- ప్రశ్నించిన బాధితులకు బెదిరింపులు
- ప్రజావినతుల్లో హోంమంత్రి అనితకు ఫిర్యాదు
- దాడులు, భూ కబ్జాలపై గ్రీవెన్స్‌లో వెల్లువెత్తిన అర్జీలు
- వైసీపీ మూకల అరాచకాలపై చర్యలు తీసుకోవాలని వినతులు
అమరావతి(చైతన్యరథం): తన కుమార్తెకు కట్నం కింద ఇచ్చిన 7 సెంట్ల భూమిని ఎన్.మధుసూదన్ అనే వ్యక్తి కబ్జా చేసి సీఐ శ్రీరామ్ ప్రధాన అనుచరుడు బినామీ అయిన మేరవ నారాయణ అనే వ్యక్తిపై రిజిస్ట్రేషన్ చేయించుకున్నారని కర్నూలు జిల్లా ఆత్మకూరు గ్రామం దళితవాడకు చెందిన ఎస్.ఎస్.ఎస్.రత్నం గ్రీవెన్స్‌లో ఫిర్యాదు చేశారు. స్థలం మాది అని అడిగినందుకు సీఐ శ్రీరామ్ నేను పయ్యావుల కేశవ్‌నే ఎదురించిన వాడిని మర్యాదగా స్థలం వదులుకోండి అని బెదిరిస్తున్నాడని ఆవేదన వ్యక్తం చేశారు. వారి దౌర్జ న్యాలకు అడ్డుకట్ట వేసి తమకు న్యాయం చేయవాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. గురువారం టీడీపీ కేంద్ర కార్యాలయంలో జరిగిన ప్రజా వినతుల కార్యక్రమానికి ఎక్కువగా భూ కబ్జాలు, వైసీపీ అరాచకాలపైనే ఫిర్యాదులు వచ్చాయి. టీడీపీ కేంద్ర కార్యాలయంలో హోం మంత్రి అనిత, ఎమ్మల్సీ దువ్వాడపు రామారావు, డూండీ రాకేష్‌లు అర్జీలు స్వీకరించారు. అధికారులతో మాట్లాడి వెంటనే అర్జీలను పరిష్కరించేలా చూడాలని ఆదేశించారు.
` తమ ప్రాంతంలో గత కొన్ని సంవత్సరాల నుంచి వృభిచారం, గంజాయి తదితర చట్టవ్యతిరేకమైన అసాంఘిక కార్యక్రమాలు జరుగుతున్నాయని గుంటూరు నగరం కొత్తపేట, ప్రకాష్‌నగర్ ప్రాంతానికి చెందిన గుంజి అంకబాబు ఫిర్యాదు చేశారు. దాని ఫలితంగా పిల్లలు, యువకులు గంజాయికి, వ్యభిచార వృత్తికి అలవాటు పడుతున్నారు. ఆసాంఘిక కార్యక్రమాలపై దృష్టిపెట్టి విముక్తి కలిగించాలని విజ్ఞప్తి చేశాడు.
` తమ పూర్వీకులు ఇచ్చిన స్థలాన్ని కొంతమంది కబ్జా చేశారని తిరుపతి జిల్లా తుమ్మలగుంట గ్రామానికి చెందిన ఎస్.సరస్వతి ఫిర్యాదు చేసింది. కబ్జాదారుల నుంచి తమ స్థలం విడిపించాలని వినతిపత్రం అందజేశారు.
` తమకు వారసత్వంగా వచ్చిన భూమిని కబ్జా చేసి గోపాల్, వెంకటేశ్వర్లు అనే వ్యక్తులు రిజిస్ట్రేషన్ చేయించుకుని తిరిగి తమపైనే బైండోవర్ కేసులు పెట్టి వేధిస్తున్నా రని అనంతపురం జిల్లా గుంతకల్ మండలం తిమ్మాపురం గ్రామానికి చెందిన వైద్యుడు ఎస్.మాధవరావు వాపోయాడు. భూమిని విడిపించి వారిపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేశారు.
` చిత్తూరు దామరపాకానికి చెందిన దివ్యాంగుడు ఎన్.చిరంజీవి సమస్యను వివరి స్తూ తనకు రూ.3 వేల పింఛన్ వస్తుంది..కానీ వాస్తవం నేను 90 శాతం అంగవైక్యలం కలిగి ఉన్నానని నిమ్స్ హాస్పటల్ సదరం సర్టిఫికెట్ ఇచ్చారు. కూటమి ప్రభుత్వం కల్పిస్తు న్న రూ.6 వేల పింఛన్ ఇప్పించాలని విన్నవించుకున్నారు.
` చిత్తూరు జిల్లా నగరి మండలం దామరపానికి చెందిన నారాయణశెట్టి సమస్యను వివరిస్తూ తన తండ్రి పేరిట ఉన్న 1.56 సెంట్ల భూమిని అదే గ్రామానికి చెందిన జి.లీలారామ్ ఆక్రమించాడని ఫిర్యాదు చేశాడు. తమ భూమిని తమకు వచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు.
` ప్రకాశం జిల్లా వెలిగండ్ల మండలం కోటాలపల్లిలో ఎంపీపీ స్కూల్ ఆట స్థలా న్ని వైసీపీ నాయకులైన పొట్లూరి పోలయ్య, మాదిరెడ్డి మాలకొండయ్య ఆక్రమించి విద్యా ర్థులకు ఆట స్థలం లేకుండా చేశారని గ్రామానికి చెందిన ఎం.హరిబాబు ఫిర్యాదు చేశా డు. ఆట స్థలాన్ని ఆక్రమించిన వారిపై చర్యలు తీసుకుని ఆ స్థలాన్ని తిరిగి స్కూల్‌కు కేటాయించాలని విజ్ఞప్తి చేశాడు.
` పల్నాడు జిల్లా నరసరావుపేట మండలం పమిడిమర్రు గ్రామానికి చెందిన గుర్రపుశాల రామకృష్ణ (టీడీపీ రజక సాధికార రాష్ట్ర కన్వీనర్) అనే వ్యక్తి విజ్ఞప్తి చేస్తూ.. నేను కేవలం తెలుగుదేశం పార్టీ నాయకుడిని అని మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి కక్షపూరితంగా మా కుటుంబ భూములను గ్రామంలోని కొంతమంది పేరుపై నమోదు చేయించి మా కుటుంబసభ్యులపై అక్రమ కేసులు పెట్టి వేధించారు. తమ భూములు తిరిగి ఇప్పించాలని విన్నవించుకున్నారు.
` అపార్ట్‌మెంట్‌లో మూడో ఫ్లోర్‌లో నివాసం ఉంటున్న తనను రెండో ఫ్లోర్‌లో ఉంటున్న వలిఖాన్, ఫిరోజ్‌ఖాన్ మెట్ల దగ్గర అడ్డుగా కూర్చొని ప్రతిరోజూ వేధిస్తున్నారని కడప జిల్లాకు చెందిన వివాహిత పి.రమాదేవి ఆవేదన వ్యక్తం చేసింది. తనను, తన కుమారుడిని కొట్టి సెల్‌ఫోన్ కూడా పగులగొట్టి కులం పేరుతో దూషించారు..వారిపై ఎస్సీ అట్రాసిటీ కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేసింది.
` తిరుపతి జీపాళ్యం పంచాయతీ కురకాల్వ గ్రామానికి పి.లక్ష్మి సమస్యను వివరి స్తూ 2012లో ప్రభుత్వం ఇచ్చిన భూమిని చంద్రయ్య, సురేష్, నల్లపాళం శీనయ్య అనే వ్యక్తులు కబ్జా చేయాలని మా ఇంటిని కూల్చివేశారు. అధికారులకు ఫిర్యాదు చేస్తే చంపే స్తామని బెదిరిస్తున్నారు. వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుని ఇంటిని ఇప్పించాలని వినతిపత్రం ఇచ్చారు.
` టీడీపీ కార్యకర్తలమైన తమకు మాజీ డిప్యూటీ సీఎం నారాయణ, వైసీపీ సర్పంచ్ గాంధీ, నాయకులు కలిసి మా ఇంటికి దారి లేకుండా అడ్డుగా గోడ కట్టారని చిత్తూరు జిల్లా కార్వేటి నగరం మండలం కొల్లాగుంట గ్రామం రజిక కుటుంబానికి చెందిన సి.మెహనవల్లి ఫిర్యాదు చేశారు. ప్రశ్నించినందుకు 35 మంది వైసీపీ సైకో బ్యాచ్ తమ ఇంటిపై దాడి చేసి ఆ వీడియోలను సోషల్ మీడియాలో పోస్టు చేసి మా కుటుంబ పరు వు తీయటంతో తన చెల్లి ఆత్మహత్మ చేసుకుందని ఆవేదన వ్యక్తం చేశారు. దీనికి కారణ మైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.
` 2017లో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు 72 మందిని టెక్నికల్ బోటు సిబ్బం దిగా నియమించారని, వైసీపీ ప్రభుత్వం 2022 ఆగస్టులో తమను విధుల నుంచి తొల గించారని సెక్యూరిటీ పోలీస్ టెక్నికల్ బోటు సిబ్బంది ఆవేదన వ్యక్తం చేశారు. తిరిగి తమను విధుల్లోకి తీసుకోవాలని కోరారు.