అమరావతి (చైతన్య రథం): సాగునీటి సంఘాలకు ఎన్నికలను డిసెంబరు 14నుంచి నిర్వహించనున్నట్లు రాష్ట్ర జలవనరుల మంత్రి నిమ్మల రామానాయుడు వెల్లడిరచారు. గురువారం రాష్ట్ర సచివాలయం పబ్లిసిటీ సెల్లో పాత్రికేయులతో మాట్లాడుతూ వ్యవసాయం, రైతాంగమే రాష్ట్రానికి ప్రాణమనే ఉద్దేశ్యంతో ప్రతి నీటి బొట్టును ఒడిసిపట్టి, చివరి ఎకరం వరకూ సాగు నీరు అందజేయాలనే లక్ష్యంతో సాగునీటి సంఘాలను పునరుద్ధంచాలనే నిర్ణయాన్ని ప్రభుత్వం తీసుకుందన్నారు. సాగునీటి సంఘాలకు మూడు అంచెల్లో ఎన్నికలు జరుగుతాయన్నారు. తొలిరోజు సాగునీటి సంఘాల అధ్యక్షులు, ఉపాధ్యక్షులను, రెండోరోజు డిస్ట్రిబ్యూషన్ కమిటీలకు, మూడో రోజు ప్రాజెక్టు కమిటీలకు ఎన్నికలు జరుగుతాయన్నారు. సేవా దృక్పథంతో పనిచేసే వ్యక్తులు ఈ సంఘాలకు ప్రతినిధులుగా ఉండటం అవసరమని, అటువంటి ఎన్నికల్లో ఎటువంటి వర్గ, పార్టీ పోరు లేకుండా సాధ్యమైనంత మేర ఏకగ్రీవంగా ప్రతినిధులను ఎన్నుకోవాలని అధికారులను ఆదేశించారన్నారు.
దేశానికి వెన్నెముక అయిన రైతాంగం సంక్షేమాన్ని కాంక్షిస్తూ 2015లో తమ ప్రభుత్వం సాగునీటి సంఘాలను ఏర్పాటు చేసి ఎన్నికల ద్వారా ప్రతి నిధులను ఎన్నుకోవడం జరిగిందన్నారు. అయితే గత ప్రభుత్వం వాటి విలువను గుర్తించకుండా 2020లో సాగు నీటి సంఘాలను అన్నింటినీ రద్దు చేసిందన్నారు. రైతులు, వ్యవసాయంపై గత ప్రభుత్వానికి ఉన్న నిర్లక్ష్యధోరణికి ఇది నిదర్శనంమన్నారు. గత ప్రభుత్వం సాగునీటి పారుదల ప్రాజెక్టుల నిర్వహణకు ఎటువంటి నిధులు విడుదల చేయకుండా ప్రాజెక్టులను అన్నింటినీ గాలికి వదిలేసిందన్నారు. ఫలితంగా గుండ్లకమ్మ, పులిచింతల, అన్నమయ్య ప్రాజెక్ట్ గేట్లు కొట్టుకు పోవడం జరిగిందన్నారు. ఈ మధ్య రైవస్ కెనాల్ గేటు కూడా కొట్టుకు పోయిందన్నారు. ఆయన తెలిపారు. అటు వంటి పరిస్థితులు తిరిగి పునరావృతం కాకుండా ఉండేందుకే తమ ప్రభుత్వం సాగునీటి ప్రాజక్టుల నిర్వహణకు అత్యధిక ప్రాధాన్యత నిస్తున్నట్లు ఆయన వెల్లడిరచారు.