మాణానికి, సీఆర్డీఏ పరిధిలో రూ.3.523 కోట్లతో భవనాల నిర్మాణానికి సీఆర్డీఏ అథారిటీ అనుమతించిందన్నారు. రాజధానిలో గెజిటెట్, నాన్ గెజిటెడ్ అధికారులు, సెక్రెటరీలు, ప్రిన్సిపల్ సెక్రెటరీలకు భవనాల నిర్మాణం చేపడతామన్నారు. ఐదు ఐకానిక్ టవర్లకు ఈనెల 15లోపు డిజైన్లు వస్తాయన్న మంత్రి.. నెలాఖరులోపు డిజైన్లు ఆమోదం పొందితే టెండర్లు పిలుస్తామన్నారు. రాజధాని విషయంలో పలు కమిటీలు వేసి నివేదికల ఆధారంగా ముందుకెళ్తున్నామన్నారు. రైతులకు ఇచ్చిన రిటర్నబుల్ లేఅవుట్‌లలో రోడ్లు, మౌళిక వసతుల కల్పనకు రూ.3859 కోట్లకు అనుమతి ఇచ్చినట్టు మంత్రి వివరించారు. వీటితోపాటు హ్యాపీనెస్ట్ ప్రాజెక్ట్‌కు అధారిటీ ఆమోదం తెలిపిందన్నారు. ఆయా పనులకు వెంటనే టెండర్లు పిలిచి జనవరి నుంచి పనులు ప్రారంభిస్తామన్నారు.
ఇక అమరావతి గవర్నమెంట్ కాంప్లెక్స్‌లోని ఐదు ఐకానిక్ టవర్లు, అసెంబ్లీ, హైకోర్టు భవనాల డిజైన్లకు ఇప్పటికే టెండర్లు పిలిచామని.., ఈనెల 15నాటికి డిజైన్ల టెండర్లు పూర్తవుతాయన్నారు. డిసెంబర్ నెలాఖరుకు ఆయా భవనాల నిర్మాణాలకు కూడా టెండర్లు పిలుస్తామన్నారు. సీఎం చంద్రబాబు పిలుపుతో కేవలం 58 రోజుల్లో రైతులు 34 వేల ఎకరాల భూమిని స్వచ్చందంగా ఇచ్చారని.. .అలాంటి రైతులను గత ప్రభుత్వం అనేక రకాలుగా ఇబ్బంది పెట్టిందన్నారు. ఆడవారిని కూడా చూడకుండా హింసించారని, అసలు రాజధాని అమరావతిలో ఉండకూడదని ప్రయత్నం చేశారన్నారు.
అథారిటీ ఆమోదించిన మొత్తం 23 అంశాలు…
1.సాంకేతిక కమిటీ ఇచ్చిన నివేదిక ప్రకారం కాంట్రాక్ట్ ఏజెన్సీలతో ఒప్పందాలు రద్దు చేసుకున్నప్పటి నుంచి 120 రోజుల్లోగా పెండిరగ్ బిల్లులు చెల్లించేందుకు అథారిటీ ఆమోదం. సాంకేతిక కమిటీకి ప్రభుత్వం ఆమోదం తెలుపుతూ నవంబర్ 27న జీవో ఎంఎస్ 123 విడుదల.
2. అమరావతి గవర్నమెంట్ కాంప్లెక్స్‌లో భాగంగా మధ్యలో నిలిచిపోయిన గెజిటెడ్ ఆఫీసర్స్ టైప్ – 1, టైప్ -2, క్లాస్ 4 ఉద్యోగుల అపార్ట్‌మెంట్స్ పూర్తికి 594.54 కోట్లకు అథారిటీ ఆమోదం.
3. గెజిటెడ్ ఆఫీసర్స్ టైప్ -1, టైప్ -2, క్లాస్ -4 ఉద్యోగుల క్వార్టర్ల వద్ద మౌలిక వసతుల కల్పనపనులను 226.26 కోట్లతో చేపట్టేందుకు అథారిటీ ఆమోదం.
తాగునీరు, అండర్ గ్రౌండ్ డ్రైనేజి, వరదనీటి కాల్వ పనులు, వీధి దీపాలు, అంతర్గత రహదారులు, బిల్డింగ్ సెక్యూరిటీ, ల్యాండ్ స్కేపింగ్ పనులను చేపట్టేందుకు 2018 డిసెంబర్ 18న 121.34 కోట్లకు అథారిటీ ఆమోదం తెలిపింది..మార్చి 2019 లో పనులు ప్రారంభం అయ్యాయి..జూన్ 2019 లో నిలిచిపోయాయి..తిరిగి కాంట్రాక్ట్ ఏజెన్సీకి రెండేళ్ల (%ణూ(ణజుఖీజుజు ూIAదీIూIు్ ూజుRIూణ%)తో పనులు చేపట్టేలా ఇచ్చేందుకు నిర్ణయం.
4. నాన్ గెజిటెడ్ ఆఫీసర్ల ఇళ్లకు మిగిలిన పనులను 607.50 కోట్లతో చేపట్టడానికి అథారిటీ ఆమోదం. మొత్తం 1140 ఫ్లాట్లు 12 టవర్లలో సిల్ట్ ప్లస్ 12 అంతస్తులతో నిర్మాణం.
5. నాన్ గెజిటెడ్ ఆఫీసర్ల ఇళ్లకు మిగిలిన పనులు, మౌలిక వసతులను 594.36 కోట్లతో చేపట్టేందుకు అథారిటీ ఆమోదం. మొత్తం 9 టవర్లు, సిల్ట్ ప్లస్ 12 అంతస్థులుతో మొత్తం 855 ఫ్లాట్లు నిర్మాణం.
6.ఆలిండియా సర్వీస్ అధికారులు (ముఖ్య కార్యదర్శులు, కార్యదర్శులు)కు 115 బంగ్లాల పెండిరగ్ పనులను 516.6 కోట్లతో చేపట్టేందుకు అథారిటీ ఆమోదం.
7. 13 -ఎల్పీఎస్ జోన్లలో మొత్తం 8496.30 ఎకరాల్లో మౌలిక వసతులను రూ.3859.66 కోట్లతో చేపట్టేందుకు అధారిటీ ఆమోదం.
8. అమరావతిలో హ్యాపీ నెస్ట్ ప్రాజెక్ట్ చేపట్టేందుకు సవరించిన అంచనాలకు (984.10 కోట్లకు) ఆమోదం. కొత్తగా టెండర్లు పిలిచేందుకు అనుమతి, ప్రాజెక్ట్ ఆలస్యంతో నష్టపోయిన 270.71 కోట్లు ప్రభుత్వం చెల్లించేందుకు అనుమతి.
9. అమరావతి డెవలప్‌మెంట్ కార్పొరేషన్ గతంలో ఇచ్చిన కాంట్రాక్ట్‌లు ప్యాకేజి 1నుంచి ప్యాకేజి 22 వరకూ, సీడ్ యాక్సిస్ రోడ్డుకు సంబంధించిన ప్యాకేజీల రద్దుకు అథారిటీ ఆమోదం.
10. కేపిటల్ సిటీలో ఎన్ -9 రోడ్డుకు ప్యాకేజీ 4 కింద మిగిలిపోయిన మౌలిక వసతుల కల్పన కోసం రూ.522.39 కోట్లకు పాలనాపరమైన అనుమతులు మంజూరుకు అథారిటీ ఆమోదం.
11. కేపిటల్ సిటీలో ఎన్ -18 రోడ్డుకు ప్యాకేజీ -5 కింద మిగిలిపోయిన మౌలిక వసతులు కల్పించేందుఉ 98.17 కోట్లకు ఆమోదం.
12. కేపిటల్ సిటీలో ఎన్ -15 రోడ్డుకు ప్యాకేజీ -6 కింద మిగిలిపోయిన మౌలిక వసతులు కల్పించేందుకు 482.01 కోట్లకు ఆమోదం.
13. కేపిటల్ సిటీలో %జు%6 రోడ్డుకు ప్యాకేజి – 7 కింద మిగిలిపోయిన నిర్మాణ పనులమౌళిక వసతులు కల్పించేందుకు 452.96 కోట్లకు ఆమోదం.
14. కేపిటల్ సిటీలో ఎన్`8 రోడ్డుకు ప్యాకేజి -8 కింద మిగిలిపోయిన నిర్మాణ పనుల మౌలిక వసతులు కల్పించేందుకు 522.92 కోట్లకు ఆమోదం.
15. కేపిటల్ సిటీలో ఎన్`11 రోడ్డుకు ప్యాకేజి -9 కింద మిగిలిపోయిన నిర్మాణ పనుల మౌలిక వసతులు కల్పించేందుకు 419.85 కోట్లకు ఆమోదం.
16. అమరావతిలో ట్రండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, వరద నీటి యాజమాన్యం, గ్రీనరీ వర్క్స్‌కు సంబంధించి ప్రాజెక్ట్ మేనేజ్‌మెంట్ కన్సల్టెంట్ నియామకానికి అథారిటీ ఆమోదం.